ప్రధాన మంత్రి కార్యాలయం

2022 సెప్టెంబర్ 25 వ తేదీ న జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసులోమాట ’) కార్యక్రమం 93వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 25 SEP 2022 11:32AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం.

గడచిన కొద్ది రోజులు గా మన దృష్టి ని ఆకర్షిస్తున్న విషయం ఏమిటి అంటే అది చీతా.  చీతా ల గురించి మాట్లాడండి అంటూ చాలా సందేశాలు వచ్చాయి.  చీతా లు తిరిగివచ్చినందుకు ఉత్తర్ ప్రదేశ్ నుండి అరుణ్  కుమార్ గుప్తా గారు కావచ్చు లేదంటే తెలంగాణ నుండి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావచ్చు, గుజరాత్ నుండి రాజన్ గారు కావచ్చు లేదంటే ఢిల్లీ నుండి సుబ్రత్ గారు కావచ్చు.. దేశం లో నలుమూల ల.. ప్రజలు చాలా సంతోషం గా ఉన్నారు. 130 కోట్ల మంది భారతదేశ వాసులు సంతోషం గా ఉన్నారు; వారు చాలా గర్వపడుతున్నారు. దీనికి కారణం భారతీయుల కు ప్రకృతి మీద ఉన్న ప్రేమే.  దీని ని గురించి అంతా అడుగుతున్న సామాన్యమైనటువంటి  ప్రశ్న ఏది అంటే అది మోదీ గారు మాకు చీతాల ను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అనేదే.

 

సహచరులారా, ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.  ఈ టాస్క్ ఫోర్క్ చీతాల ను పర్వేక్షిస్తుంది.  అవి ఇక్కడ పరిస్థితుల తో ఎంతగా కలిసిపోతాయో చూస్తుంది.  దీని ని ఆధారం చేసుకొని కొన్ని నెలల తరువాత ఓ నిర్ణయం తీసుకొంటాం.  మరి అప్పటి దాకా చీతాల ను మనం చూడగలుగుతాం.  కానీ అప్పటి దాకా నేను మీకు అందరి కి కొన్ని పనుల ను అప్పగిస్తున్నాను.  దాని కోసం MyGov ప్లాట్ ఫార్మ్ లో ఒక పోటీ ని ఏర్పాటు చేస్తున్నాం.   దాంట్లో కొన్ని విషయాలు శేర్ చేసుకోండి అంటూ అందరి ని నేను అభ్యర్థిస్తున్నాను.  చీతా ల కోసం మనం ఓ పథకాన్ని నడుపుతున్నాం.  మరి ఆ పథకాని కి ఏ పేరు ను పెడితే బాగుంటుంది.  మనం వాటి కి పేరు పెట్టడాన్ని గురించి ఆలోచించగలుగుతామా, అసలు వాటి లో ప్రతి ఒక్కదాని ని ఏ పేరు తో పిలవాలి అని.  నిజాని కి ఆ నామకరణం సంప్రదాయబద్ధం గా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మన సమాజం, మన సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాలతో ముడిపడి ఉన్నది ఏదైనా సరే మనలను సహజంగానే దాని వైపునకు ఆకర్షిస్తుంది కదా.  అది మాత్రమే కాదు మీరు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి.  అసలు జంతువులతో మనుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని. మన ప్రాథమిక విధులలోకూడా రెస్పెక్ట్ ఫర్ ఏనిమల్స్ అనే విషయం పట్ల కూడా శ్రద్ధ చూపించారు.  నేను మీకు ఏమని  విజ్ఞ‌ప్తి ని చేస్తున్నాను అంటే మీరు అందరూ ఈ పోటీ లో తప్పక భాగస్వాములు కావాలి అని.  ఎవరికి తెలుసు, బహుమానం గా చీతా ను చూసే మొదటి అవకాశం మీకే రావొచ్చేమో.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు న, అంటే సెప్టెంబర్ 25వ తేదీ నాడు, దేశం లో ప్రముఖ మానవతావాది, ఆలోచనపరుడు, గొప్ప ముద్దుబిడ్డ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జన్మదినాన్ని జరుపుకొంటాం.  ఏ దేశం లో అయినా సరే యువకులు ఎప్పుడైతే వారికి లభించే గుర్తింపు ను మరియు గౌరవాల ను చూసి గర్విస్తారో,  వారికి వారి ప్రాథమిక ఆలోచన లు మరియు ముందుచూపు అనేవి అంతే స్థాయి లో ఆకట్టుకొంటాయి. దీన్ దయాళ్ గారి ఆలోచనల లో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అది ఆయన తన జీవనం లో ప్రపంచం లోని పెద్ద పెద్ద ఉత్థాన పతనాల ను చూసి ఉండడం అనేదే.   ఆయన ఆలోచనల కు, సంఘర్షణల కు సాక్షి గా మారారు.  అందుకే ఆయన ‘ఏకాత్మమానవ దర్శనం’ మరియు ‘అంత్యోదయ’ ల  ఆలోచనల ను దేశం ముందు ఉంచారు. అవి అచ్చమైన భారతీయ భావన లు. దీన్ దయాళ్ గారు చెప్పిన ఏకాత్మమానవదర్శనం ఎటువంటి ఆలోచన అంటే అది ఆలోచన ధార అనే పేరు తో ద్వంద్వాని కి, దురాగ్రహాని కి తావు లేకుండా చేస్తుంది.  ఆయన మానవులు అందరి ని సమానంగా చూసేటటువంటి భారతీయ దర్శనాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచారు. మన శాస్త్రాల లో ‘ఆత్మవత్ సర్వభూతేషు’ అని చెప్పడం జరిగింది.  దీనికి అర్థం ఏమిటి అంటే, మనం జీవులన్నింటిని మనతో సమానం గా చూడాలి అని.  వాటితో కూడా మనందరి లాగానే వ్యవహరించాలి అని. ఆధునిక, సామాజిక అలాగే రాజకీయ దృష్టికోణం లో సైతం భారతీయ దర్శనం ప్రపంచాని కి ఎలా మార్గదర్శనం కాగలదు అనేది దీన్ దయాళ్ గారు మనకు నేర్పించారు.  ఓ విధం గా స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశం లో ఎటువంటి హీనమైన భావన ఉండేది అంటే దాని నుండి విముక్తి ని కల్పించి ఆయన మన బౌద్ధిక చైతన్యాన్ని జాగృతం చేశారు.  ఆయన ఏమని చెప్పే వారంటే మన ఈ స్వాతంత్ర్యం ఎప్పటి కి సార్థకం అవుతుంది అంటే అది మన సంస్కృతి కి, గుర్తింపునకు మారుపేరు గా ఉన్నప్పుడే అని.  ఈ ఆలోచన ల ఆధారం గా ఆయన దేశం అభివృద్ధి చెందడానికి ఒక దృష్టికోణాన్ని రూపొందించగలిగారు.  దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ఏమని చెప్పే వారు అంటే దేశ ప్రగతి కి చిహ్నం చిట్ట చివరి మెట్టు మీద ఉన్న వ్యక్తే అవుతాడు అని.

