మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం కోసం దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ 15 అక్టోబర్ 2022వరకు పొడిగింపు
प्रविष्टि तिथि:
03 OCT 2022 3:52PM by PIB Hyderabad
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్ధులు 8వ తరగతిలో డ్రాప్ ఔట్ అవడాన్ని నిలువరించి, ద్వితీయ శ్రేణి విద్య కొనసాగించడాన్ని ప్రోత్సహించడం కోసం వారిలో ప్రతిభగల విద్యార్ధులకు అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం కింద స్కాలర్‌షిప్‌ల కింద 2022-23 సంవత్సరంలో ఎన్ఎంసిఎంఎస్ఎస్ కింద దరఖాస్తులను సమర్పించేందుకు తేదీని 15అక్టోబర్ 2022 వరకు పొడిగించారు. ప్రతి సంవత్సరం 9వ తరగతి నుంచి ఎంపిక చేసిన విద్యార్ధులకు కొత్తగా లక్ష స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు. దీనితో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు 10 నుంచి 12 తరగతులలో ఉన్న వారికి స్కాలర్‌షిప్ కొనసాగింపు/ పునరుద్ధరణ చేయనున్నారు. సంవత్సరానికి స్కాలర్‌షిప్ మొత్తం రూ. 12000/- గా ఉండనుంది.
విద్యార్ధుల అందించే స్కాలర్‌షిప్ పథకాల కోసం ఏర్పాటు చేసిన వన్ స్టెప్ వేదిక అయిన నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పి) లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని (ఎన్ఎంఎంఎస్ఎస్) చేర్చడం జరిగింది. ఎన్ఎంఎస్ఎస్ స్కాలర్‌షిప్‌లను డిబిటి పద్ధతిని అనుసరించి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎంఎస్ - ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) ద్వారా ఎంపిక చేసిన విద్యార్ధుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా పంపిణీ చేయనున్నారు. ఇది 100% కేంద్ర ప్రాయోజిత పథకం.
తల్లిదండ్రుల ఆదాయం అన్ని మార్గాల నుంచి ఏడాదికి రూ. 3,50,000/- కు మించకుండా ఉన్నవారు స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులు అవుతారు. స్కాలర్‌షిప్ పొందేందుకు నిర్వహించే ఎంపిక పరీక్షకు హాజరుకానున్న విద్యార్ధులు 7వ తరగతి పరీక్షలలో కనీసం 55% మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌ను పొంది ఉండాలి (ఎస్/ ఎస్‌టి విద్యార్ధులకు 5% సడలింపు).
ఐఎన్ఒ స్థాయి (ఎల్1) ధ్రువీకరణకు చివరి తేదీ 31 అక్టోబర్ 2022 కాగా, డిఎన్ఒ స్థాయి (ఎల్2) ధ్రువీకరణకు ఆఖరు తేదీ 15 నవంబర్, 2022.
***
(रिलीज़ आईडी: 1864810)
आगंतुक पटल : 237