ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఎన్ హెచ్ ఎమ్ కింద హైపర్ టెన్షన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చొరవ తీసుకున్నందుకు ఐక్యరాజ్యసమితి అవార్డులను గెలుచుకున్న భారత్
" ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (ఐ హెచ్ సి ఐ)" ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అసాధారణమైన కృషికి గుర్తింపు పొందింది.
అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన మిషన్ను ఐ హెచ్ సి ఐ బలోపేతం చేసింది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
గుండెపోటు, స్ట్రోక్ ,మూత్రపిండాల వైఫల్యాల వల్ల సంభవించే మరణాలను తగ్గించడంలో పీపుల్ సెంట్రిక్ కేర్ దోహదం
రక్తపోటుతో బాధపడుతున్న 34 లక్షల మందికి పైగా ప్రజలకు ఎబి- హెల్త్ వెల్ నెస్ సెంటర్లు (హెచ్ డబ్ల్యుసిలు) సహా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స
Posted On:
21 SEP 2022 6:20PM by PIB Hyderabad
అధిక రక్తపోటు నివారణ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు గణనీయమైన విజయం గుర్తింపుగా, జాతీయ ఆరోగ్య మిషన్ కింద పెద్ద ఎత్తున హైపర్ టెన్షన్ నివారణ జోక్యమైన "ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (ఐహెచ్ సిఐ)"కు భారతదేశం ఐక్యరాజ్యసమితి అవార్డును గెలుచుకుంది.
భారతదేశ ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అసాధారణమైన కృషి చేసినందుకు ఐహెచ్ సిఐ గుర్తింపు పొందింది.
ఆరోగ్య సంరక్షణ చొరవను అభినందిస్తూ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఒక ట్వీట్ లో "అందరికీ ఆరోగ్యం , శ్రేయస్సును అందించాలన్న నిర్ధారించడానికి ఐహెచ్సిఐ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని ఐహెచ్ సిఐ బలోపేతం చేసింది" అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, ఫిట్ ఇండియా నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పెద్ద ఎత్తున హైపర్ టెన్షన్ aనివారణ జోక్యాన్ని కలిగి ఉన్న "ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (ఐహెచ్ సిఐ)" కు గాను భారతదేశం యు ఎన్ అవార్డును గెలుచుకుంది.
అందరికీ ఆరోగ్యం , స్వస్థతను ధృవీకరించాలనే ప్రధాన మంత్రి @ నరేంద్ర మోదీ జీ లక్ష్యాన్ని ఐహెచ్ సిఐ బలోపేతం చేసింది.
— డాక్టర్ మన్సుఖ్ మాండవీయ (@mansukhmandviya) September 21, 2022
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), రాష్ట్ర ప్రభుత్వాలు ,ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఇండియా సహకార చొరవతో ఐహెచ్ సిఐ 2022 ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్, ,డబ్ల్యూహెచ్ వో స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ప్రైమరీ హెల్త్ కేర్ అవార్డ్ లను 2022 సెప్టెంబర్ 21న అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సైడ్ ఈవెంట్ లో గెలుచుకుంది. ఈ అవార్డు (i) నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సి డి లు) ను నిరోధించడం , నియంత్రించడం (ii) ఇంటిగ్రేటెడ్ పీపుల్ సెంట్రిక్ ప్రైమరీ కేర్ అందించడం లో భారతదేశ అసాధారణ నిబద్ధత , కార్యాచరణకు గుర్తింపు.
ఎన్ సిడిల నిరోధం నియంత్రణలో బహుళ రంగాల అప్రోచ్ , బహుళ రంగాల చర్య, ఎన్ సిడిల నివారణ, నియంత్రణ కోసం ప్రాథమిక సంరక్షణ, సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజిలు) పై ప్రదర్శించిన ఫలితాలతో బహుళ సెక్టోరల్ అప్రోచ్ ఉన్న సంస్థను ఐక్యరాజ్యసమితి టాస్క్ ఫోర్స్ గుర్తించింది.
భారతదేశంలో ప్రతి నలుగురు వయోజనులలో ఒకరికి అధిక రక్తపోటు ఉందనే వాస్తవం నుండి ఈ చొరవ ప్రాముఖ్యతను నిర్ణయించవచ్చు. ప్రాథమిక సంరక్షణ వ్యవస్థ స్థాయిలో హైపర్ టెన్షన్ నియంత్రణ గుండెపోటు, స్ట్రోక్ మూత్రపిండాల వైఫల్యాల వల్ల సంభవించే మరణాలను తగ్గించడానికి దోహదపడుతుంది.
ఐహెచ్ సిఐ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ సేవల వ్యవస్థ, హైపర్ టెన్షన్ కంట్రోల్ జోక్యాలను బలోపేతం చేయగలిగింది. ఇంకా ఆరోగ్య సంరక్షణతో జనాభా ఆధారిత స్క్రీనింగ్ చొరవ మధ్య సంబంధాలను మెరుగుపరచగలిగింది. ఈ చొరవను 2017 లో ప్రారంభించారు. 23 రాష్ట్రాల్లోని 130 కి పైగా జిల్లాలను కవర్ చేయడానికి దశలవారీగా విస్తరించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్ నెస్ సెంటర్లు (హెచ్ డబ్ల్యుసిలు) సహా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న 34 లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్య వ్యవస్థలో ప్రాజెక్ట్ వ్యూహాలు సులభంగా స్కేలబుల్ గా ఉంటాయి. సరళమైన ఔషధ-మోతాదు-నిర్దిష్ట ప్రామాణిక చికిత్సా ప్రోటోకాల్, తగిన పరిమాణంలో ప్రోటోకాల్ ఔషధాలను ధృవీకరించడం, అనుసరణీయతతో సంరక్షణ వికేంద్రీకరణ, హెల్త్ వెల్ నెస్ సెంటర్ల వద్ద ఔషధాల రీఫిల్స్ మొత్తం ఆరోగ్య సిబ్బందిని భాగస్వామ్యం
చేసే టాస్క్ షేరింగ్ , ఫాలో-అప్ ,ఇంకా రక్తపోటు నియంత్రణ కోసం ప్రతి రోగిని ట్రాక్ చేయగల శక్తివంతమైన రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి వ్యూహాలు ఉన్నాయి. ఐహెచ్ సిఐ కింద, చికిత్స పొందిన వారిలో దాదాపు సగం మందికి రక్తపోటు నియంత్రణలో ఉంది.
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన j
జాతీయ డయాబెటిస్ , కార్డియోవాస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ (ఎన్ పిసిడిసిఎస్ ) నిరోధం , నియంత్రణ కార్యక్రమం (ఎన్ పిసిడిసిఎస్ ) ను ఐహెచ్ సిఐ సమన్వయం
చేస్తుంది. ఐ.హెచ్.సి.ఐ. నిరంతర సంరక్షణ దిశగా "ఆయుష్మాన్ భారత్" కార్యక్రమానికి ఊతమివ్వడం ద్వారా భారత ప్రభుత్వ లక్ష్యాల సాధనను వేగవంతం చేస్తుంది.
*****
(Release ID: 1861384)
Visitor Counter : 156