గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న - కేంద్ర జలశక్తి మరియు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు

प्रविष्टि तिथि: 24 SEP 2022 6:21PM by PIB Hyderabad

కేంద్ర జలశక్తి మరియు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు నేతృత్వంలో ఈరోజు న్యూఢిల్లీ, త్యాగరాజ నగర్‌ లోని శ్రీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా "సేవా పఖ్వాడా" కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.  ప్రధానమంత్రి పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమైన "సేవా పఖ్వాడా" కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. 

పర్యావరణ పరిశుభ్రత, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, రక్తదానం మొదలైన కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో, కేంద్ర జల శక్తి మరియు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు మాట్లాడుతూ, చైతన్యవంతమైన సమాజం మరియు ప్రగతి శీల దేశానికి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.  "మనబ్ సేవా హిన్ మాధవ్ సేవ" అంటే "మానవ సేవే మాధవ సేవ" అనే సుప్రసిద్ధ ఒడియా సూక్తిని ఉటంకిస్తూ, ఈ సూక్తి ఆధారంగా భారతదేశం ఒక రోజు విశ్వ గురువు అవుతుందని, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

*****


(रिलीज़ आईडी: 1862007) आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Tamil