పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
7 అక్టోబర్ 2022న భారత్ - అమెరికా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్‌పై (యుఎస్‌ఐఎస్‌సీఈపీ) మంత్రివర్గస్థాయి చర్చలు
- ఈ చర్చలకు సహ-అధ్యక్షులుగా భారత పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి, అమెరికా దేశ ఇంధన కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్‌హోమ్‌లు
- వాతావరణాన్ని తట్టుకునే పట్టణ మౌలిక సదుపాయాలపై ప్రపంచ బ్యాంకు అధికారులతో సంభాషించనున్న శ్రీ హర్దీప్ ఎస్. పూరి
Posted On:
05 OCT 2022 12:55PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి 6-11 అక్టోబర్ 2022 వరకు అమెరికా పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి వాషింగ్టన్ డీసీ, అమెరికా హ్యూస్టన్‌లోని అధికారిక మరియు వ్యాపార ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించనున్నారు. వాషింగ్టన్ డీసీలో గౌరవనీయులైన మంత్రి అమెరికా -ఇండియా స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్ (యుఎస్ఐఎస్‌సీఈపీ) యొక్క మంత్రివర్గ స్థాయి చర్చలలో కూడా మంత్రి పాల్గొననున్నారు. 7 అక్టోబర్ 2022న అమెరికాలోని ఇంధన కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్‌హోమ్‌తో కలిసి ఈ చర్చలను మంత్రి
నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2021లో వాతావరణంపై జరిగిన లీడర్స్ సమ్మిట్‌లో గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మరియు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు ప్రకటించిన అమెరికా-ఇండియా క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా-2030 భాగస్వామ్య ఒప్పందం అనుగుణంగా యుఎస్ఐఎస్‌సీఈపీ పునరుద్ధరించబడింది. ఈ భాగస్వామ్యం శక్తి భద్రత మరియు ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళుతుంది; అభివృద్ధి చెందుతున్న క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలను పెంచడం; మరియు 5 కీలకమైన స్తంభాల వంటి అంశాల ద్వారా సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడానికి సంబంధించినది:
(i) బాధ్యతాయుతంగా ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా (ii) పవర్ మరియు ఇంధన సామర్థ్యం (iii) పునరుత్పాదక శక్తి (iv) సుస్థిర అభివృద్ధి (V) అత్యాధునిక ఇంధనాలు మరియు సాంకేతికతలు. వాతావరణాన్ని తట్టుకుని నిలిచే మేటి పట్టణ మౌలిక సదుపాయాలపై గౌరవ మంత్రి ప్రపంచ బ్యాంకు అధికారులతో కూడా చర్చిస్తారు.. వాషింగ్టన్ డీసీలో అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్‌తో మరియు హ్యూస్టన్‌లో అమెరికా ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌తో జరిగే రెండు ఎగ్జిక్యూటివ్ రౌండ్‌టేబుల్స్‌లో కూడా మంత్రి పాల్గొంటారు. గౌరవనీయులైన మంత్రి US ఆధారిత ఇంధన సంస్థల CEO లతో కూడా చర్చలు జరుపుతారు.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఇందరన సంస్థల సీఈఓలతో కూడా మంత్రి చర్చలు జరపనున్నారు.
***
(Release ID: 1865438)
Visitor Counter : 170