నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో లెదర్ సెక్టార్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం స్కేల్ యాప్‌ను ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
హస్తకళాకారుల సామర్థ్యాన్ని పెంపొందించాలని, వారిని డిజిటల్ రంగంలో
అవకాశాలకు అనుసంధానించాలని పిలుపునిచ్చిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
20 SEP 2022 5:30PM by PIB Hyderabad
విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు చెన్నై సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- సిఎస్ఐఆర్ సందర్శన సందర్భంగా తోలు పరిశ్రమ నైపుణ్యం, అభ్యాసం, అంచనా ఉపాధి అవసరాలకు వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించే స్కేల్ (లెదర్ ఉద్యోగులకు నైపుణ్యం సర్టిఫికేషన్ అసెస్‌మెంట్) యాప్‌ను ప్రారంభించారు. - లెదర్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను రూపొందించి, లెదర్ ఇండస్ట్రీలో ట్రైనీలకు అందించే విధానాన్ని మార్చడానికి ఆండ్రాయిడ్ యాప్ స్కేల్‌ని అభివృద్ధి చేసింది. లెదర్ ఎస్‌ఎస్‌సి డెవలప్ చేసిన స్కేల్ స్టూడియో యాప్ లెదర్ క్రాఫ్ట్ పట్ల ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారిని దాని కార్యాలయంలోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టూడియో నుండి ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ క్లాస్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం 44 లక్షల మందికి పైగా పని చేస్తున్నలెదర్ రంగం దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. అకడమిక్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ఖచ్చితమైన సమ్మేళనంతో ఈ రంగం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు సిఎస్ఐఆర్ - సిఎల్ఆర్ఐ పాత్రను ఆయన ప్రశంసించారు.
శ్రీ ప్రధాన్ డిజిటల్ టెక్నాలజీలు, పర్యావరణ అనుకూల సాంకేతికతల ఆగమనం కారణంగా ఈ రంగంలో జరుగుతున్న మార్పుల గురించి ప్రస్తావించారు. ఇది స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ , డ్రైవ్ కెపాసిటీ బిల్డింగ్‌పై కొత్త ప్రేరణని కలిగిస్తుందని అన్నారు. ఎన్ఎస్డిఎస్, మరియు సిఎస్ఐఆర్ - సిఎల్ఆర్ఐ ఈ రంగానికి సంబంధించిన నైపుణ్య అవసరాలను తీర్చేందుకు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణుల సామర్థ్యాలను పెంపొందించేందుకు సిఎస్ఐఆర్ - సిఎల్ఆర్ఐ లో జాతీయ స్థాయి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎస్‌డిసి, సిఎల్‌ఆర్‌ఐ, లెదర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌లు చెన్నైతో సహా భారతదేశం అంతటా కామన్ ఫెసిలిటీ, స్కిల్లింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సహకరిస్తాయని ఆయన చెప్పారు.
సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత ద్వారా ఉద్యోగ సృష్టికర్తలు గా మారాలని ఈ రంగంలోని యువ నిపుణులకు శ్రీ ప్రధాన్ పిలుపునిచ్చారు. ఇ-కామర్స్‌తో సహా డిజిటల్ స్పేస్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్న హస్తకళాకారులను తప్పనిసరిగా కొత్త పరిజ్ఞానంతో జోడించాలని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ మురుగన్ మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రతిభావంతులైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వారిని నైపుణ్యం చేయడంలో సీఎల్‌ఆర్‌ఐ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. సిఎల్ఆర్ఇన్ యువతలో వ్యవస్థాపకతను కూడా ప్రోత్సహిస్తోందని, అనేక స్టార్టప్ కంపెనీల స్థాపనలో సహాయం చేస్తోందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి, 100 ఏళ్లు పూర్తవుతున్న అమృత్‌కాల్ సందర్భంగా మన జాతీయ లక్ష్యాలను సాధించడంలో ఇది సాధ్యపడుతుందని ఆయన అన్నారు.
****
(Release ID: 1861107)
Visitor Counter : 169