శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

పెన్సిల్వేనియాలోని పిట్స్ బ‌ర్గ్ లో సెప్టెంబ‌ర్ 21 నుంచి 23 వ‌ర‌కు జ‌రుగ‌నున్న‌ ప్ర‌పంచ స్వ‌చ్ఛంద ఇంధ‌న కార్యాచ‌ర‌ణ ఫోర‌మ్ స‌మావేశాల్లో పాల్గొనేందుకు 5 రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డిసి వెళ్లే దారిలో న్యూయార్క్ చేరిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్


డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ కు స్వాగ‌తం ప‌లికిన భార‌త రాయబార కార్యాల‌యానికి చెందిన సీనియ‌ర్ అధికారులు; జెఎఫ్ కె విమానాశ్ర‌యంలో విమానాశ్ర‌యంలో లాంఛ‌న ప్రాయంగా జ‌రిగే స‌త్కారాల అనంత‌రం 35 కంపెనీల సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ లు, ఫెడ‌ర‌ల్ అధికారుల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొనేందుకు వాషింగ్ట‌న్ డిసి ప‌య‌నం

5 రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విద్యుత్‌, న‌వ్య & పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు; సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ‌ల మంత్రులు, అధికారుల సంయుక్త ప్ర‌తినిధివ‌ర్గానికి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ నాయ‌క‌త్వం; ప్ర‌పంచ స్వ‌చ్ఛ ఇంధ‌న కార్యాచ‌ర‌ణ ఫోర‌మ్ స‌మావేశానికి హాజ‌రు

Posted On: 20 SEP 2022 6:09PM by PIB Hyderabad

సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా); ఎర్త్ సైన్స్ ల శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా); ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలో సిబ్బంది వ్య‌వ‌హారాలు, ప్ర‌జా ఫిర్యాదులు, పింఛ‌న్లు, అంత‌రిక్ష‌, అణుఇంధ‌న శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ 5 రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డిసి వెళ్తూ మార్గ మ‌ధ్యంలో న్యూయార్క్ చేరారు. ఆయ‌న భార‌త సంయుక్త మంత్రివ‌ర్గ బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పెన్సిల్వేనియాలోని పిట్స్ బ‌ర్గ్ లో సెప్టెంబ‌ర్ 21-23 తేదీల్లో జ‌రుగ‌నున్న ప్ర‌పంచ స్వ‌చ్ఛ ఇంధ‌న కార్యాచ‌ర‌ణ ఫోర‌మ్ స‌మావేశంలో పాల్గొంటారు.

 

భార‌త రాయ‌బార కార్యాల‌యం సీనియ‌ర్ అధికారులు డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ కు స్వాగతం ప‌లికారు. జెఎఫ్ కె విమానాశ్ర‌యంలో లాంఛ‌న‌ప్రాయ స్వాగ‌త స‌త్కారాల అనంత‌రం ఆయ‌న 35 కంపెనీల సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ లు, ఫెడ‌ర‌ల్ ప్ర‌తినిధుల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొనేందుకు వాషింగ్ట‌న్ డిసికి బ‌య‌లుదేరి వెళ్లారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాషింగ్ట‌న్ డిసిలోని అమెరిక‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశంలో జియో స్పేషియ‌ల్‌, అంత‌రిక్షం, ఎర్త్ అండ్ ఓష‌న్ సైన్స్, ఫార్మా, బ‌యోటెక్ రంగాల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు.

 

విద్యుత్‌, న‌వ్య & పున‌రుత్పాద‌క ఇంధ‌న మంత్రిత్వ శాఖ‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ సీనియ‌ర్ మినిస్టీరియ‌ల్ అధికారుల సంయుక్త ప్ర‌తినిధివ‌ర్గానికి ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ స్వ‌చ్ఛ ఇంధ‌న కార్యాచ‌ర‌ణ ఫోర‌మ్ స‌మావేశంలో పాల్గొన‌డంతో పాటు ఆయ‌న ప్ర‌ముఖ విద్యావేత్త‌లు, అమెరికాలో భార‌త సంత‌తి ప్ర‌జ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

 

35 ప్ర‌ముఖ‌ కంపెనీల సిఇఓల రౌండ్ టేబుల్ స‌మావేశంలో డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ లిగో (లేజ‌ర్ ఇంట‌ర్ ఫెరోమీట‌ర్ గ్రావిటేష‌న‌ల్ అబ్జ‌ర్వేట‌రీ), టిఎంటి (30 మీట‌ర్ల టెలిస్కోప్‌), న్యూట్రినో ఫిజిక్స్, స్వ‌చ్ఛ ఇంధ‌న టెక్నాల‌జీలు, హెల్త్ సైన్స్ లు, ఎర్త్ అండ్ ఓష‌న్ సైన్స్ లు, వ్య‌వ‌సాయ శాస్ర్తాలు వంటి కీల‌క విభాగాల్లో సైన్స్ అండ్ టెక్నాల‌జీ స‌హ‌కారం; కొత్త‌గా అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీల్లో స‌హ‌కారం విస్త‌ర‌ణ‌ గురించి చ‌ర్చిస్తారు.

