రైల్వే మంత్రిత్వ శాఖ
నూతన అఖిలభారత రైల్వే టైంటేబుల్లో 500 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను వేగవంతం చేసి, 130 సేవలు (65 జతలు)ను సూపర్‌ఫాస్ట్ వర్గంలోకి మార్పు
1 అక్టోబర్ 2022 నుంచి అందుబాటులోకి వచ్చే ట్రెయిన్స్ ఎట్ ఎ గ్లాన్స్ ను విడుదల చేసిన రైల్వేలు
2022-23లో మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ భారతీయ రైల్వేల సమయపాలన దాదాపు 84%
Posted On:
03 OCT 2022 5:23PM by PIB Hyderabad
రైల్వేల మంత్రిత్వ శాఖ 1 అక్టోబర్ 2022న ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (టిఎజి ) అన్న పేరుతో నూతన అఖిలభారత రైల్వే టైమ్ టేబుల్ (కాల ప్రణాళిక)ను విడుదల చేసింది. ఈ నూతన ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ భారతీయ రైల్వేల అధికారిక వెబ్ సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఇండియన్‌రైల్వేస్. గవ్. ఇన్ (www.indianrailways.gov.in. )లో Link is https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537,2789లో అందుబాటులో ఉంటుంది.
నూతన టైమ్ టేబుల్‌లో దాదాపు 500 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను వేగవంతం చేశారు. ఈ రైళ్ళను 10 నిమిషాల నుంచి 70 నిమిషాల వరకు వేగవంతం చేశారు. ఇందుకు అదనంగా, 130 సేవలు (65 జతలు)ను సూపర్‌ఫాస్ట్ వర్గంగా మార్చడం ద్వారా వేగాన్ని పెంచారు.
మొత్తం మీద అన్ని రైళ్ళ సగటు వేగం 5% పెంచడంతో మరిన్ని రైళ్ళను నడిపేందుకు దాదాపు 5% అదనపు మార్గాలు అందుబాటులో ఉండనున్నాయి.
మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు సంబంధించి భారతీయ రైల్వేల సమయపాలన 2022-23లో 84%గా ఉంది. ఇది 2019-20లో సాధించిన 75% సమయపాలనకన్నా 9% అధికం.
నూతన టైం టేబుల్‌లోని ఇతర ముఖ్యాంశాలను https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1863836 అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
***
(Release ID: 1864992)