ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగిసిన రాష్ట్రాల ఐటి శాఖ మంత్రుల మూడు రోజుల డిజిటల్ ఇండియా కాన్ఫరెన్స్


వచ్చే 500 రోజుల్లో రూ.26,000 కోట్లతో 25,000 టవర్ల ఏర్పాటుకు ఆమోదం

రూ.2000 కోట్ల మూలధన వ్యయానికి రాష్ట్రాలకు ప్రత్యేక సాయం అందించేందుకు మద్దతు

ఐటి రూల్స్, డేటా గవర్నెన్స్, డిజిటల్ ఇండియా భాషిని, డిజిటల్ పేమెంట్, మై స్కీమ్ , మేరీ పెహ్ చాన్ లపై సమావేశం ప్రత్యేక దృష్టి

స్టార్టప్ లు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు, స్కిల్లింగ్, డిజిటల్ గవర్నెన్స్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ లను ప్రోత్సహించడంపై ప్యానెల్ చర్చలు

Posted On: 04 OCT 2022 9:13AM by PIB Hyderabad

ఢిల్లీలో అక్టోబర్ 1న ప్రారంభమైన మూడు రోజుల రాష్ట్రాల ఐ టి శాఖ మంత్రుల 'డిజిటల్ ఇండియా సమావేశాలు సోమవారం నాడు ముగిసాయి.

తొలి రోజు కమ్యూనికేష న్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రాధాన్య రంగాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తో సవివరమైన చర్చలు జరిగాయి. దీనికి ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్,  కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవ్ సింగ్ చౌహాన్, ఇంకా ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మిజోరాం, సిక్కిం , పుదుచ్చేరి మొదలైన12 రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల ఐటి మంత్రులు హాజరయ్యారు.

శ్రీ అశ్విని వైష్ణవ్ తన ముగింపు ప్రసంగంలో, డిజిటల్ ఇండియాకు , దేశంలోని ప్రతి మూలకు దాని విస్తరణ కు ఈ కనెక్టివిటీ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాబోయే 500 రోజుల్లో కొత్తగా 25,000 టవర్లను ఏర్పాటు చేయడానికి రూ.26,000 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన ప్రకటించారు. ప్రధాన మంత్రి గతిశక్తి లో త్వరగా ఆన్ బోర్డింగ్ చేసినందుకు అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను

ఆయన అభినందించారు. రూ.2000 కోట్ల విలువైన మూలధన వ్యయానికి సంబంధించి రాష్ట్రాలకు ప్రత్యేక సాయాన్ని అందించామని ఆయన తెలిపారు. రాష్ట్రాలు చురుగ్గా ఉండాలని, తమ రాష్ట్రాల్లోని వ్యాపారాలను ఆకర్షించడానికి వ్యాపార స్నేహపూర్వక విధానాలను రూపొందించాలని ఆయన సూచించారు. సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్ నినాదాన్ని నొక్కిచెప్పిన ఆయన, డిజిటల్ ఇండియాను ఉన్నత స్థాయికి

తీసుకువెళ్లడం లోను, ఆత్మనిర్భర్ భారత్,

ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సాకారం చేసుకోవడంలోను పెద్ద, చిన్న సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్రాల నుంచి వచ్చిన నిబద్ధత కీలకమని అన్నారు.

రెండో రోజు అంటే 2, అక్టోబర్ 2022న, ‘ఐ టి రూల్స్, ఆన్ లైన్ గేమింగ్ , డేటా గవర్నెన్స్, , డిజిటల్ ఇండియా భాషిని,  డిజిటల్ పేమెంట్', మై స్కీమ్ , మేరీ పేహ్ చాన్ ,వంటి ముఖ్యమైన అంశాలపై మూడు సెషన్లను

ఎం ఇ ఐ టి వై నిర్వహించింది. మై స్కీమ్ లో అర్హత/ప్రొఫైల్ ఆధారిత సర్వీస్ డిస్కవరీపై డెమో చూపించారు. ఎం ఇ ఐ టి వై  కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ  తన ముగింపు ప్రసంగం లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, రూపొందిస్తున్న విధానాలకు అనుగుణంగా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తమ విధానాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. పౌర కేంద్రిత, వ్యాపార కేంద్రిత సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా కార్యక్రమాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సద్వినియోగం చేసుకోవాలని, ఫలితంగా మరింత జీవన సౌలభ్యం, వ్యాపారాన్ని సులభతరం చేయాలని ఆయన అన్నారు.