 

స్వాతంత్ర్య అమృత కాలం లో మనం దీన్ దయాళ్ గారి ని గురించి ఎంతగా తెలుసుకోగలిగితే, ఆయన ను చూసి ఎంత నేర్చుకోగలిగితే దేశాన్ని అంతగా ముందుకు తీసుకుపోవడానికి మనందరికి ప్రేరణ లభిస్తుంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు నుండి మూడు రోజుల తరువాత, అంటే  సెప్టెంబర్ 28వ తేదీన అమృత మహాత్సవాల కు సంబంధించి ఓ ప్రత్యేకమైన రోజు వస్తున్నది. ఆ రోజు న మనం భరత మాత వీర పుత్రుడు భగత్ సింహ్ గారి జయంతి ని జరుపుకోనున్నాం. భగత్ సింహ్ గారి జయంతి ని జరుపుకోవడానికి ముందు గా ఆయన కు శ్రద్ధాంజలి గా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడమైంది.  చండీగఢ్ విమానాశ్రయాని కి  ఇక అమర వీరుడు భగత్ సింహ్ గారి పేరు ను పెట్టడం జరుగుతుంది. చాలా కాలం నుండి దీని కోసం ఎదురుచూడడం జరుగుతూ వస్తున్నది.  నేను చండీగఢ్, పంజాబ్, హరియాణా మరియు దేశం లోని అందరి కి ఈ నిర్ణయం తాలూకు అనేకానేక శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.

 

సహచరులారా, మనం మన స్వాతంత్ర్యం సేనానుల నుండి ప్రేరణ ను పొందాలి, వారి ఆదర్శాల ను పాటిస్తూ వారు కలలు గన్న భారతదేశాన్ని నిర్మించాలి. అదే, వారి కి మనం అర్పించేటటువంటి శ్రద్ధాంజలి కాగలదు. అమర వీరుల స్మారకం, వారి పేరుల ను ప్రదేశాల కు, సంస్థల కు  పెట్టడం మనకు కర్తవ్యం పట్ల ప్రేరణ ను ఇస్తాయి.  కొద్ది రోజుల క్రితమే దేశం ఆ కర్తవ్య పథ్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా  ఇటువంటి ఒక ప్రయత్నాన్ని చేసింది.  ఇప్పుడు శహీద్ భగత్ సింహ్ పేరు ను చండీగఢ్ విమానాశ్రయాని కి పెట్టడం ఈ దిశ లో మరొక అడుగు ను ముందుకు వేయడమే.  నేను కోరేది ఏమిటి అంటే అమృత మహోత్సవాల లో మనం ఏ విధం గా స్వాతంత్ర్య సేనానుల తో ముడిపడ్డ  విశేషమైన సందర్భాల ను ఉత్సవం గా జరుపుకొంటున్నామో అదే విధం గా సెప్టెంబర్ 28వ తేదీ ని కూడా ప్రతి ఒక్క యువకుడూ ఏదైనా సరికొత్త ప్రయాస ను తప్పకుండా మొదలుపెట్టాలి అని.

 

అలాగే ప్రియమైన నా దేశవాసులారా, మీకందరికీ సెప్టెంబర్ 28వ తేదీ ని ఉత్సవం గా జరుపుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఏమిటో మీకు తెలుసా?  నేను రెండే మాటల ను చెబుతాను.  అయితే నాకు తెలుసు, మీ ఉత్సాహం నాలుగు రెట్లు ఎక్కువ గా పెరిగిపోతుంది అని.  మరి ఆ రెండు పదాలు ఏమిటి అంటే సర్జికల్ స్ట్రైక్.  ఉత్సాహం పెరిగిపోయింది కదూ! మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న అమృత మహాత్సవాల తాలూకు ఉద్యమం ఏదయితే జరుగుతోందో దానిని మనం మనస్ఫూర్తి గా జరుపుకొందాం, మన సంతోషాలను అందరి తో పంచుకొందాం.

