జల శక్తి మంత్రిత్వ శాఖ

ఉమ్మడి సరిహద్దు నదిగా ఉన్న కుషియారా నుండి చెరి 153 క్యూసెక్కుల నీటి వినియోగంపై భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 28 SEP 2022 3:59PM by PIB Hyderabad

రెండు దేశాల మధ్య సరిహద్దు నదిగా ఉన్న   కుషియారా నుండి చెరి  153 క్యూసెక్కుల నీటిని మళ్లించి వినియోగించుకోవడానికి భారతదేశం, బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పడానికి ఈరోజు ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 కుషియారా నదీ జలాల వినియోగంపై 2022 సెప్టెంబర్ 6వ తేదీన భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ జల వనరుల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం   రెండు దేశాల మధ్య సరిహద్దు నదిగా ఉన్న   కుషియారా నుండి చెరి  153 క్యూసెక్కుల నీటిని మళ్లించి వినియోగించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. వర్షాలు కురవని కాలంలో (  నవంబర్ 1 నుంచి మే 31 వరకు )  తమ వినియోగ నీటి అవసరాల రెండు దేశాలు  ఉమ్మడి సరిహద్దు కుషియారా నది నీటిని ఉపయోగించుకుంటాయి. . 

రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల అస్సాం ప్రభుత్వం నవంబర్ 1 నుంచి మే 31 వరకు  కుషియారా నది జలాలను మంచినీటి అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. 

ఎండా కాలంలో  నీటి ఉపసంహరణ పర్యవేక్షించడానికి రెండు దేశాలు ఒక  జాయింట్ మానిటరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తాయి

***(Release ID: 1862985) Visitor Counter : 166