జౌళి మంత్రిత్వ శాఖ

"నేషనల్ టూరిజం అవార్డ్ 2018-19 ఫర్ బెస్ట్ స్టాండలోన్ కన్వెన్షన్ సెంటర్" అందుకున్న గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్


ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్‌లో 34 మెగావాట్ల అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో పాటుగా 134 పడకల హోటల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.

Posted On: 28 SEP 2022 1:23PM by PIB Hyderabad

సెప్టెంబర్ 27, 2022న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన “నేషనల్ టూరిజం అవార్డ్స్” 2022 వేడుకలో ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్ ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ టూరిజం అవార్డ్ 2018-19 ఫర్ బెస్ట్ స్టాండలోన్ కన్వెన్షన్ సెంటర్’ని అందుకుంది.

భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ సమక్షంలో ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రాకేష్ కుమార్ మరియు ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ సుదీప్ సర్కార్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి  శ్రీ జి.కిషన్‌ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ మరియు టూరిజం శాఖ సెక్రటరీ శ్రీ అరవింద్ సింగ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  ఐఈఎంఎల్‌ ఛైర్మన్ శ్రీ రాకేష్ కుమార్ మాట్లాడుతూ..ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్‌) బృందం కృషిని మరియు అంకితభావాన్ని గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే అనేక అవార్డులను అందుకున్న ఐఈఎంఎల్‌ ఖ్యాతిలో ఇది మరోమైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ వెన్యూ ప్రొవైడర్‌లలో ఒకటని ఆయన తెలిపారు. ఇందులో ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు అంతర్జాతీయ వ్యాపార-వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాలు, సదస్సులు, ఉత్పత్తి లాంచ్‌లను నిర్వహించడానికి మరియు ప్రమోషనల్ ఈవెంట్‌లను నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి.

 

image.png


భారతదేశంలోని ప్రముఖ ఎంఐసీఈ గమ్యస్థానమైన గ్రేటర్ నోయిడాలో ఈ వేదిక వ్యూహాత్మకంగా ఉందని ఆయన అన్నారు. ఇది 2,35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అన్ని రకాల వ్యాపార కార్యక్రమాలకు అనువైన సౌకర్యాలతో కూడిన ప్రపంచ స్థాయి వేదిక. ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్‌లో దాదాపు 800 భారతీయ ఎగుమతిదారుల శాశ్వత షోరూమ్‌లు ఉన్నాయి మరియు 14 బహుళ ప్రయోజన హాళ్లు (73,308 చదరపు మీటర్లు) 29 సమావేశ గదులు (కాన్ఫరెన్స్‌ల కోసం 25,000 సీటింగ్ కెపాసిటీ మరియు ఎగ్జిబిషన్‌ల కోసం రోజుకు 2 లక్షల ఫుట్‌ఫాల్), 4 ఓపెన్ ఏరియాలు మరియు 4 స్పెషాలిటీ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో కొనుగోలుదారుల లాంజ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ అవుట్‌లెట్ మరియు లాజిస్టిక్ సపోర్ట్, 2000 కార్లకు విస్తృతమైన పార్కింగ్ మరియు ఆధునిక భద్రతతో పాటు వైఫై కనెక్టివిటీ ఉంది. ఇందులో త్వరలో 134 పడకల హోటల్‌ ఏర్పాటు కాబోతోంది. అలాగే 34 మెగావాట్ల నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. వేదిక వద్ద ఇంధన ఆదాకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అలాగే హాళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన  3ఎండబ్ల్యూ సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఈ వేదిక ఐఎస్‌ఓ 9001:2015, 14001:2015 మరియు 45001:2018 ధృవీకరణలను కూడా పొందింది.

ఎగ్జిబిషన్‌లు మరియు ట్రేడ్ ఫెయిర్‌ల నిర్వహణలో ఇండియా ఎక్స్‌పో మార్ట్‌కు సుమారు 16 సంవత్సరాల అనుభవం ఉంది. భారత హస్తకళలు మరియు బహుమతుల ఫెయిర్, ఎలెక్రామా, ఆటో ఎక్స్‌పో - ది మోటర్ షో, సిపిహెచ్‌ఐ&పి-ఎంఈసీ మరియు ప్రింట్ ప్యాక్, కాప్ 14, పెట్రోటెక్'22 మరియు ఇటీవల వరల్డ్ డైరీ కాంగ్రెస్'22 మరియు అనేక ఇతర ప్రదర్శనలు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్‌లో నిర్వహించబడ్డాయి. గౌరవనీయ ప్రధానమంత్రి, గౌరవనీయ కేంద్ర హోం మంత్రి, పలువురు క్యాబినెట్ మంత్రులు మరియు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అనేక మంది వీవీఐపీలు ఈ వేదికను సందర్శించారని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ లిమిటెడ్ సిఈఓ శ్రీ సుదీప్ సర్కార్ తెలియజేశారు.


 

****



(Release ID: 1862925) Visitor Counter : 126


Read this release in: Tamil , English , Urdu , Hindi