ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
బెంగళూరులో సౌత్‌జోన్, ఐసిఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము
భౌగోళికంగా ప్రాంతాలవారీ అవసరాలకు అనుగుణంగా వైరాలజీ నేషనల్ ఇన్ స్టిట్యూట్ లను విస్తరింప చేయడం ప్రశంసార్హమైనది ః ద్రౌపది ముర్ము
మానవ చరిత్రలో అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని మన దేశం చేపట్టిందన్న రాష్ట్రపతి
అత్యధునాతన మౌలిక సదుపాయాలతో బెంగళూరు లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ,అంటువ్యాధుల కారక వైరస్‌లపై జాతీయ స్థాయిలో నిఘా పెడుతుంది. : డాక్టర్ భారతి పవార్
"ఏదైనా ప్రజారోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండడమంటే, ప్రయోగశాల స్థాయిలో సంసిద్దంగా ఉండడం కీలకమైనది."
Posted On:
27 SEP 2022 1:45PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము బెంగళూరులో సౌత్‌జోన్ కు చెందిన ఐసిఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్.ఐ.వి) శంకుస్థాపన ఫలకాన్ని ఈరోజు వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు.
“
కోవిడ్ ను అదుపు చేయడంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్‌రిసెర్చ్ అత్యద్భుత మద్దతునిచ్చింని, ఇప్పుడు ఈ సంస్థ పెద్ద ఎత్తున పరిశోధన మౌలికసదుపాయాలను విస్తరిస్తోందన్న విషయం తెలిసి సంతోషంగా ఉంది. వైరాలజీ రంగంలో పరిశోధన అభివృద్ధిని పెంచడానికి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి)పూణె, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థకు కోలాబరేటింగ్ లేబరెటరీగా గుర్తింపు పొందిందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది. దేశంలో జోనల్ క్యాంపస్ లద్వారా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దేశవ్యాప్తంగా , వివిధ భౌగోళిక ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా తన క్యాంపస్‌లను విస్తరింప చేయడం ప్రశంసార్హమైనది అని రాష్ట్రపతి అన్నారు.
దేశంలోనే వాక్సిన్‌ను తయారు చేసి దానిని కోట్లాది మంది దేశ ప్రజలకు వేయడం మానవ చరిత్రలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమంగా రాష్ట్రపతి కొనియాడారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటం లో, మనం ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకంటే ఎంతో ముందున్నామని రాష్ట్రపతి అన్నారు. ఈ ఘనవిజయం సాధించినందుకు మనం మన శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వాక్సినేషన్ కార్యక్రమంతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ ఎంతోరుణపడి ఉన్నామని ఆమె అన్నారు.
బెంగళూరులో సౌత్‌జోన్ కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్.ఐ.వి) శంకుస్థాపన ఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించడం గొప్ప గౌరవమని అన్నారు. ఇండియా , గౌరవ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్య రంగంలో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నదని అన్నారు. దీనివల్ల ఎలాంటి మహమ్మారినైనా ప్రాథమిక దశలోనే గుర్తించి పరిశీలించడానికి , ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకొని దానిని అదుపు చేయడానికి వీలు పడుతుందని అన్నారు.
మన ఆరోగ్య రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతన ఎన్ ఐవి ఏర్పాటు మరో ముందడుగువంటిదని ఆమె అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ( పిఎం -ఎబిహెచ్ఐఎం) కింద, బహుళ రంగ జాతీయ స్థాయి సంస్థలు , ప్లాట్‌ఫారంలను ,నాలుగు నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవి)లను నాలుగుజోన్ లలో ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఇది జీవరక్షణ సన్నద్ధతకు దేశంలో మహమ్మారులపై పరిశోధనను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ప్రజారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు ఎదుర్కోవడంలో ఎన్.ఐ.వి పాత్ర గురించి కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఐసిఎంఆర్-ఎన్ ఐవి ఏర్పడినప్పటి నుంచి వైరల్ ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. ఐసిఎంఆర్- ఎన్ ఐవి యాంటీ వైరల్ డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున పరిశోధన సాగించిందన్నారు. అలాగే పలు రకాల కిట్ ల వాలిడేషన్ చేసిందని, కొత్త డయాగ్నస్టిక్‌లను అభివృద్ధిచేయడంతోపాటు పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన దేశపు తొలి దేశీయ వాక్సిన్ కోవాక్సిన్ విజయవంతం కావడానికి దోహదపడిందన్నారు. ఈ చర్యలు తొలి దశలోసార్స్ కోవ్ -2 వ్యాప్తిని అరికట్టడంలో ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఫలితంగా ఇవాళ ప్రపంచం మొత్తం ఆరోగ్యరక్షణ రంగంలో పరిశోధన , అభివృద్ధి విషయంలో ఇండియావైపు చూస్తున్నదని ఆమె అన్నారు.
కోవిడ్ మహమ్మారితో, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో గల బలహీనతలు బయటపడ్డాయని , ప్రజారోగ్య రంగానికి ఎదురయ్యే అత్యవసర ముప్పులను ఎదుర్కొనడంలో గల లోపాలను ఇది బహిర్గతం చేసిందన్నారు. ఈ నేపథ్యలో దక్షిణాది జోన్ కు చెందిన బెంగళూరులోని ఐసిఎంఆర్ -ఎన్ఐవి లేబరెటరీ అత్యధునాతన మౌలిక సదుపాయాలను కలిగి ఉండనున్నదని ఆమె అన్నారు. ఇది వివిధ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే వివిధ రిస్క్ గ్రూప్ లకు చెందిన ఏజెంట్లను గుర్తించి వాటిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించనున్నదని అన్నారు. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే వ్యాధులపై నిఘా ఉంచడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఆ రకంగా ఇది అంటువ్యాధులను విజృంభణను ఎదుర్కోడానికి ,జాతీయ స్థాయిలో నిఘాను పరిపుష్టం చేయడానికి ఉపకరిస్తుందని ఆమె అన్నారు.
***
(Release ID: 1862586)
Visitor Counter : 168