ఆయుష్

“ఆయుర్వేద దినోత్సవం -2022” వేడుకల్లో భాగంగా బుల్లి వీడియోల‌ పోటీని ప్రకటించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ


- మైగౌ.ఇన్ సహకారంతో నిర్వహింస్తున్న‌ ఈ పోటీలో 18 ఏండ్ల‌ పైబడిన భారత పౌరులందరూ ఎంట్రీలు పంపేదుకు ఆహ్వానం

Posted On: 01 OCT 2022 3:51PM by PIB Hyderabad

ఆయుర్వేద దినోత్సవం 2022 వేడుకల్లో భాగంగా భారత ప్రభుత్వపు ఆయుష్ మంత్రిత్వ శాఖ మైగౌ.ఇన్  భాగస్వామ్యంతో బుల్లి వీడియో మేకింగ్ పోటీని నిర్వహిస్తోంది.  ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవాన్ని “హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం” అనే ప్ర‌ధాన ఇతివృత్తంతో నిర్వ‌హిస్తున్నారు.  ఇతివృత్తంకు అనుగుణంగా హిందీ మరియు ఆంగ్ల భాషల్లో 03 నిమిషాలకు మించని వీడియోను ఔత్సాహికులు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. వీడియోల‌ను ఈ కింది ఇదివృత్తంలో స‌మ‌ర్పించ‌వ‌చ్చు.
ఇతివృత్తం 1: నా రోజుల్లో ఆయుర్వేదం.
ఇతివృత్తం 2: నా వంట గదిలో ఆయుర్వేదం.
ఇతివృత్తం 3: నా తోటలో ఆయుర్వేదం.
ఇతివృత్తం 4: నా పొలంలో ఆయుర్వేదం.
ఇతివృత్తం 5: నా /ఆహారంలో ఆయుర్వేదం.
ప్రతి ఇతివృత్తం నుండి ముగ్గురు అగ్ర విజేతలు ఎంపిక చేయబడతారు. అంటే మొత్తం 15 మంది విజేతలకు రూ. 75,000/- నుండి రూ. 25,000/- మ‌ధ్య బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. 18 ఏళ్లు పైబడిన /భారత పౌరులు అందరూ ఈ వీడియో పోటీలో పాల్గొనవచ్చు. ఎంట్రీలు సమర్పించడానికి చివరి తేదీ 10 అక్టోబర్ 2022. వీడియోను సమర్పించే పోటీ మరియు ప్రక్రియ గురించి మరిన్ని వివరాలను https://innovateindia.mygov.in/ayurveda-video-contest/ పొందవచ్చు.
3జే  లక్ష్యంతో వివిధ వాటాదారుల భాగస్వామ్యం..
ఆయుర్వేదం అత్యంత పురాతనమైన మరియు చక్కగా నమోదు చేయబడిన వైద్య వ్యవస్థగా గుర్తించబడింది, ఇది ఆధునిక కాలంలోనూ సమాంత‌రంగా వెలుగొందుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆయుర్వేద ప్రయోజనాలను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లడానికి ఇతర మంత్రిత్వ శాఖలు మరియు భార‌త ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల‌కుచెందిన ఇతర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు మద్దతు ఇస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరు వారాల నిడివి గల కార్యక్రమాల‌తో (సెప్టెంబర్ 12-23 అక్టోబర్) వివిధ థీమ్‌లు మరియు ముఖ్య సంఘటనలను హైలైట్ చేస్తుంది, ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) నోడల్ ఇన్‌స్టిట్యూట్‌గా ఉంది. ఈ కార్యక్రమంలో 3జే  లక్ష్యంతో వివిధ వాటాదారుల నుండి భాగస్వామ్యాన్ని కోరుతోంది. - జన్ సందేశ్, జన్ భగీదారి మరియు జన్ ఆందోళన్. ఆయుష్ మంత్రిత్వ శాఖ 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి (ధంతేరస్) సందర్భంగా ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ సంవత్సరం 23 అక్టోబర్ 2022న నిర్వ‌హించ‌నున్నారు.
                                                                     

****



(Release ID: 1864271) Visitor Counter : 212