 

ప్రియమైన నా దేశవాసులారా,  జీవనం లోని సంఘర్షణల తో తపిస్తున్నటువంటి వ్యక్తి ముందు ఏ బాధా నిలబడలేదు అని అంటారు. మన దైనందిన జీవనం లో మనం కొందరు ఎటువంటి సహచరులను చూస్తాం అంటే వారు ఏదో ఒక శారీరికమైనటువంటి సవాలు తో డీకొనివుంటూ ఉండవచ్చును. చాలా మంది ఎటువంటి వారు అంటే వారు వినలేని వారు గాని, లేదా మాట్లాడి వారి మనసు లోని మాటల ను చెప్పలేని వారు గాని అయి ఉంటారు.  అటువంటి సహచరుల కోసం అన్నిటి కంటే పెద్ద ఆధారం ఏది అంటే అది సంజ్ఞ‌ ల భాష.  అయితే భారతదేశం లో వందల సంవత్సరాలు గా ఒక పెద్ద ఇబ్బంది ఉంది అది ఏమిటి అంటే ఆ సంజ్ఞ ల భాష కు చాలా కాలం వరకూ స్పష్టమైన హావభావాలంటూ ఉండేవి కావు. ప్రమాణాలు లేనేలేవు. ఈ ఇబ్బందులను తొలగించడం కోసమే 2015వ సంవత్సరం లో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రిసర్చ్ ఎండ్ ట్రయినింగ్ సెంటర్ ను స్థాపించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అంటే ఈ సంస్థ ఇప్పటికే పది వేల పదాలు మరియు భావాల తో కూడిన నిఘంటువు (డిక్శనరి) ని తయారు చేసేసింది.  రెండు రోజుల కిందట, అంటే సెప్టెంబర్ 23వ తేదీన సైగల భాష దినం నాడు ఎన్నో స్కూళ్ల పాఠ్యాంశాల ను కూడా సైన్ లాంగ్వేజ్ లో ఆరంభించడం జరిగింది. సైన్ లాంగ్వేజ్ తాలూకు నిర్దిష్ట ప్రమాణాలను ముందుకు తీసుకు పోయేందుకు జాతీయ విద్య విధానం లో కూడా చాలా శ్రద్ధ ను తీసుకోవడం జరిగింది.  సంజ్ఞ ల భాష తాలూకు శబ్దకోశాన్ని వీడియో తీసి నిరంతరాయం గా ప్రసారం చేసేందుకు ఏర్పాటు లు కూడా జరిగాయి.  యూట్యూబ్ లో చాలా మంది, చాలా సంస్థ లు, భారతీయ భాషల లో సైన్ లాంగ్వేజ్ లో చానల్స్ ను కూడా మొదలుపెట్టారు.  అంటే ఏడెనిమిది సంవత్సరాల కిందట సైన్ లాంగ్వేజ్ ను అభివృద్ధిపరచడానికి ప్రారంభించిన పథకం వల్ల ఇప్పుడు లక్షల మంది దివ్యాంగులైనటువంటి సోదరీమణుల కు, దివ్యాంగులైనటువంటి సోదరుల కు లాభం కలుగుతోంది. హరియాణా లో నివసించే పూజ గారు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ను చూసి చాలా సంతోషపడుతున్నారు.  తొలుత  ఆవిడ తన బిడ్డ తో మాటలాడలేకపోయేవారు.  కానీ, 2018వ సంవత్సరం లో సంజ్ఞ‌ ల భాష లో శిక్షణ ను తీసుకొన్నాక తల్లీ బిడ్డా ఇద్దరి జీవనం సరళం గా సాగిపోతున్నది.  పూజ గారి పిల్లవాడు కూడా సంజ్ఞ‌ ల భాష ను నేర్చుకొన్నాడు.  అతను వాళ్ల బడి లో కథలు చెప్పడం లో బహుమతి ని కూడా సంపాదించాడు.  ఇదే విధంగా టింకా గారి కి ఉన్న ఆరు సంవత్సరాల కూతురు కు వినికిడి శక్తి లోపించింది.  టింకా గారు తన పుత్రిక తో సంజ్ఞ‌ ల భాష తాలూకు కోర్సు ను చేయించారు.  కానీ స్వయం గా ఆవిడ కు మాత్రం ఆ భాష  రాకపోయేది.  ఈ కారణం గా ఆమె తన బిడ్డ తో సంభాషించలేక పోయే వారు.  ఇప్పుడు టింకా గారు కూడాను సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ ను పొందారు మరి తల్లీకూతుళ్లు ఇద్దరూ ప్రస్తుతం ఒకరి తో మరొకరు ఎన్నో కబురుల ను చెప్పుకోగలుగుతున్నారు.  ఈ ప్రయత్నాల వల్ల కేరళ వాసి మంజు గారి కి కూడా చాలా లాభం కలిగింది.  మంజు గారు పుట్టిన అప్పటి నుండి వినే శక్తి కి నోచుకోలేదు.  అది మాత్రమే కాక ఆమె తల్లితండ్రుల జీవనం లో సైతం ఇదే స్థితి.  ఈ పరిస్థితిలో సైన్ లాంగ్వేజ్ యే మొత్తం కుటుంబాని కి మాట్లాడుకోవడానికి మాధ్యమం అయింది.  ఇప్పుడయితే మంజు గారు స్వయంగా తనే సైన్ లాంగ్వేజ్ టీచరు కావాలి అని నిర్ణయించేసుకున్నారు.

