పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్- నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) కింద నగరాలకు ర్యాంకింగ్‌

Posted On: 24 SEP 2022 4:18PM by PIB Hyderabad

సెప్టెంబర్ 23-24 తేదీలలో గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రుల రెండు రోజుల జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాని వ‌ర్చువల్ విధానంలో ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ మరియు నివారణపై సమాంతర సెషన్‌లో, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) కింద విడుదల చేసిన ‘స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్- ర్యాంకింగ్ ఆఫ్ సిటీస్’ మార్గదర్శకాల గురించి రాష్ట్రాలకు తెలియజేయబడింది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి మార్గదర్శకత్వంలో, జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కింద 2025-26 నాటికి వాయు కాలుష్యం 40 శాతం వరకు త‌గ్గించేలా రూపొందించిన నగర కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం కోసం.. దేశంలోని దాదాపు 131 నగరాలకు ర్యాంకింగ్‌ను ప్రోత్సహించేలా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ను మంత్రిత్వ శాఖ ప్రారంభించబోతోంది. జనాభా ఆధారంగా 131 నగరాలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 47 నగరాలు మొదటి గ్రూపులో ఉన్నాయి. 3 నుండి 10 లక్షల మధ్య జనాభా కలిగిన 44 నగరాలు రెండవ గ్రూపులో ఉన్నాయి. మూడవ  గ్రూపులో3
3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న 40 నగరాలు ఉన్నాయి. ప్రాణ ఆన్‌లైన్ పోర్టల్‌లో అందించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం నగరాలు త‌మ‌త‌మ వివ‌రాల‌ను స్వీయ-అంచనా చేసుకోవాలి. ఈ మూల్యాంకనం ఏటా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ర‌హ‌దారుల‌ చెత్త  నిర్వ‌హ‌ణ‌, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల నిర్వహణ, వాహనాల నుంచి వ‌చ్చే ఉద్గారాల నియంత్రణ,  పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి తీసుకున్న కార్యకలాపాలు చర్యల అమలును గురించి ఆయా నగరాలు నివేదించాలి. స్వీయ మూల్యాంక‌ణ‌ మరియు థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఆధారంగా ప్రతి గ్రూప్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 3 నగరాలకు పోటీ సమాఖ్య స్ఫూర్తితో నగదు పురస్కారం అందజేయనున్నారు. ఇది గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడానికి పోటీ త‌త్వంతో కూడిన స‌మైఖ్య స్ఫూర్తితో కూడిన‌ నిర్మాణాత్మక పోటీని ప్రోత్సహిస్తుంది. ఈ సర్వేక్షన్ నగరాలకు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వారి చర్యలను రూపొందించ‌డానికి గాను ఒక సాధనాన్ని అందిస్తుంది. నగరాలకు ర్యాంక్ ఇవ్వడానికి ఇది గాలి నాణ్యత పారామితుల కొలతపై ఆధారపడి ఉండదు. వివిధ విభాగాల‌లో ఆయా న‌గ‌రాల‌లో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి నగరాలు తీసుకున్న చర్యలపై ఇది ఆధారపడి ఉంటుంది. నగరాలు తీసుకున్న చర్యలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ విధంగా, ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రణాళిక అమలు సాధనాన్ని అందిస్తుంది మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి నగరాలు తమ చర్యలను ఎంత మెరుగ్గా సమలేఖనం చేశాయనే దాని గురించి అంచనాను తెలియ‌ప‌రుస్తుంది. పర్యావరణ, అటవీ,  వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సదస్సులో దేశ వ్యాప్తంగా పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ,  పర్యావరణ మంత్రులు, సంబంధిత రాష్ట్ర కార్యదర్శులు, అలాగే రాష్ట్ర పీసీబీలు / పీసీసీల చైర్మన్‌లతో పాటు పీసీసీఎఫ్‌లు కూడా మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో పాటు రెండు రోజుల జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
                                                                                                   

*****

 (Release ID: 1862073) Visitor Counter : 187