జల శక్తి మంత్రిత్వ శాఖ

గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా, క్లీన్ గంగ జాతీయ మిషన్ నేతృత్వంలో ఢిల్లీలోని ఐటిఓ ఛత్ ఘాట్ వద్ద పరిశుభ్రత డ్రైవ్‌


ప్రక్షాళన డ్రైవ్ సమయంలో ఛత్ ఘాట్ మొత్తం శుభ్రం

ఎన్ఎంసిజి 1300 ఎంఎల్డి ఎస్టిపి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంతో, రాబోయే నెలల్లో
నీటి నాణ్యతలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది

యమునా నది పట్ల ఢిల్లీ ప్రజలు గర్వపడాలని మా ఆకాంక్ష : డీజీ , ఎన్ఎంసిజి

Posted On: 02 OCT 2022 5:23PM by PIB Hyderabad

గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ ఢిల్లీలోని ఐటీఓ  ఛత్ ఘాట్‌లో భాగస్వామ్య ఎన్జిఓలు, డిజేబి, ఎంసిడి, సహకారంతో పరిశుభ్రత డ్రైవ్‌కు నాయకత్వం వహించారు. విద్యార్థులు, గంగా విచార్ మంచ్, వాలంటీర్లు తదితరులు స్వచ్ఛత కార్యక్రమంలో ఛత్ ఘాట్ మొత్తం శుభ్రం చేశారు. ఎస్వైఏ, వైఎస్ఎస్, ట్రీ క్రేజ్ ఫౌండేషన్, భారతీయం, ఎఫ్ఓవై, ఆర్వైఎఫ్, ఎన్జిఓలు పాల్గొన్నారు. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్, యూబిఎస్ఎస్ మొదలైనవి ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా దివస్‌ను పాటిస్తారు.

నమామి గంగే కార్యక్రమం కింద ఎన్ జి ఓలు, ఇతర భాగస్వామ్యుల  మద్దతుతో ఫిబ్రవరి 2022 నుండి ప్రతి నెలలోని ప్రతి 4వ శనివారం,  నెలలో ఒక ముఖ్యమైన రోజున ఢిల్లీలోని యమునా నది ఒడ్డున రెగ్యులర్ క్లీనెస్ డ్రైవ్‌లు జరుగుతాయి. తాము యమునా నది, ముఖ్యంగా ఢిల్లీ స్ట్రెచ్ శుభ్రపరచడంపై దృష్టి పెడుతున్నారుని డీజీ శ్రీకుమార్ తెలిపారు. 2022లో ఢిల్లీలో 1300 ఎంఎల్డి కంటే ఎక్కువ మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్ఎంసిజి ఎస్టీపి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంతో, రాబోయే నెలల్లో నీటి నాణ్యతలో వ్యత్యాసం కనిపిస్తుందని శ్రీ కుమార్ అన్నారు. ఢిల్లీ ప్రజలు యమునా నదిని చూసి గర్వపడేలా చేస్తామని ఆయన చెప్పారు. గత ఏడాది కాలంలో నమామి గంగే కార్యక్రమం కింద ప్రాజెక్టులు వేగవంతమయ్యాయని, గంగా బేసిన్‌లో 2022 నాటికి 1300 ఎంఎల్డి శుద్ధి సామర్థ్యం పూర్తవుతుందని శ్రీ కుమార్ తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా సహజ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతోపాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

 

 

 

కూడా అర్థ గంగా కింద, నది ఒడ్డున గంగా హారతి లను నిర్వహించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిపారు. స్వచ్ఛతా దివస్ సందర్భంగా, సహకార భారతి మద్దతుతో ఢిల్లీలోని సుర్ ఘాట్‌లో ఎన్ఎంసిజి ‘జై శ్రీ యమునా ఆరతి’ని నిర్వహించింది. గంగా నది ఉపనదులను శుభ్రపరచడం, ముఖ్యంగా యమునా నదిని పునరుద్ధరించడం నమామి గంగే కార్యక్రమం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఒక 318 ఎంఎల్డి సామర్థ్యం గల ఎస్టిపి ఇటీవల ప్రారంభం అయింది. నమామి గంగే కార్యక్రమం కింద 3 ఇతర ప్రధాన ఎస్టిపి లను డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో రిథాలా, కొండ్లీ మరియు ఓఖ్లా ఉన్నాయి, ఇవి ఆసియాలోని అతిపెద్ద ఎస్టిపి లలో ఒకటి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే యమునాలోని కాలువల నుంచి మురుగునీరు చేరకుండా నిరోధించవచ్చు.

 

 

***



(Release ID: 1864795) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Marathi , Hindi