గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అంతరాన్ని గమనించుకుంటూ ఎవరినీ , ఏ ప్రాంతాన్నీ వెనుకపడనివ్వద్దన్న నినాదంతో ప్రపంచ ఆవాస దినోత్సవం 2022 జరిగింది.
మనం మరింత దృఢమైన భవిష్యత్తును నిర్మించుకునే క్రమంలో ఏ పౌరుడిని ,ఏ స్థలాన్ని విడిచిపెట్టరాదని, ఈ నినాదం మనకు బలంగా గుర్తు చేస్తుంది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి
సమ్మిళిత , సమానఅభివృద్ధి పట్ల ప్రభుత్వ సంకల్పం అది అమలుచేస్తున్న ప్రధాన పట్టణ పథకాలు, కార్యక్రమాలలో కనిపిస్తోంది: శ్రీ హర్దీప్ ఎస్ పూరి
Posted On:
03 OCT 2022 4:53PM by PIB Hyderabad
ప్రపంచ ఆవాస దినోత్సవం 2022 ను ఈరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేస్తూ కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ ఎస్ పూరి, ఈ సంవత్సరం చేపట్టిన నినాదం, మనం దృఢమైన భవిష్యత్ నిర్మాణంలో ఏ వ్యక్తిని, ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టలేమని బలంగా గుర్తు చేస్తుందన్నారు.
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్ యుఎ) ప్రపంచ ఆవాస దినం 2022ను ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు శ్రీ హర్దీప్ ఎస్ పూరి, శ్రీ కౌశల్ కిషోర్, గృహ, ప్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, ఐక్యరాజ్యసమితి యుఎన్- హాబిటైట్ రెసిడెంట్ కో ఆర్డినేటర్ శ్రీ షోంబి షార్ప్, పలువురు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ శ్రీ హర్దీప్ ఎస్ పూరి, కోవిడ్ మహమ్మారి, నగరాలు, మానవ ఆవాసాలలో పెరుగుతున్న అసమానతలు, సవాళ్లను ముందుకు తెచ్చిందని అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పరివర్తనాత్మక పథంలో పయనించేలా జాతీయ, స్థానిక ప్రభుత్వాలను ఇది ఒక దగ్గరికి చేర్చించిందని అన్నారు. ఇండియాలో ఈ కృషి సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ రూపంలో కనిపించిందన్నారు.
ప్రపంచ ఆవాస దినోత్సవం 2022 థీమ్, మహాత్మా గాంధీ తాత్వికత అయిన అంత్యోదయ సే సర్వోదయను ప్రతిధ్వనింపచేస్తోందని అన్నారు. సమ్మిళిత, సమాన అభివృద్ధికి ప్రభుత్వ సంకల్పం, ప్రభుత్వం చేపట్టిన కీలక పట్టణ మిషన్‌లలో ప్రతిబింబిస్తోందన్నారు.
గృహ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టిన వివిధ పథకాల గురించి ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై), పిఎం స్వనిధి పథకం, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (డిఎవై-ఎన్‌యుఎల్ఎం), స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాలను పేద, అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగిందని చెప్పారు.
ఈ సంవత్సరం ప్రపంచ ఆవాస దినోత్సవం నినాదం , ఎవరినీ, ఏ ప్రాంతాన్ని వదలకుండా ముందుకు తీసుకువెళ్లడానికి అవకాశం కలిపిస్తుందని, ఈ అంశం గురించి చర్చించి వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. వాతావరణ మార్పుల లాగే, కోవిడ్ మహమ్మారి ఇండియాలోని నగర ప్రాంతాల లో మార్పులు తీసుకురానున్నదన్నారు. చారిత్రకంగా చూసినపుడు, ఇటువంటి ముప్పుల వల్ల నగర ప్రాంతాలలో శాశ్వత మార్పులకు దారి తీసినట్టు చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన నగర పునర్వికాస కార్యక్రమాలు, భారత నగరాలను స్వావలంబనతో కూడిన, ఉత్పాదక నగరాలుగా రూపుదిద్దుకోవడంతోపాటు భారతదేశం కోరుకుంటున్నట్టుగా పౌరుల సామాజిక ఆర్ధిక పరివర్తనకు వీలు కల్పించనున్నాయి.
ఎవరినీ వెనుక పట్టు పట్టనివ్వకుండా 2030 నాటికి ఇండియా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించగలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ కౌశల్ కిషోర్ మాట్లాడుతూ,నగరాలు, పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆర్ధిక, సామాజిక,పర్యావరణ పరంగా సుస్థిరత కలిగి ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాగల పాతికేళ్లు ఉండాలని పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్యసమితి, ప్రతి ఏడాది అక్టోబర్ నెల మొదటి సోమవారాన్ని ప్రపంచ ఆవాస దినోత్సవం గా ప్రకటించింది. మన ఆవాసాల తీరుతెన్నులను ప్రతిబింబించేందుకు, తగిన ఆవాసం అనేది మౌలిక హక్కు అన్నదానిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన భవిష్యత్ నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దే బాధ్యత, శక్తి మనందరిపై ఉందని ప్రపంచ ప్రజలకు గుర్తు చేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
2022 లో ప్రపంచ ఆవాస దినోత్సవం ( డబ్ల్యుహెచ్ డి 2022), మైండ్ ది గ్యాప్, లీవ్ నో వన్, అండ్ ప్లేస్ బిహైండ్ అన్నది నినాదం. ఇది నగరాలు, మానవ ఆవాసాలలో పెరుగుతున్న అసమానతలు, సవాళ్లపై దృష్టిసారించనుంది. ప్రపంచ ఆవాస దినోత్సవం 2022 కోవిడ్ 19, వాతావరణం, సంఘర్షణల వంటి మూడు సిల కారణంగా నానాటికీ పెరుగుతున్న అసమానతలు, దయనీయ పరిస్థితులపై దృష్టిపెడుతుంది.
***
(Release ID: 1864994)
Visitor Counter : 146