 

సహచరులారా, నేను దీని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో ఎందుకు చెబుతున్నాను అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి అందరికి అవగాహన కలగాలి అని. దీని ద్వారా దివ్యాంగ సోదరీమణుల కు, దివ్యాంగ సోదరుల కు మనం వీలైనంత ఎక్కువ గా సాయపడగలుగుతాం.  సోదరీమణులు మరియు సోదరులారా, కొన్ని రోజుల కిందట నాకు బ్రేల్ లో రాసిన హేమ్ కోశ్ తాలూకు ఓ ప్రతి కూడా అందింది.  హేమ్ కోశ్ అసమీ భాష లోని అత్యంత పురాతనమైన పదకోశాల లో ఒకటి.  దాని ని 19వ శతాబ్దం లో తయారు చేశారు.  దానికి ప్రముఖ భాషావిదుడు హేమచంద్ర బరువా గారు సంపాదకత్వం వహించారు.   ఆ హేమ్ కోశ్ యొక్క బ్రేల్ సంచిక దాదాపు గా 10 వేల పేజీలు ఉంది.  దాని ని 15 కు పైగా సంపుటాల రూపం లో ప్రచురించే పని జరుగుతున్నది.  దాంట్లో ఉన్న లక్ష కు పైచిలుకు పదాలను అనువదించవలసి ఉంది. నేను అత్యంత సంవేదనశీలమైన ఈ ప్రయత్నాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నాను.  ఈ విధం గా ప్రతి ఒక్క ప్రయాస దివ్యాంగ సోదరీమణుల, దివ్యాంగ సోదరుల కౌశలాన్ని మరియు సామర్ధ్యాన్ని పెంపొందింపచేయడానికి చాలా సాయపడనుంది. ప్రస్తుతం భారతదేశం పారా స్పోర్ట్స్ లో కూడాను సఫలత తాలూకు పతాకాన్ని ఎగురవేస్తున్నది.  మనం అందరం అనేక ఆట ల పోటీల లో దీనికి సాక్షులం గా ఉన్నాం. ప్రస్తుతం చాలా మంది ఎలా ఉన్నారంటే, వారు దివ్యాంగుల మధ్య ఫిట్ నెస్ కల్చర్ ను క్షేత్ర స్థాయి లో ప్రోత్సహించడం లో తలమునకలు గా ఉన్నారు.  దీనివల్ల దివ్యాంగుల ఆత్మ విశ్వాసాని కి చాలా బలం లభిస్తున్నది.

 

ప్రియమైన నా దేశవాసులారా, నేను కొన్ని రోజుల క్రితం సూరత్ కు చెందిన ఓ పుత్రిక అన్వీ తో భేటీ అయ్యాను.  అన్వీ తో పాటుగా అన్వీ యొక్క యోగ కూడా నాకు ఎంత బాగా గుర్తుండిపోయింది అంటే దాని ని  గురించి నేను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోత లు అందరి కి తప్పక చెప్పదలచుకున్నాను.  సహచరులారా, అన్వీ పుట్టిన అప్పటి నుండే డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నది.  తను చిన్నప్పటి నుండి అత్యంత క్లిష్టతరమైన హృద్రోగం తో బాధ పడుతోంది. తను మూడు నెలల పాప గా ఉన్నప్పుడు, అప్పుడే తను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవలసి వచ్చింది. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా, అన్వీ గాని, అన్వీ  తల్లితండ్రులు గాని ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. అన్వీ తల్లితండ్రులు డౌన్ సిండ్రోమ్ ను గురించి మొత్తం సమాచారాన్ని సేకరించారు. తరువాత అన్వీ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలా అని ఆలోచించారు.  వారు అన్వీ కి మంచినీళ్ల గ్లాసు ను ఎలా పట్టుకోవాలి, షూ లేసుల ను ఎలా కట్టుకోవాలి, బట్టల కు గుండీ లు ఎలా పెట్టుకోవాలి.. ఇటువంటి చిన్న చిన్న చిన్న విషయాల ను నేర్పించడం మొదలుపెట్టారు.  ఏ వస్తువు ను ఎక్కడ ఉంచాలి, మంచి అలవాటులు అంటే ఏమేమిటి వంటి విషయాలు అన్నిటి ని చాలా ధైర్యం తో వారు అన్వీ కి నేర్పించేందుకు ప్రయత్నించారు.  పుత్రిక అన్వీ ఏ విధం గా  నేర్చుకొనే సంకల్పాన్ని, తన ప్రతిభ ను కనబరచింది అంటే,  దాని తో ఆమె అమ్మానాన్నల కు కూడాను బోలెడంత నిబ్బరం  కలిగింది. వారు అన్వీ ని యోగ ను నేర్చుకోవలసిదంటూ ప్రేరేపించారు.  