రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పొటాష్ సరఫరా సంస్థల్లో ఒకటైన కెనడాలోని కాన్‌ పోటెక్స్‌ తో అవగాహనా ఒప్పందం పై సంతకాలు చేసిన - భారత ఎరువుల కంపెనీలు


3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్‌ ను సరఫరా చేయనున్న - కెనడా కు చెందిన కాన్‌ పోటెక్స్‌

ఈ అవగాహన ఒప్పందం సరఫరా మరియు ధరల అస్థిరతను తగ్గించే ఒక అద్భుతమైన చర్య; భారతదేశానికి పొటాష్ ఎరువుల స్థిరమైన దీర్ఘకాలిక సరఫరాను నిర్ధారిస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

"ఈ అవగాహన ఒప్పందం రైతు సమాజ సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది; దేశంలో ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది"

Posted On: 28 SEP 2022 12:24PM by PIB Hyderabad

 రైతు సమాజానికి దీర్ఘకాలిక ఎరువుల లభ్యతను నిర్ధారించే దిశగా చేపట్టిన ఒక ముఖ్యమైన చర్యగా, భారతీయ ఎరువుల కంపెనీలైన - కోరమాండల్ ఇంటర్నేషనల్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఇండియన్ పొటాష్ లిమిటెడ్ సంస్థలు 2022 సెప్టెంబర్, 27వ తేదీన కెనడాకు చెందిన కాన్‌ పోటెక్స్‌ తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.  ఈ అవగాహన ఒప్పందాన్ని ఈరోజు ఇక్కడ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కు అందించారు.  ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పొటాష్ సరఫరా సంస్థల్లో ఒకటైన కెనడాలోని కాన్‌ పోటెక్స్‌ కంపెనీ, సంవత్సరానికి 130 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఎగుమతి చేస్తుంది. 

 

భారతీయ రైతులకు ఎం.ఓ.పి. (మ్యూరియేట్-ఆఫ్-పొటాష్) సరఫరా కోసం కంపెనీల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.   దీనిని ఒక మార్గ నిర్దేశిత చర్యగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ, “ఎమ్.ఓ.యు సరఫరా మరియు ధరల అస్థిరత రెండింటినీ తగ్గిస్తుంది; భారతదేశానికి పొటాష్ ఎరువుల స్థిరమైన దీర్ఘకాలిక సరఫరాను నిర్ధారిస్తుంది.  వనరులు భారీగా ఉన్న దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాల ద్వారా సరఫరా అనుసంధానం కోసం దేశీయ ఎరువుల పరిశ్రమను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  ముడిసరుకు తో పాటు, ఎరువుల ఖనిజాల దిగుమతులపై భారతదేశం ఎక్కువగా ఆధారపడుతున్నందున, ఈ భాగస్వామ్యాలు నిర్దిష్ట కాల వ్యవధిలో ఎరువులు, ముడి పదార్థాల సురక్షితమైన లభ్యతను అందిస్తాయి.  అదేవిధంగా, అస్థిర మార్కెట్ పరిస్థితులలో ధర స్థిరత్వాన్ని కూడా అందిస్తాయి.

 

కాన్‌ పోటెక్స్, కెనడా అవగాహన ఒప్పందంలో భాగంగా భారతీయ ఎరువుల కంపెనీలకు 3 సంవత్సరాల కాలానికి ఏటా 15 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్‌ను సరఫరా చేస్తుంది.  ఈ సరఫరా భాగస్వామ్యం దేశంలో ఎరువుల లభ్యతను మెరుగుపరచడం తో పాటు, సరఫరా, ధరల దుర్బలత్వాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు." అని కూడా ఆయన తెలియజేశారు. 

 

రాబోయే పంటల సీజన్‌ కు ముందు ఎం.వో.యూ. ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న డాక్టర్ మాండవీయ, "రైతు వర్గాలకు ఎం..పిలభ్యతను మెరుగుపరుస్తుందివారి సంక్షేమాన్ని సమర్థిస్తుందిదేశంలో ఆహార భద్రతను నిర్ధారించడంలో దోహదపడుతుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన చొరవఅని పేర్కొన్నారు.  "మన పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికిరెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి" ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుందని కూడా ఆయన చెప్పారు. 

 

రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పొటాష్ తో సహా ఇతర ఎరువుల కోసం దీర్ఘకాలిక అవగాహన ఒప్పందాలు చేసుకోవడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, డాక్టర్ మాండవీయ ప్రముఖంగా పేర్కొన్నారు.   దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో, స్వదేశీ పొటాష్ వనరులకు తోడ్పాటు అందించడానికి పోషకాల ఆధారిత సబ్సిడీ పథకం (ఎన్.బి.ఎస్) పథకంలో పి.డి.ఎం. (మొలాసిస్ నుండి తీసిన పొటాష్)ను కూడా ఎరువుల శాఖ చేర్చింది. స్పెంట్ వాష్ నుండి పొటాష్ తయారీకి ఎరువుల పరిశ్రమలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాయి.

నేపథ్యం: 

పొటాషియం యొక్క మూల పదార్ధమైన పొటాష్ ను, ఎం.ఓ.పి. రూపంలో నేరుగా వినియోగిస్తారు, అదేవిధంగా ఎన్.పి.కె. ఎరువులలో 'ఎన్' మరియు 'పి' పోషకాలతో కలిపి రెండింటినీ ఉపయోగిస్తారు.  భారతదేశం తన పొటాష్ అవసరాన్ని 100 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది.  భారతదేశం సంవత్సరానికి సుమారు గా 40 లక్షల మెట్రిక్ టన్నుల ఎం.ఓ.పి. ని దిగుమతి చేసుకుంటుంది.

ప్రముఖ ఎరువుల ఉత్పత్తిదారులైన మొజాయిక్ మరియు న్యూట్రియన్ సంస్థల మధ్య ఉమ్మడి సంస్థ ఏర్పాటైన కాన్‌ పోటెక్స్, కెనడాలోని సస్కట్చేవాన్ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న పొటాష్‌ను మార్కెట్‌ చేస్తుంది.   ప్రపంచవ్యాప్తంగా పొటాష్ సరఫరా చేసే అతిపెద్ద సరఫరా సంస్థల్లో ఒకటిగా ఉన్న కాన్‌ పోటెక్స్, భారతదేశంతో సహా, 40 కంటే ఎక్కువ దేశాలకు సంవత్సరానికి 130 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఎగుమతి చేస్తుంది. 

 

***** 


(Release ID: 1863056) Visitor Counter : 196