వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజ‌రాత్ నుంచి యుఎస్ఎకు శాకాహార శ్రేణి కింద మొక్క‌ల ఆధారిత మాంస ఉత్ప‌త్తుల తొలి స‌రుకు ఎగుమ‌తి


న్యూజిలాండ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాల‌కు శాకాహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌ను పెంచేందుకు కేంద్ర ప్ర‌ణాళిక

Posted On: 22 SEP 2022 2:45PM by PIB Hyderabad

 ప్ర‌త్య‌క‌మైన  విధానం ద్వారా త‌యారుచేసిన వ్య‌వ‌సాయ ఆహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు,ఉత్ప‌త్తుల ఎగుమ‌తులను ప్రోత్స‌హించే అత్యున్న‌త సంస్థ అయిన  అగ్రిక‌ల్చ‌ర‌ల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడ‌క్ట్స్ ఎక్స్‌పోర్ట్ అథారిటీ (ఎపిఇడిఎ - వ్య‌వ‌సాయ‌, త‌యారు చేసిన ఆహార ఉత్ప‌త్తుల ఎగుమ‌తి అథారిటీ) ద్వారా శాకాహార ఆహార వ‌ర్గంలోకి వ‌చ్చే ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రోడక్ట్స్ ( శాకాహార లేదా మొక్క‌ల ఆదారిత మాంస ఉత్ప‌త్తుల‌ను)గుజ‌రాత్‌లోని ఖ‌దాలోని న‌దియాద్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ)లోని కాలిఫోర్నియాకు తొలి స‌రుకును ఎగుమ‌తి పంప‌డాన్ని కేంద్రం సుల‌భ‌త‌రం చేసింది. 
అభివృద్ధి చెందిన దేశాల‌లో శాకాహార ఉత్ప‌త్తుల‌కు ప్రాచుర్యం పెరుగుతున్నందున‌, శాకాహార ఉత్ప‌త్తుల‌లో ల‌భించే అధిక పోష‌క విలువ‌ల కార‌ణంగా శాకాహార ఉత్ప‌త్తుల‌కు  అంత‌ర్జాతీయ మార్కెట్‌లో భారీ ఎగుమ‌తి సంభావ్య‌త ఉంది. శాకాహార ఉత్ప‌త్తుల‌లో పుష్క‌లంగా పీచు ప‌దార్ధం ఉండ‌టం, త‌క్కువ కొలెస్ట‌రాల్ ఉండ‌డంతో అవి అంత‌ర్జాతీయంగా ప్ర‌త్యామ్నాయ ఆహార ఉత్ప‌త్తులుగా మారుతున్నాయి. 
న‌దియాద్ నుంచి యుఎస్ఎకు ఎగుమ‌తి చేసిన తొలి స‌రుకులో మోమోలు, మినీ స‌మోసాలు, చెక్క‌లు, చేగోడీలు, స్ప్రింగ్ రోల్స్, బ‌ర్గ‌ర్లు త‌దిత‌రాలు ఉన్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన గ‌ణాంక తదిత‌ర మ‌ద్ద‌తును ఖ‌డా జిల్లా పాల‌నా యంత్రాంగం అందించింది. 
నూత‌న విదేశీ గ‌మ్యాల అన్వేషించాల్సిన అవ‌స‌రాన్ని ఉద్ఘాటిస్తూ,  సంప్ర‌దాయ ప‌శు ఆధారిత మాంస ఉత్ప‌త్తుల మార్కెట్‌కు భంగం క‌లిగించ‌కుండా మొక్క‌ల ఆధారిత మాంస ఉత్ప‌త్తుల‌ను భారీ ఎత్తున ప్రోత్స‌హించేందుకు ఎపిఇడిఎ ప‌ని చేస్తోంద‌ని ఎపిఇడిఎ చైర్మ‌న్ డాక్ట‌ర్ ఎం. అంగ‌ముత్తు తెలిపారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, భ‌విష్య‌త్తులో కూడా ఎపిఇడిఎ ఎగుమ‌తి సంబంధిత కార్య‌క‌లాపాల‌కు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఖ‌దా జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ కె.ఎల్ బ‌చానీ హామీ ఇచ్చారు. ఎపిఇడిఎ గుజ‌రాత్ ప్రాంత అధిప‌తి కృషి కార‌ణంగా న‌దియాద్ నుంచి యుఎస్ఎకు శాకాహార ఉత్ప‌త్తుల స‌రుకు ఎగుమ‌తి  సాధ్య‌మైంద‌ని బ‌చానీ వెల్ల‌డించారు.  