సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఎఐబిడి 47వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
ప్రసార భారతి సీఈఓ శ్రీ మయాంక్ అగర్వాల్
కు 2022 సంవత్సరానికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసిన శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
20 SEP 2022 9:50AM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు ఆసియా-పసిఫిక్ ఇన్ స్టిట్యూట్ ఫర్ బ్రాడ్ కాస్టింగ్ డెవలప్ మెంట్ (ఎఐబిడి) 47వ వార్షిక, 20వ సమావేశాన్ని ప్రారంభించారు.
కేంద్ర సమాచార , ప్రసార శాఖ (ఐ అండ్ బి) సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ఐ అండ్ బి కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ,ఎఐబిడి డైరెక్టర్ శ్రీమతి ఫిలోమినా జ్ఞానప్రకాశం హాజరయ్యారు.
ఈ సంద ర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్
ప్రసంగిస్తూ, ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు కొత్త యుగపు డిజిటల్
వేదికల నుండి కాదని, ప్రధాన స్రవంతి మీడియా చానల్లే అని అన్నారు. నిజమైన జర్నలిజం అంటే వాస్తవాలను ఎదుర్కోవడం, నిజాలను అందించడం, సత్యాన్ని ప్రదర్శించడం మరియు అన్ని వైపుల నుంచి అందరి వారి అభిప్రాయాలను సమర్పించడానికి వేదికను అనుమతించడం అని ఆయన అన్నారు.
తప్పుడు కథనాలను వ్యాప్తి చేసే అతిథులను ఆహ్వానించడం , అది నిజం అన్నట్టుగా కేకలు వేయడం ఛానెల్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
అతిథికి సంబంధించి మీ నిర్ణయాలు, స్వరం, విజువల్స్ - ప్రేక్షకుల దృష్టిలో మీ విశ్వసనీయతను నిర్వచిస్తాయి. మీ
కార్యక్రమం చూడడం ఒక నిమిషం పాటు ఆగిపోవచ్చు, మీ యాంకర్, మీ ఛానెల్ లేదా బ్రాండ్ ను విశ్వసనీయమైన,పారదర్శకమైన వార్తల వనరుగా ఎన్నడూ విశ్వసించరు " అని ఆయన అన్నారు.
సౌండ్ బైట్స్ ద్వారా నిర్వచించే కథనాన్ని చూడవద్దని, కానీ దానిని మీరే పునర్నిర్వచించుకోవాలని, అతిథులకు , ఛానల్ కు షరతులను నిర్దేశించాలని మంత్రి ఈ సందర్భంగా హాజరైన బ్రాడ్ కాస్టర్లను ఉద్బోధించారు.
ప్రేక్షకులకు ఉత్తేజకరమైన ప్రశ్నలను సంధిస్తూ, “యువ ప్రేక్షకులు టీవీ వార్తలలో స్విచ్ చేయడం , స్వీప్ చేయడం మీరు చూడబోతున్నారా లేదా గేమ్‌లో ముందుండడానికి మీరు న్యూస్‌లో న్యూట్రాలిటీని ,డిబేట్స్‌లో చర్చను తిరిగి తీసుకురాబోతున్నారా? ” అని మంత్రి అడిగారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో సభ్య దేశాలను ఆన్ లైన్ లో అనుసంధానించినందుకు , మహమ్మారి ప్రభావాన్ని మీడియా ఎలా తగ్గించగలదనే దానిపై నిరంతర సంభాషణను కొనసాగించినందుకు ఎఐబిడి నాయకత్వాన్ని శ్రీ అనురాగ్ ఠాకూర్, ప్రశంసించారు. "వైద్య రంగంలో తాజా పరిణామాలు, కోవిడ్ వారియర్స్ సానుకూల కథనాలు ,ముఖ్యంగా మహమ్మారి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు సమాచారాన్ని పంచుకోవడం ద్వారా చాలా ప్రయోజనం పొందాయి‘‘ అని పేర్కొన్నారు.
ఎఐబిడి డైరెక్టర్ శ్రీమతి ఫిలోమినా, ఎఐబిడి జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ శ్రీ మయాంక్ అగర్వాల్ , ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కోవిడ్ మహమ్మారికి బలమైన మీడియా ప్రతిస్పందనను రూపొందించడంలో కలిసి పనిచేసిన సభ్య దేశాలను శ్రీ ఠాకూర్ అభినందించారు.
