జౌళి మంత్రిత్వ శాఖ

గాటిమ‌లలొ మేడిన్ ఇండియా - వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో ప్ర‌కాశిస్తున్న భార‌తీయ హ‌స్త‌క‌ళ‌లు


ప‌లు హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న భార‌త‌దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌దిమంది హ‌స్త‌క‌ళా నిపుణులు, ఎగుమ‌తిదారులు

ఇండియా పెవిలియ‌న్‌ను ప్రారంభించిన గాటిమ‌లా (లాటిన్ అమెరికా) ఉపాధ్య‌క్షుడు

Posted On: 24 SEP 2022 10:07AM by PIB Hyderabad

ది ఎక్స్‌పోర్ట్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ ఫ‌ర్ హ్యాండీక్రాఫ్ట్స్ (ఇపిసిహెచ్‌- హ‌స్త‌క‌ళ‌ల ఎగుమ‌తి ప్రోత్సాహ‌క మండ‌లి) గాటిమ‌ల (ల్యాటిన్ అమెరికా)లోని భార‌తీయ క‌మిష‌న్‌తో క‌లిసి భార‌తీయ హ‌స్త‌క‌ళ‌ల ఉత్ప‌త్తిదారులు & ఎగుమ‌తిదారులు భార‌త‌దేశంలో త‌యారు చేసిన భార‌తీయ క‌ళ‌లు& హ‌స్త‌క‌ళ‌ల వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌ను 22-24 సెప్టెంబ‌ర్ 2022వ‌ర‌కు గాటిమ‌ల‌లోని గాటిమ‌ల న‌గ‌రంలో నిర్వ‌మిస్తోంది. భార‌త‌దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప‌దిమంది జాతీయ స్థాయి హ‌స్త‌క‌ళ‌ల నిపుణులు, ఎగుమ‌తిదారులు గృహాలంక‌ర‌ణ‌, గృహోప‌క‌ర‌ణాలు, తివాచీలు, ఫ‌ర్నిచ‌ర్‌, దీపాలు, ఫ్యాష‌న్ ఆభ‌ర‌ణాలు & ఉప‌క‌ర‌ణాలు, అగ‌ర‌బ‌త్తులు, సుగంధ ద్ర‌వ్యాలు, వెల్నెస్ వంటి ప‌లు ర‌కాల చేతితో త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 
హ‌స్త‌క‌ళ‌ల రంగాన్ని బ‌లోప‌తం చేస ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించ‌డానికి హ‌స్త‌క‌ళ‌ల ఎగుమ‌తిదారుల స‌మాజం త‌మ కృషిని మ‌రింత ముందుకు తీసుకువెళ్ళే తిరుగుల‌ని స్ఫూర్తిని ప్ర‌తిఫ‌లించే  ఈ మేడిన్ ఇండియా వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌ను గాటిమ‌ల తాత్కాలిక అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడు శ్రీ గిలెర్మో కాసిల్లో,  గాటిమ‌ల‌కు భార‌త రాయ‌బారిగా వెళ్ళిన డాక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ మొహాపాత్రా గాటిమ‌ల‌లో  ప్రారంభించ‌డ‌మ కాకుండా త‌మ ప్రాంతంలో మేడిన్ ఇండియా వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించేందుకు త‌మ పూర్తి స‌హ‌కారాన్ని, మ‌ద్ద‌తున‌ను త‌మ‌కు అందించార‌ని, ఇపిసిహెచ్ డైరెక్ట‌ర్ శ్రీ రాకేష్ కుమార్ వెల్ల‌డించారు. 
ఈ భార‌తీయ క‌ళ‌లు & హ‌స్త‌క‌ళ‌లపై మేడిన్ ఇండియా - వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న ఉత్ప‌త్తిని ప్ర‌ద‌ర్శించేవారికి, కొనుగోలుదారుల‌కు ఆచ‌ర‌ణీయ వాణిజ్య ప్ర‌త్యామ్నాయాన్ని క‌ల్పిస్తుంద‌ని ఇపిసిహెచ్ చైర్మ‌న్ శ్రీ రాజ్ కుమార్ మ‌ల్హోత్రా చెప్పారు. భార‌తీయ మిష‌న్ల‌తో క‌లిసి భార‌తీయ క‌ళ‌లు & హ‌స్త‌క‌ళ‌ల‌పై మేడిన్ ఇండియా - వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న లాటిన్ అమెరికా ప్రాంతంలో వాణిజ్యం, ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాల‌ను పెంపొందిస్తుంద‌ని భావిస్తున్నారు. 
భార‌త‌దేశంలోని వైవిధ్య‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు మేడిన్ ఇండియా - వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న ఒక అవ‌కాశ‌మ‌ని, దీనికి అంత‌ర్జాతీయంగా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయ‌ని, గాటిమ‌ల‌కు భార‌తీయ రాయ‌బారి అయిన డాక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ మ‌హాపాత్ర పేర్కొన్నారు.  ఇది భార‌త‌దేశంలో స‌మృద్ధిగా ఉన్న నైపుణ్యాలు, పోటీత‌త్వం, అంత‌ర్జాతీయ స‌మ్మ‌తికి క‌ట్టుబ‌డి ఉన్న తీరును ప్ర‌ద‌ర్శించేందుకు కూడా ఇది ఒక అవ‌కాశ‌మ‌ని ఆయ‌న అన్నారు. 
నోడ‌ల్ ఏజెన్సీగా ఇపిసిహెచ్‌, దేశం నుంచి వివిధ ప్రాంతాల‌కు హ‌స్త‌క‌ళ‌ల ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాక‌, ఉన్న‌త నాణ్య‌త గ‌ల హ‌స్త‌క‌ళ‌ల ఉత్ప‌త్తులు & సేవ‌ల న‌మ్మ‌క‌మైన స‌ర‌ఫ‌రాదారుగా విదేశాల‌లో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది. ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22లో రూ. 33253 కోట్ల విలువైన (యుఎస్ $ 4459.76 మిలియ‌న్ల‌) హ‌స్త‌క‌ళ‌ల ఎగుమ‌తుల‌ను న‌మోదు చేసింది. గ‌త ఏడాదితో పోలిస్తే రూపాయి ప‌రంగా 29.49%,  డాల‌ర్ ప‌రంగా 28.90% వృద్ధిని సాధించింది. కాగా, 2021-22లో లాటిన్ అమెరికాకు చేసిన హ‌స్త‌క‌ళల ఎగుమ‌తుల విలువ రూ. 682 కోట్లు (యుఎస్‌డి 92 మిలియ‌న్‌).