రానున్న నెల‌ల్లో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్ స‌హా ఇత‌ర ద‌శాల‌కు చెక్క‌లు, ఇత‌ర స్నాక్స్‌, జున్ను త‌దిత‌ర ప‌లుర‌కాల శాకాహార ఉత్ప‌త్త‌ల ఎగుమ‌తిని ప్రోత్స‌హించేందుకు ఎపిఇడిఎ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. ఎపిఇడిఎ ఎగుమ‌తుల జాబితాలో మ‌రిన్ని శాకాహార  ఉత్ప‌త్తుల‌ను జ‌త చేయాల్సిన అవ‌స‌రాన్ని ఈ సంద‌ర్భంగా ఎపిఇడిఎ గుజ‌రాత్ ప్రాంత అధిప‌తి నొక్కి చెప్పారు. శాకాహార ఉత్ప‌త్తుల తొలి స‌రుకుని గ్రీన్‌నెస్‌, హోల్‌స‌మ్ ఫుడ్స్ ఎగుమ‌తి చేశాయి. 
దృశ్య మాధ్య‌మం ద్వారా వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌లు, రైతుల అనుసంధాన పోర్ట‌ల్‌, ఇ- ఆఫీస్‌, హార్టినెట్ ట్రేసెబిలిటీ సిస్థం, కొనుగోలుదారు, అమ్మ‌కందారుల స‌మావేశాలు, విదేశీ కొనుగోలుదారులు విచారించేందుకు వీలుగా రివ‌ర్స్ కొనుగోలుదారు, అమ్మ‌కందారుల స‌మావేశాలు, నిర్ధిష్ట ఉత్ప‌త్తికి ప్ర‌చారాలు త‌దిత‌ర విష‌యాల‌పై ఎపిఇడిఎ ప‌లు ఎగుమ‌తి ప్రోత్సాహ‌క కార్య‌క‌లాపాల‌ను, చొర‌వ‌ల‌ను చేప‌ట్టింది. రాష్ట్రం నుంచి ఎగుమ‌తిని ప్రోత్స‌హించేందుకు, మౌలిక స‌దుపాయాల సృష్టి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఎపిఇడిఎ స‌న్నిహితంగా ప‌ని చేస్తోంది. ఎగుమ‌తి ప‌రీక్ష‌లు, అవ‌శేష ప‌ర్య‌వేక్ష‌ణ ప్ర‌ణాళిక‌ల కోసం గుర్తించిన ప్ర‌యోగ‌శాల‌ల ఆధునీక‌ర‌ణ‌, బ‌లోపేతం చేయ‌డంలో ఎపిఇడిఎ సాయాన్ని అందిస్తుంది. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఎగుమ‌తిని పెంచ‌డానికి మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, నాణ్య‌త‌, మెరుగుద‌ల‌, మార్కెట్ అభివృద్ధి ఆర్థిక స‌హాయ ప‌థ‌కాల కింద కూడా తోడ్పాటును అందిస్తుంది.  
ఎగుమ‌తిదారులు త‌మ ఆహార ఉత్ప‌త్తుల‌ను అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మార్కెట్ చేసేందుకు ఎగుమ‌తిదారుల‌కు వేదిక‌ను అందించేందుకు అంత‌ర్జాతీయ వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో ఎగుమ‌తిదారులు పాలుపంచుకునేందుకు ఎపిఇడిఎ వీలు క‌ల్పిస్తుంది.  దీనితో పాటుగా . వ్య‌వ‌సాయ ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు  ఎపిఇడిఎ ఆహార్ (ఎఎహెచ్ఎఆర్‌), ఆర్గానిక్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్‌, బ‌యోఫాక్ ఇండియా త‌దిత‌రాలను నిర్వ‌హిస్తుంది.  
ఎగుమ‌తి చేయ‌నున్న ఉత్ప‌త్తుల నాణ్య‌త ధ్రువీక‌ర‌ణ సాఫీగా జ‌రిగేలా చూసేందుకు,  ఎపిఇడిఎ  ఎగుమ‌తిదారుల‌కు చెందిన భిన్న వ‌స్తువుల‌ను ప‌రీక్షించే సేవ‌ల‌ను అందించేందుకు భార‌త‌దేశ వ్యాప్తంగా 220 ప్ర‌యోగ‌శాల‌లను  గుర్తించింది. 

***


(Release ID: 1861614) Visitor Counter : 160