ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్-పీఎంజే నాలుగవ వార్షికోత్సవం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన రెండు రోజుల 2022 ఆరోగ్య మేథోమదన సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ప్రజారోగ్య బీమా పథకంలో పీఎం-జే లబ్ధిదారులు అత్యంత కీలకం-- డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
' ఆరోగ్య సేవల లభ్యతలో ధనికులు, పేదల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడంలో పీఎం-జే విజయం సాధించింది"
"రోజుకు లక్ష ఆయుష్మాన్ కార్డులు జారీ చేయాలని పెట్టుకున్న లక్ష్యం త్వరలో నెరవేరుతుంది"
" ఇంతవరకు 19 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ : 24 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు "
Posted On:
25 SEP 2022 4:39PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్-పీఎంజే) నాలుగవ వార్షికోత్సవం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన రెండు రోజుల 2022 ఆరోగ్య మేథోమదన సదస్సును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వినోద్ పాల్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్,నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్ఎస్ శర్మ పాల్గొన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజారోగ్య బీమా పథకంలో లో పీఎంజే లబ్ధిదారులను పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 19 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డ్‌లు జారీ అయ్యాయని అన్నారు. 24 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు పనిచేస్తున్నాయని డాక్టర్ మాండవీయ తెలిపారు. దేశంలో అమలు జరుగుతున్న ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌లో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా గుర్తింపు పొందిందని అన్నారు . ప్రస్తుతం రోజుకు 4.5 లక్షల కార్డులు జారీ అవుతున్నాయని డాక్టర్ మాండవీయ తెలిపారు. రోజుకు 10 లక్షల ఆయుష్మాన్ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన తెలిపారు.
సాంకేతిక సహకారంతో సమాజంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. ఆరోగ్య సేవల లభ్యతలో ధనికులు, పేదల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడంలో పీఎం-జే విజయం సాధించిందని మంత్రి అన్నారు.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య రంగాల మధ్య సమన్వయం సాధించి దేశంలో ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ ను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాన్ని అమలు చేయవచ్చునని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. రాబోయే రానున్న కొద్ది సంవత్సరాల కాలంలో దేశంలో ప్రతి గ్రామం హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. దీనివల్ల అనుసంధానం జరిగి అంతరాయం లేకుండా ఆరోగ్య సేవలు అందుతాయని మంత్రి చెప్పారు. ఆరోగ్య లబ్ధిదారుల సమాచార గోప్యత రక్షించడానికి ప్రభుత్వం తగిన చట్టపరమైన వ్యవస్థకు రూపకల్పన చేస్తుందని శ్రీ వైష్ణవ్ హైలైట్ అన్నారు.
డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ దేశం ఆరోగ్య సేవలు సాంకేతికత ఆధారంగా అమలు జరుగుతున్నాయని అన్నారు. ఆరోగ్య సేవలు సమాజంలో అట్టడుగు వర్గాలకు కూడా చేరువలోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి తమ ప్రభుత్వం సమగ్రంగా కృషి చేస్తోందని ఆమె తెలిపారు. పీఎం-జే 4 సంవత్సరాలు, మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం పట్ల డాక్టర్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను డిజిటలైజ్ చేయడంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేక రెట్లు ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు.
2030 నాటికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల అవసరమవుతాయని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కే. పాల్ అన్నారు.
ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్న వారిని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్ఎస్ శర్మ అభినందించారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు అందరికీ నాణ్యమైన విశ్వాసనీయ ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావాలని అన్నారు,.
హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ (HCX), నేషనల్ ఈ -రూపి పోర్టల్ మరియు డిజిటలైజేషన్ కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో సహా అనేక కొత్త కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. నేషనల్ హెల్త్ అథారిటీ వార్షిక నివేదిక , కాఫీ టేబుల్ బుక్ మరియు ఉత్తమ విధానాల బుక్‌లెట్ డిజిటల్ వెర్షన్‌లు కూడా ఆవిష్కరించబడ్డాయి. ప్రచురణలను pmjay.gov.in లో చూడవచ్చు.
"డిజిటల్ హెల్త్ ఎక్స్‌పో"ను డాక్టర్ మాండవీయ ప్రారంభించారు. NIC (ఇ హాస్పిటల్ మరియు ఆరోగ్య సేతును ప్రదర్శించడం), C-DAC, కర్ణాటక ప్రభుత్వం, , AWS ఇండియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, వైజాగ్ కు చెందిన వైద్య పరికరాల అంకుర సంస్థలు, టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్, రిలయన్స్ డిజిటల్ హెల్త్, హిటాచీ MGRM, Paytm, బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన సంస్థలు "డిజిటల్ హెల్త్ ఎక్స్‌పో"లో పాల్గొన్నాయి.
హాంకాంగ్ హాస్పిటల్ అథారిటీ, కామన్వెల్త్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్, వరల్డ్ బ్యాంక్, సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడిసిడ్ ఇన్నోవేషన్, గ్లోబల్ హెల్త్ పేమెంట్ LLC, USA, మెక్సికో ఆరోగ్య శాఖ థాయిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆస్ట్రేలియాకి చెందిన ఫార్మాస్యూటికల్ బెనిఫిట్స్ అడ్వైజరీ కమిటీ ప్రతినిధులతో పాటు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మరియు సాంకేతికతకు సంబంధించిన వివిధ సంస్థల ప్రతినిధులు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పన, డిజిటల్ హెల్త్‌లో ఇంటర్-ఆపరేబిలిటీని ప్రోత్సహించడం, పీఎం-జే సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ హెల్త్, సమాచార గోప్యత మరియు భద్రత లాంటి ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి.
***
(Release ID: 1862167)
Visitor Counter : 168