రైల్వే మంత్రిత్వ శాఖ
త్వరితగతిన రైల్వే ట్రాక్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు భారతీయ రైల్వే ప్రాధాన్యత
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1352 కిలోమీటర్ల మార్గం (కొత్త లైన్లు/ గేజ్ మార్పిడి/ మల్టీ ట్రాకింగ్) పూర్తి
గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి పూర్తి చేసిన పనికి మూడు రెట్లు పని పూర్తి
Posted On:
22 SEP 2022 6:12PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు లాజిస్టిక్స్ యూనిట్ ధరను కనిష్ట స్థాయికి తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇటీవలి కాలంలో రైలు పట్టాలకు సంబంధించిన రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీటవేశారు, ఫలితంగా ఒక సరళి స్పష్టంగా గోచరించింది. రైల్వే పట్టాల ప్రాజెక్టులు అంటే, కొత్త లైన్లు, గాజ్ మార్పిడి, బహుళ పట్టాలు (మల్టీ ట్రాకింగ్) (రెండింతలు/ మూడింతలు) పని గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్ - సెప్టెంబర్ (నేటివరకు) దాదాపు మూడు రెట్లు పురోగతిని సాధించింది.
ఈ ఆర్థిక సంవత్సరం 21 సెప్టెంబర్ 2022వరకు రైల్వేలు 1353 ట్రాక్ కిలోమీటర్ల (టికెఎం) పొడవైన కొత్త లైన్లను, గాజ్ బదలాయింపులు, బహుళ పట్టాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. సెప్టెంబర్ మాసంలో మరొక 130 టికెఎంలు దీనికి చేరనున్నాయి. గత ఏడాది సంవత్సరంలో ఏ కాలంతో పోలిస్తే ప్రస్తుత మొత్తం గణాంకం మూడు రెట్లు ఎక్కువగా ఉంది. గత ఏడాది, 482 టికెంలను 30 సెప్టెంబర్ 2021 నాటికి పూర్తి చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు 42 టికెఎంల కొత్త లైను, 28 టికెఎంల గాజ్ మార్పిడి, 1283 బహుళ ట్రాకింగ్ పూర్తి అయింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం (సెప్టెంబర్ 2021 వరకు) కేవలం 4 టికెఎంల గాజ్ బదలాయింపు, 478 టికెఎంల బహుళ ట్రాకింగ్‌ను సాధించారు. అయితే, ఈ కాలంలో నూతన లైన్లలో ఎటువంటి పురోగతిని సాధించలేదు.
ప్రారంభించిన ప్రధాన విభాగాలు:
డబ్లింగ్ / మల్టీ ట్రాకింగ్ : దౌంద్ - గుల్బర్గా (225 కిమీ)- ముంబై- చెన్నై గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూట్ ( స్వర్ణ చతుర్భుజ మార్గం), ఎపిలో విజయవాడ- గుడివాడ- భీమవరానికి సంబంధించిన (221 కిమీ). సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ డబ్లింగ్ (85 కిమీ)- తెలంగాణ.
గాజ్ మార్పిడి: బీహార్‌లో మాన్సి- సహర్స- పూనియా (169 కిమీలు) - రాజస్థాన్‌లో మావ్లీ- బడీ సద్రి (82 కిమీలు).
నూతన లైను: తెలంగాణలో భద్రాచలం - సత్తుపల్లి (56 కిమీలు)
ఆర్థిక సంవత్సరం 2022-2023లో నూతన లైన్/ డబ్లింగ్ / గాజ్ మార్పిడికి కేటాయించిన కాపెక్స్ (మూలధన వ్యయం) రూ. 67000 కోట్లుగా (బిఇ) ఉంది. ఆగస్టు 2022 వరకు వాస్తవ వ్యయం రూ. 20075. కాగా, 2021-2022లో నూతన లైన్/ డబ్లింగ్ / గాజ్ మార్పిడికి కేటాయించిన మొత్తం మూలధన వ్యయం రూ. 45465 కోట్లు (బిఇ)గా ఉంది. అయితే, ఆగస్టు 2021 వరకు అయిన వాస్తవ ఖర్చులు రూ. 15,281 కోట్లు.
నూతన లైను/ డబ్లింగ్, గేజ్ మార్పిడిలో 2021-2022లో లక్ష్యిత 2400 కిమీలకు బదులుగా 2904 కిమీలను సాధించారు. ఇది అత్యున్నత కమిషనింగ్ (డిఎఫ్‌సిని మినహాయించి), ప్రస్తుత సంవత్సరానికి లక్ష్యం 2500 కిమీలు.
రైలు ప్రాజెక్టుల సమర్ధవంతమైన, వేగవంతమైన అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో - 1) ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు తగినంతగా నిధుల కేటాయింపు పెంపు 2) క్షేత్ర స్థాయిలో అధికారాన్ని వేరొకరికి అప్పగించడం 3) వివిధ స్థాయిల్లో ప్రాజెక్టు పురోగతిని సన్నిహితంగా సమీక్షించడం 4) త్వరితగతిన భూసేకరణ, అటవీ, వన్యప్రాణుల అనుమతుల కోసం, ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా చర్చ, సంప్రదింపులు జరపడం.
***
(Release ID: 1861656)
Visitor Counter : 166