గాటిమ‌ల‌లోని గాటిమ‌లా న‌గ‌రం, క‌యాలాలో మేడిన్ ఇండియా - వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభిస్తున్న గాటిమ‌ల తాత్కాలిక అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడు శ్రీ గాలెర్మో కాసిల్లో, గాటిమ‌ల‌కు భార‌త రాయ‌బారి డాక్ట‌ర్ మ‌నోజ్‌కుమార్ మ‌హాపాత్రా, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో క‌లిసి ప్రారంభిస్తున్న దృశ్యం. 

 
గాటిమ‌ల‌లోని గాటిమ‌లా న‌గ‌రం, క‌యాలాలో మేడిన్ ఇండియా - వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌నలో పాల్గొంటున్న నిపుణులైన హ‌స్త‌క‌ళ‌ల నిపుణులు, జాతీయ అవార్డు గ్ర‌హీత‌లతో గాటిమ‌ల తాత్కాలిక అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడు శ్రీ గాలెర్మో కాసిల్లో, గాటిమ‌ల‌కు భార‌త రాయ‌బారి డాక్ట‌ర్ మ‌నోజ్‌కుమార్ మ‌హాపాత్రా, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో క‌లిసి ప్రారంభిస్తున్న దృశ్యం. 
 

***
 



(Release ID: 1862010) Visitor Counter : 175