నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ 33వ సమావేశంలో అనేక ముఖ్యమైన ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఈ క్రింది విధంగా సిఫార్సులుచేసింది :
ఉత్తరప్రదేశ్/బీహార్ రాష్ట్ర సరిహద్దులో ఘాజీపూర్ నుంచి బల్లియా వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం
అంతరాష్ట్ర బహుళ రవాణా వ్యవస్థ అభివృద్ధి, సరకుల రవాణా కోసం ఉత్తరప్రదేశ్/బీహార్ రాష్ట్ర సరిహద్దులో ఘాజీపూర్ నుంచి బల్లియా వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది. ప్రతిపాదిత నాలుగు లైన్ల రహదారి ( గ్రీన్ ఫీల్డ్) ఆర్థిక కేంద్రాలకు ( లక్నో,వారణాసి, అజంఘర్,మౌ) రహదారి సౌకర్యం కలిగిస్తుంది. బక్సర్ వద్ద గంగా నదిపై వంతెనను స్పర్‌తో నిర్మిస్తున్నారు, ఇది దక్షిణ బీహార్ నుంచి ఢిల్లీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతరాయం లేకుండా వాహనాలు ప్రయాణించడానికి, అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యం కల్పించే ఈ రహదారి లక్నో - పాట్నా మధ్య ప్రయాణ సమయాన్ని 3.5 కి మీ/గం తగ్గిస్తుంది. ఈ జాతీయ రహదారి లక్నో డిఫెన్స్ కారిడార్‌కు రెండు పాయింట్ల వద్ద (బనారస్ మరియు ప్రువంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారి ) రహదారి సౌకర్యం కల్పిస్తుంది.
ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయడం
రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పాలియా - షాజహాన్‌పూర్ - హర్దోయ్ - లక్నో మధ్య నాలుగు లైన్ల బైపాస్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ఇండో-నేపాల్ సరిహద్దు రోడ్డు ప్రాజెక్టులో కీలకంగా ఉంటుంది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ చేపట్టిన ప్రాజెక్టు ఇండో-నేపాల్ సరిహద్దు కు రవాణా సౌకర్యం కల్పించి ఎస్ఎస్బీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. బార్డోయ్ నేషనల్ పార్క్‌కు రవాణా సౌకర్యం కలిగించే ఈ ప్రాజెక్టు సరుకు,వాహన రవాణా మెరుగుపరుస్తుంది.
ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్‌లోని మొరాదాబాద్ మరియు కాశీపూర్ బైపాస్‌లు.
రద్దీని మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 4-లేన్ బైపాస్ ప్రాజెక్ట్ (బ్రౌన్‌ఫీల్డ్) నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్- ఉత్తరాఖండ్-బైపాస్ మధ్య అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది, ఈ ప్రాంతంలో ప్రధాన ఆర్థిక కేంద్రాలను కలుపుతుంది. ఇది భారతదేశం - బంగ్లాదేశ్ మరియు భారతదేశం- భూటాన్ - బంగ్లాదేశ్‌కు వాణిజ్య మార్గంగా పనిచేస్తుంది. ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌కు రహదారి సౌకర్యం కలిగిస్తుంది.
ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సభ్యులు ప్రణాళిక, ఒకేసారి ప్రాజెక్టులను అమలు చేయడం లాంటి అంశాలపై పలు సూచనలు అందించారు. ప్రాజెక్ట్‌లకు వేగంగా అనుమతులు ఇవ్వడం,సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పీఎం గతిశక్తి జాతీయ ప్రాజెక్టు కింద , రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులను అమలు చేయడం సాధ్యమవుతుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ,రవాణా జాతీయ రహదారులు, టెలీకమ్యూనికేషన్ల శాఖ, విద్యుత్, పౌర విమానయాన శాఖ, రవాణా శాఖ, పోర్ట్ మంత్రిత్వ శాఖ, జలమార్గాలు, ప్రజా పనుల విభాగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల ప్రణాళిక విభాగం , నీతి ఆయోగ్ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి శాఖ ప్రతినిధులు నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సభ్యులుగా ఉన్నారు. పీఎం గతిశక్తి సచివాలయంగా డీపీఐఐటీ పనిచేస్తుంది.
పీఎం గతి శక్తి ప్రాజెక్టు కింద ఏర్పాటైన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ మూడు ప్రధాన అనుసంధాన రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఘాజీపూర్ నుంచి బల్లియా వరకు ఉత్తరప్రదేశ్ /బీహార్ సరిహద్దు వరకు 4- లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మొరాదాబాద్ మరియు కాశీపూర్ బైపాస్ రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేయాలని నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది.
బహుళ రవాణా వ్యవస్థ అభివృద్ధి, సులువుగా ప్రయాణించడం, భూసేకరణ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను ముఖ్యమైన ప్రాజెక్టులుగా నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ గుర్తించింది.

***