మూడో రోజు 'స్టార్టప్ లను టైర్ 2 నగరాలకు ఆకర్షించడం, వాటిని కొనసాగించడం', 'పబ్లిక్ సర్వీసెస్ లో ఎమర్జింగ్ టెక్ ఉపయోగం', 'మేకింగ్ ఇండియా టాలెంట్ నేషన్', 'స్టేట్స్ లో డిజిటల్ గవర్నమెంట్ రియలైజేషన్', 'మేక్ ఇన్ ఇండియా ఫర్ ది గ్లోబ్ - ఇండియా యాజ్ సెమీకండక్టర్ నేషన్' అనే అంశాలపై ఐదు ప్యానెల్ గోష్టులను డిస్కషన్ లను ఎం ఇ ఐ టి వై  నిర్వహించింది. మ్యాప్ మై ఇండియా సీఈఓ శ్రీ రోహన్ వర్మ, వాధ్వానీ సీఈఓ శ్రీ ప్రకాశ్ కుమార్, నాస్కామ్ ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జాని ఘోష్, టాటా సన్స్ సీనియర్ గవర్నమెంట్ అఫైర్స్ ఆఫీసర్ శ్రీ తన్మయ్ చక్రవర్తి, టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ ఎండి శ్రీ సంతోష్ కుమార్ తదితరులు ప్రధాన ఉపన్యాసాలు చేశారు. ప్యానెల్ చర్చను ఎం ఇ ఐ టి వై  కి చెందిన సీనియర్ అధికారులు మోడరేట్ చేశారు, ప్యానెల్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.

ఎం ఇ ఐ టి వై కార్యదర్శి శ్రీ అల్కేశ్ కుమార్ శర్మ తన ముగింపు ప్రసంగంలో, అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు తమ రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాల తాజా పురోగతిని పంచుకున్నందుకు గాను అభినందించారు. పారిశ్రామిక దృక్పథాలు, ప్రపంచ అత్యుత్తమ విధానాలను పంచుకోవడం కోసం పారిశ్రామిక ప్రాతినిధ్య సహకారాన్ని కూడా ఆయన ప్రశంసించారు. టైర్ -1 నగరాలకు మించి టెక్నాలజీ స్టార్ట ప్

లను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం

కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో సహకారం, స్టార్టప్ స్నేహపూర్వక విధానాలు ప్రోత్సాహకాల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై, ఏ ఐ, బ్లాక్ చైన్, డ్రోన్, ఐ ఒ టి మొదలైన వాటిని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం , డేటా ప్రాసెస్ ఆధారిత ఆవిష్కరణల ఆవశ్యకత గురించి కూడా ఆయన నొక్కిచెప్పారు. పోటీ ధర కు అధిక నైపుణ్యం కలిగిన వనరును పొందడానికి భారతదేశం మొదటి ఎంపిక గమ్యస్థానం అని ఆయన పేర్కొన్నారు.

టీమ్ ఇండియా - యువత ను , వృత్తి నిపుణులను భవిష్యత్ కుసన్నద్ధం చేయడానికి , టాలెంట్ నేషన్ గా భారతదేశాన్ని మార్చడానికి లోతైన టెక్నాలజీలపై నిరంతరం శిక్షణ/రీట్రైనింగ్ అందించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు , విద్యా సంస్థలు కలిసి పనిచేయాలి. డిజిటల్ బై డిఫాల్ట్' అప్రోచ్ , ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్రెజెన్స్ లెస్, కాంటాక్ట్ లెస్, పేపర్ లెస్, ఎనీటైమ్, ఎనీవేర్ , ఇన్వైట్ లెస్ సేవలు వ్యక్తిగత, చురుకైన సేవలను మెరుగుపరచడానికి,  అందించడానికి ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ను ఏర్పాటు చేయడం, తద్వారా ఉపాధిని సృష్టించడం, డిజిటల్ ఎకానమీకి విలువ జోడింపును వేగవంతం చేయడం పరంగా ఒక పెద్ద అవకాశాన్ని ఉపయోగించుకోవడం అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం

ప్రకటించిన ప్రోత్సాహకాలతో పాటు, రాష్ట్ర స్థాయి స్నేహపూర్వక విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు  ఉద్యోగాలను, ఆదాయాన్ని అందించే కంపెనీలను ఆకర్షించడానికి మార్గదర్శకమైన శక్తిగా నిలుస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు.

ఎం ఇ ఐ టి వై సంయుక్త కార్యదర్శి శ్రీ సుశీల్ పాల్ వందన సమర్పణతో సమావేశాలు

ముగిసాయి.

 

***


(Release ID: 1865221) Visitor Counter : 166