రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పెండింగ్ సూచనల పరిష్కారం, స్వచ్ఛత కోసం ప్రత్యేక ప్రచారం 2.0ను ప్రారంభించిన రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్)
Posted On:
02 OCT 2022 2:54PM by PIB Hyderabad
స్వచ్ఛత, పెండింగ్‌లో ఉన్న సూచనలను పరిష్కరించడం కోసం రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) ప్రత్యేక ప్రచారం 2.0ను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖలోనూ, దాని ఆధీన కార్యాలయాలైన ఎన్‌హెచ్ఎఐ, ఎన్‌హెచ్ఐడిసిఎల్, ఐఆర్‌సి & ఐఎహెచ్ఇలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ప్రచారం 2.0 కింద పారిశుద్ధ్య డ్రైవ్‌ను ఎంఒఆర్‌టిహెచ్, ఎన్‌హెచ్ఎఐ, ఎన్‌హెచ్ఐడిసిఎల్ క్షేత్ర కార్యాలయలు, టోల్ ప్లాజాలు, దారి పక్క సౌకర్యాలు సహా 1200 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది చేత ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఎంఒఆర్‌టిహెచ్ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానె స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. ఎంపి సూచనలు, పిఎంఒ సూచనలు, ప్రజా సమస్యలు, పార్లమెంటు హామీలు తదితర భిన్న వర్గాలకు చెందిన పెండింగ్ సూచనలను ఈ ప్రచార కాలంలో పరిష్కరించవలసిందిగా ఆయన అధికారులకు పిలుపిచ్చారు. మంత్రిత్వ శాఖ, దాని ఆధీన కార్యాలయాలు నిర్ణయాలు చేసేటప్పుడు గరిష్టంగా 4 స్థాయికి సంబంధించిన ఆదశాలను ఖచ్చితంగా పాటించాలని కూడా ఆయన ఆదేశించారు.
ఎన్‌హెచ్ఎఐ, ఎన్‌హెచ్ఐడిసిఎల్ కూడా ప్రచారానికి నాంది పలుకుతూ దేశవ్యాప్తంగా ఉన్న తమ అధికారులు, ఉద్యోగులందరికీ స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించాయి.
అవినీతిరహిత వ్యవస్థను ఖరారు చేయడానికి అన్ని అధికారిక వ్యవహారాలలో సంపూర్ణ సమగ్రతను, అత్యంత శుభ్రతను కలిగి ఉండాలని అధికారులకు కార్యదర్శి సూచించారు. ప్రజల అవసరాల పట్ల అధికారులు ప్రతిస్పందనాత్మకంగా ఉంటూ, త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రచార సమయంలో జాతీయ రహదారులలో గుంతలు లేకుండా చూడాలని, రైట్ ఆఫ్ వేస్ (ఆర్ఒడబ్ల్యు)ను ప్రచార కాలంలో ప్రత్యేక కృషి చేయాలని కార్యదర్శి ఆదేశించారు.
కార్యాలయ ఆవరణను చక్కగా, పరిశుభ్రంగా ఉంచడంలో హౌజ్‌కీపింగ్ కృషిని గుర్తిస్తూ, వారికి మెమెంటోను కార్యదర్శి అందించారు. అధికారులు, సిబ్బందితో కలిసి ట్రాన్స్‌పోర్ట్ భవన్ ఆవరణలో శ్రమదానం చేశారు. మొత్తం పారిశుద్ధ్యాన్నిపరిశీలించేందుకు ఆయన ట్రాన్స్‌పోర్ట్ భవన్ ఆవరణను చుట్టి వచ్చారు.
***
(Release ID: 1864678)
Visitor Counter : 117