రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘న్యూ ఇండియా’ దార్శనికతను సాకారం చేసేందుకు అత్యాధునికమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్పత్తులను గుర్తించి, తయారు చేయాలని భారత రక్షణ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న రక్షణ మంత్రి.


భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ హబ్‌గా మార్చేందుకు ఉత్తరప్రదేశ్ & తమిళనాడులో డిఫెన్స్ కారిడార్‌లలో పెట్టుబడులను పెంచాలని వారిని కోరారు.

జాతీయ భద్రతను పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు: దిల్లీలోని ఎస్ఐడీఎం 5వ వార్షిక సమావేశంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 27 SEP 2022 3:39PM by PIB Hyderabad

రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ దేశంలోని రక్షణ పరిశ్రమలకు అత్యాధునికమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్పత్తులు/సాంకేతికతలను గుర్తించితయారు చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన 'నవ భారతం' ద్వారా కేవలం దేశ అవసరాల సాకారం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ అవసరాలను కూడా తీరుస్తుందని అన్నారు. సెప్టెంబర్ 27, 2022న దిల్లీలోని సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) 5వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఫూల్- ప్రూఫ్ ( సమర్ధవంతమైన) భద్రతా యంత్రాంగం యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని కేంద్రమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి జాతీయ భద్రత యొక్క అన్ని కోణాలను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. “సురక్షిత, బలమైన దేశం మాత్రమే విజయాలను సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు. దేశం ఎంత సంపన్నమైనావిజ్ఞానవంతమైన దేశమైనాజాతీయ భద్రతకు భరోసా ఇవ్వకపోతే దాని శ్రేయస్సుకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రపంచంలోని బలమైన దేశాల్లో భారత్‌ను ఒకటిగా చేర్చేందుకు జాతీయ భద్రతఆర్థిక శ్రేయస్సుపై దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు.

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రైవేట్ రంగాన్ని సమూల మార్పు తెచ్చే రంగంగా భావించారని... ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అదే దృక్పథంతో ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గత కొన్నేళ్లుగా చేపట్టిన అనేక సంస్కరణల వల్ల దేశం సమగ్రాభివృద్ధితో పాటు, సమగ్రాభివృద్ధిని  చూసుకునేలా రక్షణ సంస్థలకు వాతావరణాన్ని కల్పించిందని ఆయన అన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమలకు మూలధన సేకరణ బడ్జెట్‌లో 68 శాతం కేటాయించడంతో పాటు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్థావించారు.  అందులో భాగంగా డిఫెన్స్ రంగంలో పరిశోధనాభివృద్ధి కోసం 25 శాతం ప్రైవేట్ రంగానికి, స్టార్టప్‌లకు కేటాయించినట్లు తెలిపారు. ఇది భారతదేశంలో కొత్త రక్షణ రంగ సాంకేతికతల ఆవిష్కరణకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ఇతర చర్యలలో భాగంగా సానుకూల స్వదేశీ జాబితాల జారీడిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 ఆవిష్కరణవ్యూహాత్మక భాగస్వామ్య నమూనా, ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX) చొరవ ద్వారా యుద్ధ విమానాలుహెలికాప్టర్లుట్యాంకులు మరియు జలాంతర్గాములతో సహా మెగా డిఫెన్స్ కార్యక్రమాలను రూపొందించడానికి అవకాశాల కల్పన. ఇది రక్షణ మరియు అంతరిక్ష రంగాలలో ఆవిష్కరణలతో పాటు, సాంకేతిక అభివృద్ధికి వ్యవస్థను సృష్టించింది.

అనునిత్యం అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచ పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా సైనిక పరికరాలకు డిమాండ్ పెరగడానికి దారితీసిందని.. దేశాలు తమ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని రక్షణ మంత్రి అన్నారు. భారత రక్షణ రంగం యొక్క ప్రస్తుత స్వర్ణ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమను కోరారు. 'ఆత్మనిర్భర్ భారత్' కలను సాకారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన రెండు రక్షణ కారిడార్‌లలో పెట్టుబడులను పెంచడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు.