 

అలాగే డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ కోబోటిక్స్, కంప్యూట‌ర్ విజ‌న్‌, రోబోటిక్స్, ఆటోమేష‌న్ టెక్నాల‌జీలు, కృత్రిమ మేథ‌, మెషీన్ లెర్నింగ్‌, డేటా అన‌లిటిక్స్, సెన్స‌ర్లు, నెట్ వ‌ర్కింగ్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇంట‌ర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ టెక్నాల‌జీల్లో భార‌త‌ సైన్స్అం డ్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌; అమెరికా నేష‌న‌ల్ సైన్స్ ఫౌండేష‌న్ (ఎన్ఎస్ఎఫ్‌) ఉమ్మ‌డిగా చేప‌ట్టిన ప్రాజెక్టుల్లో ఉమ్మ‌డిగా ఆస‌క్తి గ‌ల అంశాల‌పై విస్తృత స్థాయి స‌హ‌కారం గురించి కూడా ప్ర‌స్తావిస్తారు.

 

భార‌త అంత‌రిక్ష రంగంలో అందుబాటులో ఉన్న‌ర అద్భుత అవ‌కాశాల గురించి, నిసార్ (నాసా-ఇస్రో సింథెటిక్ అపెర్చ‌ర్ రాడార్‌) పేరిట జాయింట్ రాడార్ ఉప‌గ్ర‌హం అంత‌రిక్షంలోకి పంపేందుకు ఇస్రో, సానా ఉమ్మ‌డి కృషి గురించి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అమెరికా ఎంఎన్ సి ప్ర‌తినిధుల‌కు వివ‌రిస్తారు. వాతావ‌ర‌ణ సంక్షోభాన్ని నివారించేందుకు అవ‌స‌ర‌మైన కీల‌క డేటాను నిసార్ సేక‌రిస్తుంది. చంద్ర‌యాన్-1, మార్స్ ఆర్బిట‌ర్ మిష‌న్ (ఎంఓఎం) , చంద్ర‌యాన్‌-2 వంటి ప్రాజెక్టుల్లో నాసా నుంచి ఇస్రోకు డీప్ స్పేస్ నెట్ వ‌ర్క్ ఆంటెనా అందుకుంటోంది. చంద్ర‌యాన్‌-3 మిష‌న్ లో కూడా ఈ మ‌ద్ద‌తు అందుబాటులో ఉంటుంది.

 

క్వాంట‌మ్ టెక్నాల‌జీ, కృత్రిమ మేథ‌, స‌ముద్ర జ‌లాల లోతుల్లో అన్వేష‌ణ‌, విద్యుత్ వాహ‌నాలు; టెలీ క‌మ్యూనికేష‌న్లు, సెమీ కండ‌క్ట‌ర్ ప‌రిశోధ‌న‌, ఇన్నోవేష‌న్‌; హై రిజ‌ల్యూష‌న్ జియో స్పేషియ‌ల్ డేటా అక్విజిష‌న్‌, ప్రాసెసింగ్, పంపిణీ విభాగాల్లో జియో స్పేషియ‌ల్ టెక్నాల‌జీ వంటి ఉమ్మ‌డి ప్రాధాన్య‌త గ‌ల రంగాల్లో భార‌త‌, అమెరికా భాగ‌స్వామ్యం మ‌రింత విస్త‌రించుకోవ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను కూడా డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ప్ర‌స్తావిస్తారు.

 

ఇండియా హౌస్ లో భార‌త రాయ‌బారి ఏర్పాటు చేసిన విందు స‌మావేశ‌లో అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ కు చెందిన కీల‌క అధికారుల‌తో మంత్రి సంభాషిస్తారు.

 

విందు అనంత‌రం డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ సెప్టెంబ‌ర్ 21న స్వ‌చ్ఛ ఇంధ‌న మంత్రిత్వ శాఖ (సిఇఎం13), మిష‌న్ ఇన్నోవేష‌న్ (ఎంఐ-7) ఉమ్మ‌డిగా నిర్వ‌హిస్తున్న స‌మావేశంలో పాల్గొనేందుకు డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ పిట్స్ బ‌ర్గ్ బ‌య‌లుదేరి వెళ్తారు. స్వ‌చ్ఛ ఇంధ‌న ఇన్నోవేష‌న్‌, టెక్నాల‌జీలు ప్ర‌వేశ‌పెట్ట‌డంలో వేగాన్ని పెంచ‌డం ల‌క్ష్యంగా జ‌రుగుతున్న ఈ స‌మావేశం ప్ర‌పంచంలోని స్వ‌చ్ఛ ఇంధ‌న టెక్నాల‌జీ రంగానికి చెందిన సిఇఓలు, ఇన్నోవేట‌ర్లు, యువ ప్రొఫెష‌న‌ల్స్, పౌర స‌మాజ ప్ర‌తినిధులు స‌హా వేలాది మంది ప్ర‌ముఖులు, 20 దేశాల‌కు చెందిన మంత్రుల‌ను ఒకే వేదిక మీదికి తెస్తుంది.



(Release ID: 1861416) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi , Tamil