విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి అర్ధ‌భాగంలో ఎన్‌టీపీసీ ఉత్పత్తిలో 15.1% కంటే ఎక్కువ వృద్ధి

Posted On: 01 OCT 2022 3:49PM by PIB Hyderabad

ఎన్‌టీపీసీ గ్రూప్ కంపెనీలు ఏప్రిల్ - సెప్టెంబర్ 2022 మ‌ధ్య కాలంలో 203.5 బిలియ‌న్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని నమోదు చేశాయి, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2021 వరకు ఉత్పత్తి చేసిన విద్యుత్తు176.8 బిలియ‌న్ యూనిట్ల‌తో పోలిస్తే ఇది దాదాపు 15.1% శాతం అధికం. అధిక ఉత్పత్తి వృద్ధి మెరుగైన పని తీరును, ప్రస్తుత సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదలను సూచిస్తుంది.
ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్‌టీపీసీ రిహాండ్ (3000 మెగా వాట్ల‌) 90.22% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్‌)తో గ‌రిష్ఠ‌ పనితీరును కనబరిచింది. దీంతో మెటి ప‌నితీరును క‌న‌బ‌రిచిన థ‌ర్మ‌ల్ ప్లాంటుగా ఈ యూనిట్ నిలిచింది. ఎన్‌టీపీసీ బొగ్గు స్టేషన్ల మొత్తం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2022 మ‌ధ్య కాలంలో 76.3 శాతంగా ఉంది, ఇది పవర్ ప్లాంట్ల నిర్వహణ, నిర్వహణలో ఎన్‌టీపీసీ  యొక్క అధిక స్థాయి కార్యాచరణ నిపుణ‌త‌ మరియు నైపుణ్యానికి నిదర్శనం. ఎన్‌టీపీసీ  మొత్తం స్థాపిత సామర్థ్యం 70234 మెగా వాట్లు గ్రీన్ హైడ్రోజన్, వేస్ట్-టు-ఎనర్జీ మరియు ఈ-మొబిలిటీ వంటి కొత్త వ్యాపార రంగాలలో ఎన్‌టీపీసీ తన ఉనికిని విస్త‌రిస్తోంది. భారతదేశం యొక్క అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ కూడా 2032 నాటికి నికర శక్తి తీవ్రతలో దాదాపు 10 శాతం తగ్గింపును లక్ష్యంగా పెట్టుకుంది. యుఎన్‌ హై-లెవల్ డైలాగ్ ఆన్ ఎనర్జీ (హెచ్ఎల్‌డీఈ)లో భాగంగా తన ఎనర్జీ కాంపాక్ట్ లక్ష్యాలను ప్రకటించిన మొదటి ఇంధన సంస్థ ఎన్‌టీపీసీ. విద్యుదుత్పత్తితో పాటు, జ‌ల‌, పవన, సౌర మరియు గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్ వంటి క్లీనర్ మరియు గ్రీన్ మూలాల ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎన్‌టీపీసీ నిమ‌గ్న‌మై ఉంది.  పవర్ మేజర్ ఇంధన సెల్‌లు, ఈ-మొబిలిటీ మరియు వేస్ట్-టు-ఎనర్జీతో సహా వివిధ వ్యాపార రంగాలలోకి సంస్థ ఇప్ప‌టికే ప్రవేశించింది.

***

 



(Release ID: 1864272) Visitor Counter : 122


Read this release in: Tamil , English , Urdu , Hindi