ఎంత కష్టం గా ఉండేది అంటే అన్వీ కనీసం తన కాళ్ల మీద నిలబడనైనా నిలబడగలిగేది కాదు.  అటువంటి స్థితి లో అన్వీ తల్లితండ్రులు తనను యోగ నేర్చుకో అంటూ ప్రోత్సహించారు.  మొట్టమొదటి సారి తను యోగ గురువు దగ్గర కు వెళ్లినప్పుడు ఆయన కూడా అసలీ పిల్ల యోగ చెయ్యగలుగుతుందా అన్న సందిగ్ధం లో ఉన్నారు.  కానీ అసలా కోచ్ కు కూడా అన్వీ కి ఈ విషయంలో ఎంత పట్టుదల ఉన్నది అనే విషయాన్ని గురించి ఎటువంటి అంచనా లేదేమో. తను తన తల్లి తో కలసి యోగ ను అభ్యసించడం మొదలుపెట్టింది.  పైగా ఇప్పుడు తను యోగ లో ఎక్స్ పర్ట్ అయిపోయింది.  ఇవాళ అన్వీ స్పర్ధల లో పాల్గొంటున్నది, పతకాలు సాధిస్తోంది. యోగ అన్వీ కి ఓ కొత్త జీవనాన్ని ప్రసాదించింది. అన్వీ పట్టుదల గా, శ్రద్ధ గా యోగ ను నేర్చుకొని తన జీవనాన్ని సాఫల్యం చేసుకొంది.  అమ్మానాన్న లు ఇంకా ఏమి చెప్పారు అంటే యోగ వల్ల అన్వీ జీవనం చాలా అద్భుతం గా మారిపోయింది అని.  ఇప్పుడు తన లో ఆత్మ విశ్వాసం గొప్ప గా పెరిగింది.  యోగ వల్ల అన్వీ కి శారీరిక స్వస్థత సైతం మెరుగైంది.  మరి మందుల అవసరం కూడా రోజురోజు కు తగ్గిపోతూ ఉంది. అన్వీ కి యోగ వల్ల కలిగిన లాభాన్ని గురించి దేశ విదేశాల లోని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోత లు శాస్త్రీయ అధ్యయనాన్ని చేయాలి అని నేను తలుస్తున్నాను. నాకు తెలిసినంతవరకు యోగ శక్తి సామర్ధ్యాల ను పరీక్షించడానికి, నిరూపించడానికి అన్వీ చాలా గొప్ప కేస్ స్టడీ కాగలదు అని నాకు తోస్తున్నది.  శాస్త్రజ్ఞులు ముందుకువచ్చి అన్వీ ని గురించి అధ్యయనం చేసి యోగ సామర్ధ్యాన్ని ప్రపంచాని కి పరిచయం చేయవలసిన అవసరం ఉంది.  ఆ తరహా పరిశోధన ల వల్ల, ప్రపంచం లో డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న అనేక మంది పిల్లల కు చాలా మేలు కలుగుతుంది. శారీరిక శ్రేయాని కి, మానసిక శ్రేయాని కి యోగ బాగా దోహదపడుతుందనే సంగతి ని యావత్తు ప్రపంచం ఇక ఒప్పుకొంది.  ప్రత్యేకించి మధుమేహం, రక్త పోటుల తో ముడిపడ్డ కష్టానష్టాల నుండి బైటపడేందుకు యోగ వల్ల చాలా మేలు కలుగుతుంది.  యోగ కు ఉన్న ఇంతటి శక్తి ని గుర్తించి జూన్ 21వ తేదీ ని ప్రపంచ యోగ దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించింది.  ఐక్య రాజ్య సమితి భారతదేశాని కి సంబంధించిన మరో ప్రయత్నాన్ని కూడా ఇప్పుడు గుర్తించింది. దాని ని గౌరవించింది. ఆ ప్రయత్నం ఏమిటి అంటే 2017వ సంవత్సరం లో ప్రారంభించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్.  దాని వల్ల రక్త పోటు తో బాధ పడుతున్న లక్షల మంది కి ప్రభుత్వ సేవా కేంద్రాల లో చికిత్స చేయడం జరుగుతోంది.  ఈ ప్రయత్నం అంతర్జాతీయ సంస్థ ల దృష్టి ని మన వైపునకు ఎంతగా ఆకర్షించింది అటే నిజం గా అది చాలా అపూర్వం.  అసలు మనందరికీ అత్యంత ఆశాజనకమైన విషయం ఏమిటి అంటే ఎంతమందికి అయితే చికిత్స చేశారో వారి లో సగం మంది కి రక్త పోటు అదుపు లో ఉంది.  నేను ఈ కార్యక్రమం కోసం పనిచేస్తున్న వారు అందరి కి ప్రత్యేకం గా అభినందన లు తెలియజేస్తున్నాను.  వారు అందరు ఎంతో శ్రమ పడి దీని ని సఫలమైంది గా మార్చివేశారు.

