శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలోని పాఠశాలల్లో కెమిస్ట్రీకి మద్దతు ఇవ్వడానికి కలిసి పనిచేయనున్న రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఆర్ఎస్‌సీ), సీఎస్ఐఆర్
రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ దేశవ్యాప్తంగా 30కి పైగా CSIR ల్యాబొరేటరీలలో నిర్వహించిన గ్లోబల్ కాయిన్ ప్రయోగంలో పాల్గొన్న 2000 మంది విద్యార్థులు
Posted On:
23 SEP 2022 11:23AM by PIB Hyderabad
రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ మరియు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (CSIR) దేశంలోని పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో రసాయన శాస్త్రాలను ప్రోత్సహించడానికి ఔట్‌రీచ్ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించేందుకు నిర్ణయించాయి.
30కి పైగా సీఎస్ఐర్ ల్యాబొరేటరీలలో నిర్వహించబడిన ఆర్ఎస్‌సీ యొక్క గ్లోబల్ కాయిన్ ప్రయోగంలో దేశవ్యాప్తంగా సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులను, పరిశోధకులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఔట్రీచ్ కార్యక్రమాలను - సీఎస్ఐఆర్ యొక్క జిజ్ఞాస కార్యక్రమంలో కలిసి పనిచేయడానికి రెండు సంస్థలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఎమ్ఒయు పునరుద్ధరణ కలిగిన ఆర్థికేతర, కనీసం మూడేళ్ల కాలపరిమితితో ఉంటుంది.
image.png
సముద్ర శాస్త్రం (ఓషనోగ్రఫీ), మైనింగ్ నుండి మొదలుకొంటే కెమికల్స్, నానోటెక్నాలజీ వరకు సైన్స్ మరియు టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధికి సీఎస్ఐఆర్ కృషి చేస్తుంది. సీఎస్ఐఆర్ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రయోగశాలలు, ఔట్రీచ్ కేంద్రాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
జిజ్ఞాస కార్యక్రమం భారతదేశంలో ప్రస్తుతం ఉన్న విద్యా కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు, ఆర్ఎస్‌సీ-జిజ్ఞస భాగస్వామ్యం ద్వారా ఆర్ఎస్‌సీ యొక్క ప్రస్తుత ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం, కెమిస్ట్రీ శిబిరాలను విస్తరించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా అనేక ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలను ప్రారంభించనుంది.
జిజ్ఞాస కార్యక్రమం కోసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈ సహకారం అన్ని సీఎస్ఐఆర్ ప్రయోగశాలలతో సహా గ్లోబల్ పరిశోధనను నిర్వహిస్తోంది. కనీసం 2,000 మంది పాఠశాల విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు, 350 మంది వాలంటీర్లు 30కి పైగా సీఎస్ఐఆర్ ప్రయోగశాలలలో నిర్వహించబడిన ‘ఆర్ఎస్‌సీ యొక్క గ్లోబల్ కాయిన్ ప్రయోగంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల నాణేలతో తయారు చేసిన బ్యాటరీలను సరిపోల్చమని పాల్గొన్నవారిని కోరడం జరిగింది. దీని ద్వారా తమ డేటాను ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నవారి డాటాతో సరిపోల్చేందుకు వీలు కలుగుతుంది.
సెప్టెంబరు 22న జరిగిన సమావేశంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి, నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (CSIR-NPL) డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ ఆచంట సమక్షంలో సీఎస్ఐర్ నుంచి డాక్టర్ గీతా వాణి రాయసం మరియు ఆర్ఎస్‌సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ లూయిస్ సంతకాలు చేసారు.
image.png
ఆర్ఎస్‌సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ లూయిస్ మాట్లాడుతూ, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ చేసే ప్రతి పనిలో సహకారం ప్రధానమైనదన్నారు. అందుకే తాము సీఎస్‌ఐఆర్‌తో కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ఢిల్లీకి రావడం జరిగిందన్నారు. రానున్న సంవత్సరాలలో రసాయన శాస్త్రాలను భారతదేశం అంతటా ప్రోత్సహించడానికి దీని ద్వారా వీలుకలుగుతుందని ఆయన అన్నారు.
