వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
యుఎల్ఐపిపై డాటాను పొందేందుకు 13 సంస్థలు గోప్యత ఒప్పందం (ఎన్‌డిఎ) సంతకాలు చేయడంతో అద్భుత స్పందనను అందుకున్న యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫాం (యుఎల్ఐపి)
సామర్ధ్యతను మెరుగుపరచడం, లాజిస్టిక్స్ ప్రక్రియలను సులభతరం చేయడం, పారదర్శకతను తీసుకురావడం, లాజిస్టిక్స్ వ్యయం & సమయాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ రంగంలో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయనున్న యుఎల్ఐపి
దాదాపు 1600 డాటా క్షేత్రాలను ఆవరిస్తూ ఏడు మంత్రిత్వ శాఖలకు చెందిన 30 వ్యవస్థలు యుఎల్ఐపితో ఏకీకృతం
సరుకు కదలికలు, పంపిన సరుకు ట్రాకింగ్, జాబితా నిర్వహణ వంటి ప్రత్యక్ష, పరోక్ష లబ్ధిని అందించడం ద్వారా భాగస్వాములకు వ్యవస్థీకృత ప్రణాళికలను రూపొందించడంలో తోడ్పడనున్న యుఎల్ఐపి
Posted On:
01 OCT 2022 2:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతీయ లాజిస్టక్స్ పాలసీ (ఎన్ఎల్‌పీ)లో భాగంగా 17 సెప్టెంబర్ 2022న ప్రారంభించిన యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫస్ ప్లాట్‌పార్మ్ (యుఎల్ఐపి - ఏకీకృత లాజిస్టిక్స్ వినిమయ సీమ వేదిక) లాజిస్టిక్స్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, దాని సామర్ధ్యాన్ని పెంచడం, పారదర్శకతను, దృగ్గోచరతను తీసుకువచ్చందుకు, లాజస్టిక్స్ వ్యయం & సమయాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ రంగంలో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడాన్ని లక్ష్యంగా చేపట్టిన చొరవ.
ఈ వేదికకు పరిశ్రమ నుంచి అద్భుతమైన ప్రతిస్పందన వస్తోంది. నేటి వరకూ, 13 సంస్థలు - మ్యాప్ మై ఇండియా, కార్గో ఎక్స్‌చేంజ్, ఫ్రీట్ ఫాక్స్, కానమూవ్, ఇంట్యూజైన్, ఈకోనాటెక్, ఎస్ బ్యాంక్, సూపర్ ప్రొక్యూర్, కార్గో శక్తి, క్లౌడ్ స్ట్రాట్స్, షిప్‌లైట్, ఎపిఎస్ఇజెడ్ ఎల్, ఎఐటిడబ్ల్యుఎలు యుఎల్ఐపి పై డాటా సమాచారాన్ని పొందేందుకు నాన్- డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్‌డిఎ - గోప్యంగా ఉంచేందుకు ఒప్పందం)పై సంతకాలు చేశాయి. ఇన్‌స్టావ్యాన్స్& ట్రిక్స్, బోష్ ఇండియా, పోర్ట్‌లింక్స్, షిప్‌రాకెట్ తదితరాలతో సహా మరొక 11 సంస్థలతో ఎన్‌డిఎల ప్రక్రియ సాగుతోంది.
ఈ రంగానికి నూతన పరిష్కారాలను సృష్టించేందుకు స్టార్టప్‌లు నూతన ఐడియాలను ప్రదర్శించేందుకు సంసిద్ధమవుతుండగా, పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు సంక్లిష్టమైన లాజిస్టిక్స్ ప్రక్రియలను సరళీకృతం చేసేందుకు, విక్రేతల పత్రాలను ధృవీకరించడం, సరుకు తరలింపు దృశ్యమానతను పొందడం కోసం యుఎల్ఐపితో ఏకీకృతం కావడం గురించి యోచిస్తున్నాయి.
