భారత ఎన్నికల సంఘం
మహారాష్ట్ర, బీహార్, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా లో అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్
Posted On:
03 OCT 2022 2:58PM by PIB Hyderabad
మహారాష్ట్ర, బీహార్, హర్యానా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీ లలో ఖాళీ స్థానాలను లను భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది:-
వరస నెం.
|
రాష్ట్రం పేరు
|
అసెంబ్లీ స్థానం సంఖ్య / పేరు
|
1.
|
మహారాష్ట్ర
|
166- అంధేరి తూర్పు
|
2.
|
బీహార్
|
178-మోకామా
|
3.
|
బీహార్
|
101-గోపాల్గంజ్
|
4.
|
హర్యానా
|
47-ఆడంపూర్
|
5.
|
తెలంగాణ
|
93-మునుగోడు
|
6.
|
ఉత్తర ప్రదేశ్
|
139-గొలాగోక్రనాథ్
|
7-
|
ఒడిషా
|
46-ధామ్నగర్
|
ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:
అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
—-------------------------------------------------
ఎన్నికల ప్రక్రియ
|
షెడ్యూల్
|
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ
|
7 అక్టోబర్, 2022
(శుక్రవారం)
|
నామినేషన్ల చివరి తేదీ
|
14 అక్టోబర్, 2022
(శుక్రవారం)
|
నామినేషన్ల పరిశీలన తేదీ
|
15 అక్టోబర్, 2022
(శనివారం)
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
17 అక్టోబర్, 2022
(సోమవారం)
|
పోలింగ్ తేదీ
|
3 నవంబర్, 2022
(గురువారం)
|
కౌంటింగ్ తేదీ
|
6 నవంబర్, 2022
(ఆదివారం)
|
ఎన్నికల ప్రక్రియ పూర్తి తేదీ
|
8 నవంబర్, 2022
(మంగళవారం
|
1.ఓటర్ల జాబితాలు
పైన పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు 01.01.2022 నాటి ఓటర్ల జాబితాలు ఈ ఎన్నికలకు ఉపయోగించబడతాయి.
2.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్ లు
ఈ ఉప ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచామని, ఈ యంత్రాల సాయంతో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపింది.
3.ఓటర్ల గుర్తింపు
ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్) అనేది ఓటరును గుర్తించే ప్రధాన డాక్యుమెంట్. అయితే, దిగువ పేర్కొన్న ఏదైనా గుర్తింపు పత్రాలను కూడా పోలింగ్ స్టేషన్ వద్ద చూపించవచ్చు:
i.ఆధార్ కార్డు,
Ii.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎం ఎన్ ఆర్ ఇ జి ఎ) జాబ్ కార్డు,
iii.ఫోటోగ్రాఫ్ తో కూడిన బ్యాంక్/పోస్టాఫీస్ పాస్ బుక్ లు,
iv. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడ్డ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,
v.డ్రైవింగ్ లైసెన్స్,
vi. పాన్ కార్డ్,
vii. ఎన్ పి ఆర్ కింద ఆర్ జిఐ ద్వారా జారీ చేయబడ్డ స్మార్ట్ కార్డు,
viii. ఇండియన్ పాస్ పోర్ట్,
ix. ఫోటోగ్రాఫ్ తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్,
x.కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/పిఎస్ యులు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడ్డ ఫోటోగ్రాఫ్ తో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డులు,
xi. ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు.
xii. సామాజికన్యాయ , సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజబిలిటీ ఐడి (యు డి ఐ డి) కార్డు,
4. ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)
2017, జూన్ 29న (కమిషన్ వెబ్ సైట్ లో లభ్యం అవుతుంది) కమిషన్ ఆదేశాల నెంబరు. 437/6/1NST/2016-CS ద్వారా జారీ ఆయన పాక్షిక సవరణకు లోబడి, ఎన్నికలకు వెళ్లే పార్లమెంటరీ/అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం లేదా ఏదైనా భాగాన్ని చేర్చిన జిల్లా(లు)లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ) తక్షణం అమల్లోకి వస్తుంది.
5. నేరచరిత్ర కు సంబంధించిన సమాచారం
నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ప్రచార కాలంలో మూడు పర్యాయాలు వార్తాపత్రికలు , టెలివిజన్ ఛానెళ్ల ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించాల్సి ఉంటుంది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను నియమించే ఏ రాజకీయ పార్టీ అయినా తన అభ్యర్థుల నేర నేపథ్యం గురించిన సమాచారాన్ని తన వెబ్ సైట్ లోనూ, వార్తాపత్రికలు , టెలివిజన్ ఛానళ్లలోనూ మూడు సందర్భాల్లో ప్రచురించాల్సి ఉంటుంది.
2020, సెప్టెంబర్ 16వ తేదీ నాటి తన లెటర్ నెంబరు 3/4/2019/ఎస్.డి.ఆర్/వాల్యూం 4 ద్వారా, కమిషన్ పేర్కొన్న కాలవ్యవధిని ఈ క్రింది విధంగా మూడు బ్లాకులతో నిర్ణయించాలని ఆదేశించింది, తద్వారా అటువంటి అభ్యర్థుల నేపథ్యం గురించి తెలుసుకోవడానికి ఓటర్లకు తగినంత సమయం ఉంటుంది:
*ఉపసంహరించుకున్న మొదటి 4 రోజుల్లోపు
*తరువాత 5 నుంచి 8వ తేదీల మధ్య.
*9వ రోజు నుంచి ప్రచారం చివరి రోజు వరకు (పోలింగ్ తేదీకి రెండో రోజు ముందు)
(ఉదాహరణ: ఉపసంహరణకు చివరి తేదీ నెల లో 10, పోలింగ్ నెల లో 24న ఉన్నట్లయితే, డిక్లరేషన్ ప్రచురణ మొదటి బ్లాక్ 11 -14వ తేదీ మధ్య ఉండాలి. రెండు, మూడవ బ్లాక్ లు వరసగా ఆ నెల 15 -18, 19 -22వ తేదీల మధ్య ఉండాలి.)
2015 రిట్ పిటిషన్ (సి) నెం. 784 (లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్) , రిట్ పిటిషన్ (సివిల్) నెంబరు 536 ఆఫ్ 2011 (పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్అండ్ ఓఆర్ఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆండ్ ఎఎన్ ఆర్) పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ ఆవశ్యకత ఉంది.
ఈ సమాచారం 'మీ అభ్యర్థులను తెలుసుకోండి' అనే యాప్ లో కూడా లభ్యం అవుతుంది.
6. ఉప ఎన్నికల సమయంలో కోవిడ్ సంబంధిత ఏర్పాట్లు-
దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిలో మొత్తం మెరుగుదల దృష్ట్యా , డిఎంఎ చట్టం కింద కోవిడ్ నిర్బంధ చర్యలను ఎన్ డి ఎం ఎ / ఎస్ డి ఎం ఎ డిఎంఎ ఉపసంహరించుకున్న దృష్ట్యా, భారత ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన సలహాలను అనుసరించాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల ప్రక్రియ సమయంలో- టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ , కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అనే ఐదు అంచెల వ్యూహంపై నిరంతరం దృష్టి పెట్టాలి. జిల్లా యంత్రాంగం కోవిడ్ పరిస్థితిని సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, . అవసరమైన చట్టపరమైన/పరిపాలనా నిబంధనలను సూచించడం ద్వారా కోవిడ్ సముచిత ప్రవర్తన నిబంధనలను అమలు చేయాలి.
****
(Release ID: 1864875)
Visitor Counter : 224