 

సహచరులారా, మానవ జీవనం యొక్క అభివృద్ధి యాత్ర, నిరంతరం నీటి తో ముడిపడిపోయి ఉంది.  అయితే అది సముద్రం కావచ్చు, లేదంటే నది కావచ్చు, చెరువు కావచ్చు.. 

భారతదేశానికి ఉన్న అదృష్టం ఏమిటి అంటే అది దాదాపు గా 7వేల 5 వందల కిలోమీటర్ల పొడవైన కోస్తా తీరప్రాంతం ఉన్న కారణం గా సముద్రం తో మనకు ఉన్నటువంటి బంధం విడదీయలేని ది గా ఉంది అనేదే. ఈ తీర ప్రాంతం ఎన్నో రాష్ట్రాల, ఎన్నో ద్వీపాల గుండా విస్తరించి ఉంది.   భారతదేశం లో ఉన్న వేరువేరు సముదాయాలు, అలాగే వైవిధ్యం తో కూడిన సంస్కృతి ఇక్కడ పరిఢవిల్లడాన్ని మనం స్వయం గా చూడవచ్చును.  అది మాత్రమే కాక, ఈ తీరప్రాంతాల లో ఉన్న వారి ఆహార వ్యవహారాలు అందర్నీ చాలా ఆకట్టుకుంటాయి. మనకు ఉన్న ఈ సువిశాల తీర ప్రాంతం పర్యావరణాని కి సంబంధించిన అనేక సమస్యల ను ఎదుర్కొంటున్నది.  ఓ వైపు న జలవాయు పరివర్తన మరీన్ ఇకో-సిస్టమ్స్ కు చాలా పెద్ద పెదరింపు గా మారిపోయింది. మరో వైపు న మన సముద్రపుటొడ్డుల లో పెరిగిపోతున్న మురికి అనేక ఇబ్బందుల ను సృష్టిస్తున్నది.  మన అందరి బాధ్యత ఏమిటి అంటే మనం ఆ సమస్య ల గురించి చాలా పట్టుదల గా, నిరంతరాయం గా శ్రమించాలి అనేదే.  నేను దేశం లోని తీర ప్రాంతాల లో ఉన్న కోస్టల్ క్లీనింగ్ కోసం స్వచ్ఛమైన సాగరం, సురక్షితమైన సాగరం అనే పేరు తో ఒక ప్రయాస ను గురించి మీతో మాట్లాడాలి అని అనుకొంటున్నాను.  జూలై 5వ తేదీ న మొదలైన ఈ పథకాని కి సంబంధించిన ప్రయత్నాలు గడచిన సెప్టెంబర్ 17వ తేదీ న విశ్వకర్మ జయంతి రోజు న సఫలం అయ్యాయి.  ఆ రోజు న ‘కోస్టల్ క్లీనింగ్ అప్ డే’ కూడా. స్వాతంత్ర్య అమృతోత్సవాల లో ఆరంభం అయిన ఈ ప్రచార ఉద్యమం 75 రోజుల పాటు నడిచింది. దీంట్లో జన భాగ్యస్వామ్యం పెద్ద ఎత్తున ఉంటోంది.  ఈ ప్రయోగం వల్ల దాదాపుగా నెలన్నర నుండి పరిశుభ్రత కు సంబంధించిన అనేక కార్యక్రమాలను గమనించగలిగాం.  గోవా లో ఓ పెద్ద మానవ హారాన్ని రూపొందించారు.  కాకినాడ లో గణపతి నిమజ్జనం సందర్భం లో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల ను గురించి జనాని కి వివరించడమైంది.  ఎన్ఎస్ఎస్ కు చెందిన దాదాపు 5000 మంది యువ సహచరులు 30 టన్నుల కు మించిన ప్లాస్టిక్ ను సేకరించారు.  ఒడిశా లో మూడు రోజుల లోపల 20 వేలమంది కి పైగా విద్యార్థులు వారి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వ్యక్తులను ‘స్వచ్ఛ సాగరం మరియు సురక్షిత సాగరం’ కార్యక్రమం కోసం ప్రేరేపిస్తామంటూ ప్రతిజ్ఞ ను స్వీకరించారు.  ఈ ప్రచార ఉద్యమం లో పాలుపంచుకొన్న వారు అందరి ని నేను అభినందించదలచుకొన్నాను.

 

ఎన్నికైన అధికారులు, ముఖ్యం గా నగరాల మేయర్ ల తో, గ్రామాల సర్పంచుల తో నేను మాట్లాడినప్పుడు నేను వారికి ఓ మాట తప్పక చెబుతాను.  స్వచ్ఛత కోసం చేస్తున్న ఈ యజ్ఞం లో స్థానిక సంస్థల ప్రతినిధుల ను, స్థానికుల ను కూడా భాగస్వాములను చేయాలి అని, వినూతన్న తరహా లో పనుల ను చేయాలి అని చెబుతుంటాను.

 

బెంగళూరు లో ఓ జట్టు ఉంది..  ‘యూథ్ ఫార్ పరివర్తన్’ (పరివర్తన కోసం యువత) అని. గడచిన ఎనిమిది సంవత్సరాలు గా ఈ జట్టు స్వచ్ఛత కోసం, అదే విధం గా ఇతర సామాజిక అంశాల కోసం చాలా పరిశ్రమిస్తున్నది.  వారి ధ్యేయం చాలా స్పష్టం గా ఉంది.  అది.. ‘ఫిర్యాదు చేయడం ఆపి, చేతల లోకి దిగడం’ అనేది.  ఈ యూథ్ ఫార్ పరివర్తన్ జట్టు నగరం లోని దాదాపు 370 ప్రాంతాల ను సుందరం గా తీర్చి దిద్దింది.  ప్రతి ప్రాంతం లో వంద నుండి నూట ఏభై మంది సభ్యులు ఈ ‘పరివర్తన కోసం యువత’ సంస్థ లో చేరారు.  ప్రతి ఆదివారం వారు ఈ కార్యాన్ని మొదలుపెడతారు.  మధ్యాహ్నం వరకు చేస్తారు.  ఈ పని లో చెత్త ను ఎలాగూ ఏరి పారేస్తారు; దాంతోపాటు గా పెయింటింగ్ అలాగే ఆర్టిస్టిక్ స్కెచెస్ ను వేసే పని కూడా జరుగుతుంది.  చాలా ప్రాంతాల లో వీరు సుప్రసిద్ధ వ్యక్తుల మాటల ను, వారి ప్రేరణదాయక పలుకులను కూడా మీరు దరర్శించవచ్చును.  బెంగుళూరు లో యూథ్ ఫార్ పరివర్తన్ ప్రయాస ల తరువాత మీకు నేను మేరఠ్ కు చెందిన ‘కబాడ్ సే జుగాడ్’ పథకాన్ని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను.  ఈ పథకం పర్యావరణ పరిరక్షణతో పాటు గా నగరాన్ని సుందరం గా తీర్చిదిద్దే పని ని కూడా తలకెత్తుకొంది.  ఈ ప్రచార ఉద్యమం లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే దీంట్లో లోహ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత టైర్ లు, అలాగే డ్రమ్ములు వంటి  పాడైపోయిన వస్తువుల ను ఉపయోగించడం జరుగుతుంది.  తక్కువ ఖర్చు తో సామాజిక స్థలాల ను సుందరం గా తీర్చిదిద్దడం ఎలాగో చూపించేందుకు ఈ ప్రయత్నాన్ని కూడా మనం ఒక ఉదాహరణ గా చెప్పవచ్చును.  ఈ ప్రయత్నాల ను చేపట్టిన వారందరి కి నేను హృదయపూర్వక అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా ఉత్సవాల వెలుగులు కనిపిస్తున్నాయి. రేపటి రోజు న నవరాత్రుల లో మొదటి రోజు.  ఆ దినాన మనం అమ్మవారి మొదటి స్వరూపం అయిన శైలపుత్రి ని ఆరాధిస్తాం.  అది మొదలు తొమ్మిది  రోజుల పాటు నియమబద్ధులమై, ఉపవాసం ఉంటూ, తరువాత విజయ దశమి పండుగ ను జరుపుకొంటాం. అంటే ఒక విధం గా మన పండుగల లో భక్తి మరియు ఆధ్యాత్మికతల తో కూడిన ఎంతటి నిగూఢమైన టువంటి సందేశం దాగి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నియమబద్ధమైన ప్రణాళిక తో సిద్ధి ని పొందడానికి తదనంతరం విజయదశమి పండుగ ను జరుపుకోవడం, ఈ రెండూ జీవనం లో ఎటువంటి లక్ష్యాన్ని అయినా సాధించుకొనే మార్గాలు అవుతాయి.  దసరా తరువాత ధన త్రయోదశి మరియు దీపావళి పండుగ లు కూడా రాబోతున్నాయి.