సిఎస్‌ఐఆర్ డిజి డాక్టర్ కలైసెల్వి మాట్లాడుతూ, దేశానికే కాకుండా ప్రపంచానికి స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సైన్స్ & టెక్నాలజీ కీలకమని అన్నారు. “బ్యాటరీ టెక్నాలజీ భవిష్యత్తుపై ప్రావీణ్యత" అనే అంశంపై ప్రసంగించారు. ఆర్ఎస్‌సీతో భాగస్వామ్యం విద్యార్థులలో సైన్స్ వ్యాప్తికి సహాయపడుతుందని భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా వారిని ప్రేరేపిస్తుందని చెప్పారు.
ఆర్‌ఎస్‌సి ఇండియా మేనేజర్ డైరెక్టర్ అజిత్ శర్మ మాట్లాడుతూ, “జిజ్ఞాస కార్యక్రమంతో సహకరించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇది దేశంలో రసాయన శాస్త్రాలను అభ్యసించే వారికి మెరుగైన అభ్యాస అవకాశాలను అందిస్తుందన్నారు. ఆర్ఎస్‌సీ, సీఎస్ఐఆర్ సంస్థల గణనీయమైన నైపుణ్యం, వనరులను ఇందుకు ఉపయోగపడతాయని అన్నారు. మన యువకులు భవిష్యత్తులోని ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే వారికి వారి శాస్త్రాలలో దృఢమైన పునాది, ఆచరణాత్మక అనుభవం అందించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ
రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రపంచంలోని రసాయన శాస్త్రవేత్తలను ఒకరితో ఒకరిని, ఇతర శాస్త్రవేత్తలతో మరియు మొత్తం సమాజంతో అనుసంధానించే అంతర్జాతీయ సంస్థ. దీనిని 1841లో లండన్‌లో స్థాపించారు. వారికి 50,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ సభ్యత్వం ఉంది. తమ గ్లోబల్ పబ్లిషింగ్ మరియు నాలెడ్జ్ బిజినెస్ నుండి వచ్చిన మొత్తాన్ని వేలాది మంది రసాయన శాస్త్రవేత్తలకు రసాయన పరిజ్ఞానంలో కీలకమైన పురోగతిని సాధించడానికి అవసరమైన మద్దతు మరియు వనరులను అందించడానికి ఉపయోగిస్తారు. వృత్తిపరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేస్తూ, నూతన ఆలోచనలు, సరికొత్త భాగస్వామ్యాలను ప్రేరేపించడానికి వ్యక్తులను ఒకచోట కలుపుతారు. భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలను ప్రేరేపించడానికి ఉపాధ్యాయులకు మద్దతు ఇస్తున్నారు. ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే వ్యక్తులను ప్రభావితం చేసేందుకు మాట్లాడుతారు. ప్రపంచాన్ని సుసంపన్నం చేసే రసాయన శాస్త్రానికి వారు ఒక ఉత్ప్రేరకం.
కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రీ, సైంటిఫిక్ రీసర్చ్ (సీఎస్ఐఆర్)
సీఎస్ఐఆర్ సంస్థ, 1942లో స్థాపించారు. విభిన్న సైన్స్ & టెక్నాలజీ రంగాలలో అత్యాధునిక పరిశోధనాభివృద్ధి విజ్ఞానానికి పేరుగాంచిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. సీఎస్ఐఆర్ 37 జాతీయ ప్రయోగశాలలతో డైనమిక్ నెట్‌వర్క్‌తో దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉన్న సమకాలీన పరిశోధన, అభివృద్ధి & ఇంజనీరింగ్ సంస్థ. సీఎస్ఐఆర్ పరిశోధనాభివృద్ధి, నైపుణ్యం, అనుభవం దాని 7000 మంది శాస్త్రీయ మరియు సాంకేతిక సిబ్బందిలో పొందుపరచబడింది. దేశంలో సీఎస్ఐఆర్ నేడు అగ్రగామిగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా నిధులు సమకూర్చే శాస్త్రీయ, పారిశ్రామిక సంస్థలలో ఒకటి.
<><><><><>
(Release ID: 1861807)