రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నూత‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆర్డినెన్స్ (సి&ఎస్‌)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంజీవ్ కిషోర్

Posted On: 04 OCT 2022 1:44PM by PIB Hyderabad

ఇండియ‌న్ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ స‌ర్వీస్ (ఐఒఎఫ్ఎస్‌) బైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీ ఎంకె గ్రాగ్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డంతో ఐఒఎఫ్ఎస్‌కు చెందిన 1985 బ్యాచ్ అధికారి శ్రీ సంజీవ్ కిషోర్ 01-10-2022న ఆయ‌న స్థానంలో ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. డిజిఒ (సి&ఎస్‌)గా బాధ్య‌త‌లు స్వీక‌రించే ముందు శ్రీ కిషోర్ డైరెక్టొరేట్ ఆఫ్ ఆర్డినెన్స్ (కోఆర్డినేష‌న్ & స‌ర్వీసెస్‌), కోల్‌క‌తకు అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా ఉన్నారు. 
అంత‌కుముందు శ్రీ కిషోర్ భార‌త ప్ర‌భుత్వం 2021లో ఏర్పాటు చేసిన ఏడు నూత‌న డిపిఎస్‌యుల‌లో ఒక‌టైన ఆర్మ‌ర్డ్ వెహికిల్స్ నిగ‌మ్ లిమిటెడ్ (ఎవిఎన్ఎల్‌)కు తొలి సిఎండిగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌హా ప‌లు సీనియ‌ర్ ప‌ద‌వుల‌లో ప‌ని చేశారు.  ఆయ‌న ఆర్మ‌ర్డ్ గ్రూప్ ఆఫ్ ఫ్యాక్ట‌రీల‌ను ప్ర‌భుత్వ విభాగం నుంచి కార్పొరేష‌న్‌గా ఎటువంటి స‌మ‌స్య‌లూ లేకుండా మారేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో ఎవిఎన్ఎల్ తొలి ఆరునెల‌ల వ్యాపారంలోనే లాభాల‌ను న‌మోదు చేసింది.
ఆయ‌న‌ను సిఎండిగా నియ‌మించే ముందు, శ్రీ కిషోర్‌ను హెవీ వెహికిల్ ఫ్యాక్ట‌రీ (హెచ్‌విఎఫ్‌) ఆవ‌డి సీనియ‌ర్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా, ఆప్టో ఎల‌క్ట్రానిక్స్ ఫ్యాక్ట‌రీ (ఒఎల్ఎఫ్‌), డెహ్రాడూన్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా  కూడా నియ‌మించారు.  
వివిధ సాంకేతిక ప‌ర్యావ‌ర‌ణాల‌లో భిన్న పాత్ర‌ల‌లో శ్రీ కిషోర్ సేవ‌ల‌ను అందించారు. ర‌క్ష‌ణ ఉత్ప‌త్తిని పెంచ‌డంలో విశిష్ట సేవ‌ల‌ను అందించినందుకు సంతు సహానే స్మార‌క షీల్డును, ఆయుధ్ భూష‌ణ్ అవార్డును ఆయ‌న అందుకున్నారు. 

 

***
 



(Release ID: 1865220) Visitor Counter : 133