 

సహచరులారా, గత సంవత్సరాల నుండి మన పండుగల తో పాటు గా ఒక సరికొత్త సంకల్పాన్ని కూడా జోడించుకోవడం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే.. ఆ సంకల్పం ఏమిటి అంటే అది ‘వోకల్ ఫార్ లోకల్’ అనే సంకల్పం.  ఇప్పడు మనం పండుగ ల సంతోషం లో మన స్థానిక పౌరుల ను, శిల్పకారుల ను, వ్యాపారుల ను కూడా కలుపుకుపోతున్నాం.  రాబోయే అక్టోబర్ 2వ తేదీ న బాపూ జయంతి సందర్భం లో ఈ పథకాన్ని మరింత సమర్థవంతం గా అమలు చేయాలి అని మనం సంకల్పించుకోవాలి. ఒకవేళ చేనేత, హస్తకళలు.. ఇటువంటి ఉత్పాదనల తో పాటే స్థానికంగా తయారు చేసినటువంటి సామానులను తప్పక కొనుగోలు చేయండి. అసలు ఈ పండుగ కు నిజమైన ఆనందం ఎప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఈ పండుగ లో భాగం అయినప్పుడే; అందుకే, స్థానిక ఉత్పాదనల కు సంబంధించిన వారు అందరి కి మనం మద్దతు ను అందజేయాలి.  చాలా మంచి పద్ధతి ఏమిటి అంటే, అది పండుగ కాలం లో మనం ఏది కానుక గా ఇచ్చినా సరే, దానిలో ఈ తరహా ఉత్పాదన ను చేర్చాలి.

 

ఇప్పుడు ఈ పథకాని కి ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు వచ్చింది అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం లోకి అడుగుపెట్టేటప్పటికల్లా మనం స్వయం సమృద్ధ భారతాన్ని సాధించాలి అని కలలుగంటున్నాం కాబట్టి.  ఓ విధంగా చూస్తే మనకు ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన వారికి ఇదే నిజమైన శ్రద్ధాంజలి అవుతుంది. అందుకోసం నేను మీకు ఏమి చెప్పదలచుకున్నాను అంటే, అది ఈసారి ఖాదీ, చేనేత లేదంటే హస్త కళ వంటి ఉత్పాదనల ను కొనడం లో మీరు అన్ని రికార్డుల ను అధిగమించాలి అనేదే. మనం చూస్తున్నాం.. పండుగ లలో పేకింగ్ కు, అలాగే పేకేజింగ్ కోసం పాలిథీన్ సంచులను విరివి గా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛత కోసం తపిస్తున్న ఈ సందర్భం లో పాలిథీన్ వల్ల నష్టం కలిగించే చెత్త మన పండుగ వాతావరణాన్ని పాడు చేస్తుంది.  అందుకోసం మనం స్థానికం గా తయారైన ప్లాస్టిక్ ఉండని అటువంటి సంచులను మాత్రమే వాడాలి.  మన దగ్గర జనపనార వి, నార వి, అరటి నార తో తయారు చేసినవి.. ఇటువంటి సాంప్రదాయక వస్తువుల తో చేసిన బ్యాగు ల ఉపయోగం చాలా బాగా పెరుగుతోంది.  వీటి ని పండుగల లో అధికం గా వాడి ఈ వస్తువుల తయారీ ని ప్రోత్సహించడం మన అందరి బాధ్యత.  అలాగే స్వచ్ఛత అంటే మన ఆరోగ్యం తో పాటు గా పర్యావహరణ హితాన్ని కూడా మనం దృష్టి లో పెట్టుకోవాలి.

 

ప్రియమైన నా దేశవాసులారా, మన శాస్త్రాల లో

‘పరహిత్ సరిస్ ధరమ్ నహీ భాయీ’’ అని చెప్పడం జరిగింది. ఈ మాటల కు.. ఇతరుల కు మేలు చేయడం తో సమానమైన ధర్మం, ఇతరుల కు సేవ చేయడం మరియు ఉపకారం చేయడం తో సమానమైనటువంటి ధర్మం మరేదీ లేదు.. అని భావం.  గడచిన రోజుల లో దేశం లో, సమాజ సేవ కు సంబంధించి ఓ ఉదాహరణ ను మనం చూడగలిగాం.  మీరు కూడా చూసే ఉంటారు..  జనం ముందుకు వచ్చి క్షయ వ్యాధి తో బాధపడుతున్న రోగుల ను దత్తత తీసుకుంటున్నారు.  వారి కి పౌష్టిక ఆహారాన్ని అందించే బాధ్యత ను స్వీకరిస్తున్నారు.  నిజాని కి ఇది కూడా టీబీ ముక్త్ భారత్ అనే పథకం లో ఒక భాగమే. దీంట్లో జనం భాగస్వాములవుతున్నారు.  తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సరైన పోషణ లభిస్తేనే సరైన సమయం లో వేసుకొన్న మందులు టీబీ ని తగ్గించగలుగుతాయి.  నాకు పూర్తి విశ్వాసం ఉంది, భక్తి తో కూడిన ఈ జన భాగస్వామ్యం వల్ల 2025వ సంవత్సరానికల్లా భారతదేశం టీబీ బారి నుండి పూర్తి గా విముక్తి పొందుతుంది అని.

