రైల్వే మంత్రిత్వ శాఖ
2022 సెప్టెంబర్ నెలలో అత్యధికంగా 115.80 ఎంటీ సరుకులు రవాణా చేసిన రైల్వే
గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.14% పైగా వృద్ధి సాధించి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 736.68 ఎంటీ వరకు సాగిన సరుకుల మొత్తం రవాణా
Posted On:
02 OCT 2022 10:24AM by PIB Hyderabad
సరుకు రవాణాలో భారతీయ రైల్వే 2022 సెప్టెంబర్ నెలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. సెప్టెంబర్ నెలలో 115.80 ఎంటీ సరుకులు రైల్వే ద్వారా రవాణా అయ్యాయి. ఒక నెలలో ఇంత పరిమాణంలో సరుకులు రవాణా కావడం ఇదే తొలిసారి. 2021 సెప్టెంబర్ నెలతో పోల్చి చూస్తే సరుకు రవాణా 9.15% వరకు పెరిగింది. 2021 లో జరిగిన సరుకు రవాణా కంటే 2022 సెప్టెంబర్ నెలలో 9.7 ఎంటీ ఎక్కువ సరుకులు రవాణా అయ్యాయి. దీంతో వరుసగా 25 నెలల పాటు అత్యుత్తమ నెలవారీ సరుకుల రవాణా చేయడంలో రైల్వే విజయం సాధించింది.
సెప్టెంబర్ నెలలో బొగ్గు రవాణా మొత్తం 6.8 ఎంటీ వరకు పెరిగింది. ఇనుప ఖనిజం రవాణా 1.2 ఎంటీ, ఇతర సరుకుల రవాణా 1.22 ఎంటీ, సిమెంట్ రవాణా , కంకర రవాణా 0.4 ఎంటీ, ఎరువుల రవాణా 0.3 ఎంటీ వరకు వృద్ధి సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా వాహనాల రవాణా పెరుగుదల నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు రైల్వే 2712 రేకుల ద్వారా వాహనాలను రవాణా చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 1575 రేకుల ద్వారా వాహనాలు రవాణా అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు వాహనాల రవాణా 72.2 %.వృద్ధి నమోదు చేసింది.
1 ఏప్రిల్ 2022 నుంచి 30 సెప్టెంబర్ 2022 వరకు 736.68 ఎంటీ సరుకులు రైల్వే ద్వారా రవాణా అయ్యాయి. 2021-22 లో ఇదే కాలంలో 668.86 ఎంటీ సరుకులు రైల్వే ద్వారా రవాణా అయ్యాయి. 2021-22 ఇదే కాలంలో జరిగిన సరుకు రవాణాతో పోల్చి చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు రవాణా 67.83 ఎంటీ వరకు పెరిగి 10.14% వృద్ధి నమోదు చేసింది. సరుకు రవాణా నికర టన్ను కిలోమీటర్లు సెప్టెంబర్ '21 లో 63.43 బిలియన్ల వరకు ఉన్నాయి. సెప్టెంబర్' 22 నాటికి నికర టన్ను కిలోమీటర్లు 69.97 బిలియన్లకు పెరిగి 10.3% వృద్ధిని నమోదు చేశాయి. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో సంచిత సరుకు రవాణా నికర టన్ను కిలోమీటర్లు 17.1% వృద్ధి నమోదు చేశాయి.
విద్యుత్ మరియు బొగ్గు మంత్రిత్వశాఖలతో సన్నిహిత సమన్వయంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంచడానికి భారతీయ రైల్వేలు చేస్తున్న నిరంతర ప్రయత్నాలు సెప్టెంబర్ నెలలో సరుకు రవాణా పెరుగుదలకు సహాయ పడ్డాయి.గత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 35.8 ఎంటీ బొగ్గు రవాణా అయ్యింది. 2022-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 42.00 ఎంటీ బొగ్గు రవాణా అయ్యింది. 17.3% వృద్ధితో సెప్టెంబరులో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు జరిగిన (దేశీయ మరియు దిగుమతి చేసుకున్న) బొగ్గు రవాణా 6.2 ఎంటీ వరకు పెరిగింది. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే భారతీయ రైల్వే 64.53 ఎంటీ అదనపు బొగ్గును విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రవాణా చేసి 29.3% మించి వృద్ధిని సాధించింది.
సరుకుల వారీగా రైల్వే నమోదు చేసిన వృద్ధి వివరాలు. అన్ని సరకు రవాణాలో రైల్వే సాధించిన వృద్ధిని పట్టిక వివరిస్తుంది.
సరుకు
|
పెరుగుదల ఎంటీ |
పెరుగుదల %
|
బొగ్గు
|
6.8
|
14
|
సిమెంట్, కంకర
|
0.4
|
3.4
|
పెట్రోలియం ఉత్పత్తులు |
0.29
|
8.19
|
ఎరువులు
|
0.33
|
7.9
|
కంటైనర్లు (స్వదేశీ )
|
0.09
|
6.15
|
ఇతర వస్తువులు
|
1.2
|
14.1
|
ఇనుప ఖనిజం
|
1.2
|
10.8
|
***
(Release ID: 1864402)
Visitor Counter : 175