 “స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, 2021లోప్రపంచ సైనిక వ్యయం మొదటిసారిగా $2 అమెరికన్ ట్రిలియన్‌ డాలర్లను దాటింది. 2020తో పోలిస్తే ఇది 0.7 శాతం ఎక్కవ. 2012తో పోలిస్తే 12 శాతం పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో మన సాయుధ దళాలు కూడా మూలధన సేకరణపై గణనీయమైన మొత్తాన్ని వెచ్చించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రపంచ భద్రతా అవసరాలు రానున్న కాలంలో పెరగనున్నట్లు ఇది తెలియజేస్తోందన్నారు. నాణ్యత, ఖర్చు-సమర్థత రెండింటిలోనూ భారతదేశం ఆ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రభుత్వ రంగంప్రైవేట్ రంగంవిద్యాసంస్థలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, SIDMని నోడల్ పాయింట్‌గా కలిగిఈ లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేయడం కొనసాగించాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

దేశీయ పరిశ్రమకు ఇచ్చే కాంట్రాక్టుల సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు వస్తున్నాయని రక్షణ మంత్రి అన్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా, 10,000 కంటే ఎక్కువ ఎమ్‌ఎస్‌ఎంఈలు రక్షణ రంగంలో చేరాయనిపరిశోధనభివృద్ధిఅంకుర సంస్థలుఆవిష్కరణలు, ఉపాధిలో పెరుగుదల కనిపించిందని ఆయన తెలిపారు.

 

‘‘ఏడు-ఎనిమిదేళ్ల క్రితం మన రక్షణ రంగ ఎగుమతులు రూ.1,000 కోట్లు కూడా లేవు. ప్రస్తుతం ఈ విలువ రూ.13,000 కోట్లను దాటింది. 2025 నాటికి రూ. 1.75 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇందులో రూ. 35,000 కోట్ల ఎగుమతులు కూడా ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

 

డిఫెన్స్ స్టాక్స్‌లో ఇటీవలి పెరుగుదలపైరక్షా మంత్రి మాట్లాడుతూకంపెనీల మార్కెట్ వాల్యూయేషన్ పెరగడం పెద్ద పెట్టుబడిదారులుసేవలు, జాతీయ భద్రతకు దోహదపడే సంస్థలపై దేశానికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఎస్‌ఐడీఎంని ప్రభుత్వ- పరిశ్రమల మధ్య వారధిగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సంస్థలకు ఏవైనా సందేహాలు ఫిర్యాదులు ఉంటే అసోసియేషన్‌ను సంప్రదించాలనిరక్షణ మంత్రిత్వ శాఖ యొక్క అన్నిసహాయాలకు హామీ ఇవ్వాలని కోరారు. అయితేపరిశ్రమకు దాని బ్యాలెన్స్ షీట్ పట్ల బాధ్యత ఉన్నప్పటికీదానికి దేశం పట్ల కూడా బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలు, వారి సరఫరా గొలుసులోని విక్రేతలకు సకాలంలో చెల్లింపులు చేయడంస్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం వంటి అన్ని వాటాదారుల ప్రయోజనాలపై పూర్తి శ్రద్ధ వహించాలని ఆయన వారికి పిలుపునిచ్చారు.

 

రక్షణ మంత్రిఎస్ఐడీఎం వృద్ధిని ప్రశంసిస్తూఅది ప్రారంభమైన ఐదేళ్లలోసుమారు 500 మంది సభ్యులు అసోసియేషన్‌లో చేరారనిఇది భారత రక్షణ పరిశ్రమ పురోగతికి సూచిక అని పేర్కొన్నారు. దిల్లీ వెలుపల ఎస్ఐడీఎం విస్తరణ అనేది పరిశ్రమ యొక్క నమ్మకానికి ప్రతిబింబంగా.. అలాగే జాతీయ భద్రతను బలోపేతం చేసే ప్రధాన లక్ష్యంతో స్థానిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి అసోసియేషన్ యొక్క సంకల్పానికి ప్రతిబింబంగా ఆయన వివరించారు.

ఎస్ఐడీఎం 5వ వార్షిక సమావేశం రక్షణ తయారీలో భారతదేశాన్ని అగ్ర దేశాల్లో ఒకటిగా ఉంచే లక్ష్యంతో 'ఇండియా@75: షేపింగ్ ఫర్ ఇండియా@100' అనే ఇతివృత్తంపై నిర్వహించబడింది. కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క అగ్ర నాయకత్వంభారత సాయుధ దళాలుపరిశ్రమలు, భారతదేశంలోని విదేశీ రక్షణ సంస్థల అధికారులు పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరివైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మాడేవైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజుఎస్ఐడీఎం ప్రెసిడెంట్ శ్రీ ఎస్పీ శుక్లా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, ‘ఎస్ఐడీఎం ఛాంపియన్స్ అవార్డు’ 2వ ఎడిషన్ విజేతలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సత్కరించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్భారత్ ఫోర్జ్ లిమిటెడ్, లార్సెన్ టూబ్రో సంస్థలకు సామర్థ్య అంతరాలను పరిష్కరించడానికి టెక్నాలజీ ఇన్నోవేషన్డిజైన్/డెవలప్‌మెంట్ టెస్టింగ్ కోసం ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి విభిన్న విభాగాలలో విజేతలను సత్కరించారు.

 

 

****


(Release ID: 1862587) Visitor Counter : 197