వివిధ మంత్రిత్వ శాఖల వద్ద అంబాటులో ఉన్న లాజిస్టిక్స్, వనరులకు సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా పొందేందుకు యుఎల్ఐపి వేదిక పారిశ్రామికవేత్తలను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఏడు మంత్రిత్వ శాఖల నుంచి 30 వ్యవస్థలు దాదాపు 100కు పైగా ఎపిఐల ద్వారా 1600 డాటా క్షేత్రాలను ఆవరిస్తూ భాగస్వాముల వినియోగం కోసం ఏకీకృతం చేశారు.
డాటా కోసం చేసే విజ్ఞప్తి ప్రక్రియను సరళతరం, వేగవంతం, పారదర్శకం చసందుకు కట్టుబడిన పోర్టల్ యుఎల్ఐపికి ఉంది. ఈ పోర్టల్‌ను “https://goulip.in/” అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. ఈ పోర్టల్‌పై నమోదు చేసుకోవాలనుకునే పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ఇరవై నాలుగు గంటలూ అంకితభావంతో పని చేస్తున్న సహాయక బృందం ఉన్నది. నమోదు అనంతరం, యూజర్లు తమ యూజ్- కేసులను సమర్పించవలసి ఉంటుంది. విజ్ఞప్తి చేసిన డాటా ప్రతిపాదిత వినియోగం ఆధారంగా వీటిని సమీక్షిస్తారు. విజయవంతమైన సమీక్ష అనంతరం, డాటా కోసం విజ్ఞప్తి చేసే యూజర్లు నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్‌డిఎ) పై సంతకాలు చేయవలసి ఉంటుంది. ఎన్డీయేపై సంతకాలు చేసిన తర్వాత పారిశ్రామికవేత్తలు యుఎల్ఐపితో ఏకీకృతం కావడం కోసం ఎపిఐలను అభివృద్ధి చేయవచ్చు. వ్యవస్థ భద్రత పరీక్ష, విలీనీకరణ ద్వారా వివిధ ప్రభుత్వ రంగాల నుంచి యుఎల్ఐపి ద్వారా ప్రామాణికమైన డాటాను పొందవచ్చు.
లాజిస్టిక్స్ భాగస్వాములందరికీ ఒక్క క్లిక్‌లోనే డ్రైవర్లు, వాహనాల ధ్రువీకరణ, పంపిన సరుకు ట్రాకింగ్ & ట్రేసింగ్, సానుకూల మార్గానికి ప్రణాళిక, సరుకు గమ్యం చేరే వివిధ దశలకు సంబంధించి సకాలంలో నవీకరణ, కాగితం పని తగ్గింపు, ఖాళీ కారియర్& కంటైనర్ దృశ్యమానత, జాబితా నిర్వహణ తదితరాల ద్వారా యుఎల్ఐపి ప్రత్యక్ష, పరోక్ష లబ్ధిని చేకూరుస్తుంది. నియంత్రణ, దస్తావేజు, ఇతర జాప్యాలను తగ్గించడం ద్వారా యుఎల్ఐపి వ్యవస్థీకృత ప్రణాళిక ప్రారంభించేందుకు వాంఛనీయ లాజిస్టిక్స్ వినియోగ పద్ధతులపై నిర్ణయాలను తీసుకునేందుకు తోడ్పడి వ్యయాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది.
సమాచారాన్ని ప్రజాస్వామీకరించడం ద్వారా, ఆదాయ ఉత్పత్తికి మార్కెట్‌ను సృష్టించడంతో పాటుగా, గుత్తాధిపత్యం, అపరిమితమైన ప్రయోజనాన్ని రద్దు చేయడాన్ని యుఎల్ఐపి లక్ష్యంగా పెట్టుకుంది. అత్యల్ప, వ్యక్తిగత స్థాయిల్లో సానుకూల ఫలితాలను సాధించడం అన్నది జిడిపిలో లాజిస్టిక్స్ వ్యయ శాతంతో పాటు భారత లాజిస్టిక్స్ రంగం మొత్తంపై భారీ నిర్మాణాత్మక ప్రభావాన్ని కలిగి ఉండడంతో సహా భారతీయ, అంతర్జాతీయ లాజిస్టిక్స్ సూచీలను పెంచుతుంది.
***
(Release ID: 1864183)
Visitor Counter : 209