 

సహచరులారా, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్ రా- నగర్ హవేలీ మరియు దమన్-దీవ్ నుండి సైతం నాకు ఒక ఉదాహరణ ను గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది.  అక్కడ ఆదీవాసి ప్రాంతం లో నివసించే జిను రావతీయ గారు నాకేమని లేఖ రాశారు అంటే అక్కడ గ్రామాల ను దత్తత తీసుకొనే కార్యక్రమం నడుస్తోందట; దాని ద్వారా వైద్య కళాశాల విద్యార్థులు 50 గ్రామాల ను దత్తత చేసుకున్నారట.  వాటి లో జిను గారి గ్రామం కూడా ఉందట. రోగాల బారిన పడకుండా ఆయా గ్రామాల ప్రజల కు ఆ వైద్య విద్యార్థులు జాగ్రత లు చెబుతున్నారట. జబ్బు చేసిన వారికి సాయం కూడా చేస్తున్నారట.  అలాగే ప్రభుత్వ పథకాల ను గురించి కూడా వివరిస్తున్నారట.  పరోపకారం అనే ఈ భావన గ్రామాల లో నివసిస్తున్న వారి జీవనం లో సంతోషాన్ని నింపింది.  దీనికి గాను వైద్య కళాశాల విద్యార్థులు అందరి కి నేను అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.

 

సహచరులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో కొత్త కొత్త విషయాల ను గురించి మాట్లాడుకొంటున్నాం.  ఎన్నో సార్లు ఈ కార్యక్రమం ద్వారా మనం కొన్ని పాత విషయాల ను గురించి లోతు గా ఆలోచించే అవకాశం కూడా కలుగుతోంది. కిందటి నెల ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో నేను దొడ్డు బియ్యం గురించి, మరి 2023వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’ గా జరుపుకోవడం గురించి  ప్రస్తావించాను.  ఈ అంశం పై ప్రజల లో చాలా ఆసక్తి వ్యక్తం అయింది.  నాకు దాని గురించి ఎన్నో లేఖ లు వచ్చాయి. వాటిలో జనం ఏం చెబుతున్నారు అంటే వారు రోజువారి ఆహారం లో భాగం గా ఏ విధం గా చిరుధాన్యాల ను స్వీకరిస్తున్నదీ అనేదే.  కొందరు అయితే చిరుధాన్యాల తో తయారు చేసే సంప్రదాయబద్ధమైన ఆహార పదార్ధాల గురించి కూడా తెలిపారు.  ఇది ఒక చాలా పెద్ద మార్పునకు సంకేతం. జనాని కి ఉన్న ఈ ఉత్సాహాన్ని చూసి నాకేమనిపిస్తోంది అంటే మనందరం కలసి దీనిమీద ఓ ఎలక్ట్రానిక్ బుక్ (e-book) ను తయారు చేస్తే బాగుంటుంది అని.  దాంట్లో మనం మిలెట్స్ తో తయారు చేసుకునే డిషెస్ ను గురించి, మరి మన అందరి అనుభవాల ను గురించి వివరించడం బాగుంటుంది.  దాని వల్ల అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం మొదలవడానికి ముందే మన దగ్గర చిరుధాన్యాల కు సంబంధించిన ఒక సార్వజనిక విజ్ఞ‌ాన సర్వస్వం సైతం సిద్ధం అవుతుంది.  మనం దానిని MyGov పోర్టల్ లో కూడా ప్రచురణ చేయవచ్చును.

 

సహచరులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో ఈసారి ఈ విషయాలు చాలు.  అయితే వెళ్తూ వెళ్తూ, జాతీయ క్రీడల ను గురించి కూడా మీకు చెప్పాలి అని నేను అనుకొంటున్నాను.  సెప్టెంబర్ 29వ తేదీ నుండి గుజరాత్ లో జాతీయ క్రీడల కోసం ఏర్పాటు లు జరుగుతున్నాయి.  ఇది మనకు మహత్తరమైనటువంటి అవకాశం. ఎందుకు అంటే మనం చాలా సంవత్సరాల తరువాత జాతీయ క్రీడల ను నిర్వహించుకొంటున్నాం.  కోవిడ్ మహమ్మారి వల్ల కిందటి సారి ఈ ఆట ల పోటీల ను రద్దు చేయవలసి వచ్చింది.  ఈ ఆట ల పోటీల లో పాల్గొనబోతున్న క్రీడాకారిణులు/ క్రీడాకారులు అందరి కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  ఆ రోజు న ఆటగాళ్ల లో ఉత్సాహాన్ని నింపేందుకు నేను వారి మధ్యే ఉంటాను.  మీరంతా కూడా జాతీయ క్రీడల ను తప్పకుండా అనుసరించండి. అలాగే మన ఆటగాళ్ల లో ఆత్మ స్థైర్యాన్ని పెంచండి.  ఇంక నేను ఇవ్వాళ్టి కి సెలవు తీసుకొంటున్నాను. వచ్చే నెల లో జరిగే ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో కొత్త విషయాల తో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను.   ధన్యవాదాలు.   నమస్కారం.

 

***



(Release ID: 1862064) Visitor Counter : 308