'మహమ్మారి అనంతరకాలంలో ప్రసారానికి బలమైన భవిష్యత్తును నిర్మించడం' అనే అంశంపై మంత్రి మాట్లాడుతూ, "ప్రసార మాధ్యమాలు జర్నలిజం ప్రధాన స్రవంతిలో ఉన్నప్పటికీ, కోవిడ్-19 శకం దాని నిర్మాణాన్ని మరింత వ్యూహాత్మకంగా మార్చింది. రూపొందించింది. సరైన , సకాలంలో సమాచారం లక్షలాది మంది ప్రాణాలను ఎలా కాపాడుతుందో కోవిడ్ మహమ్మారి మనకు నేర్పింది. ఈ క్లిష్ట దశలో ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన మీడియా ఒక ప్రపంచ కుటుంబం స్ఫూర్తిని బలోపేతం చేసింది" అన్నారు. మహమ్మారి సమయంలో భారతీయ మీడియా పాత్రను విజయగాథగా చూపిస్తూ, కోవిడ్ -19 అవగాహన సందేశాలు, ముఖ్యమైన ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యులతో ఉచిత ఆన్ లైన్ సంప్రదింపులు దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేరేలా మీడియా చూసుకుందని ఆయన అన్నారు.
మంచి నాణ్యత గల కంటెంట్ మార్పిడి రంగంలో సహకారాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ ఠాకూర్ సభ్య దేశాలను కోరారు. అటువంటి సహకారం ద్వారా కార్యక్రమ మార్పిడి ప్రపంచ సంస్కృతులను ఏకతాటిపైకి తెస్తుంది. దేశాల మధ్య ఇలాంటి మీడియా భాగస్వామ్యాలు
ప్రజల మధ్య బలమైన బంధాలను పెంపొందించుకోవడానికి దోహద
పడుతున్నాయని ఆయన అన్నారు.
మీడియా, దాని అన్ని రూపాలలో, సాధికారతకు సమర్థవంతమైన సాధనంగా ప్రజా అవగాహనలను , దృక్పథాలను రూపొందించే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి నొక్కిచెప్పారు. "మీడియా పరిధిని మరింత శక్తివంతంగా ప్రతిఫలదాయకంగా మార్చడానికి పాత్రికేయులు , బ్రాడ్ కాస్ట్ మిత్రులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం" అని ఆయన అన్నారు..
ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎఐబిడి ప్రెసిడెంట్ శ్రీ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘లాక్ డౌన్ ల సమయంలో కూడా ఎఐబిడి తన శిక్షణ ,సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను కొనసాగించిందని, .గత ఏడాదిలోనే 34 శిక్షణా కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. సంప్రదాయాలు, సా
అదేవిధంగా వాతావరణ మార్పు, హరిత సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి, వేగవంతమైన రిపోర్టింగ్, పిల్లల kకోసం ప్రోగ్రామింగ్ మొదలైన అభివృద్ధి చెందుతున్న సమస్యలపై దృష్టి సారించామని చెప్పారు.
బ్రాడ్ కాస్టింగ్ లో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్ సెక్యూరిటీ జర్నలిజంలో పాత్రికేయులకు శిక్షణ ఇవ్వడం అనివార్యంగా మారిందని ఆయన అన్నారు. ఎఐబిడి తన శిక్షణా కార్యక్రమాలలో భాగంగా దీనిని చేపట్టడానికి మొదటి ఏర్పాటు అని ఆయన అన్నారు.
శ్రీమతి ఫిలోమినా జ్ఞానప్రకాశం మాట్లాడుతూ, కంటెంట్ మీడియా భవిష్యత్తును నిర్ణయించబోతోందని ,కంటెంట్ ఎలా భాగస్వామ్యం చేయబడుతుంది, మానిటైజ్ చేయబడుతుంది అనేది ప్రసారం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వివిధ సంస్థల ప్రతినిధులు మరియు ప్రతినిధులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కంటెంట్ మీడియా భవిష్యత్తును నిర్దేశిస్తుందని, కంటెంట్ ఎలా భాగస్వామ్యం చేయబడి డబ్బు ఆర్జించబడుతుందనేది ప్రసార భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. హాజరైన డెలిగేట్లకు, వివిధ సంస్థల ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ 2021,2022 సంవత్సరాలకు గాను అవార్డుల ప్రదానానికి అధ్యక్షత వహించారు. 2021 సంవత్సరానికి గాను ప్రశంసా పురస్కారాన్ని రేడియో టెలివిజన్ బ్రూనైకి ప్రదానం చేశారు. 2022 సంవత్సరానికి గాను ప్రశంసా పురస్కారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ, సివిల్ సర్వీస్, కమ్యూనికేషన్స్, హౌసింగ్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, రిపబ్లిక్ ఆఫ్ ఫిజి, ఫిజి బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పంచుకున్నాయి.
2021 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని కంబోడియాలోని సమాచార, కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ ఖియు ఖాన్హరిత్ కు ప్రదానం చేశారు. 2022 సంవత్సరానికి గాను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును శ్రీ మయాంక్ అగర్వాల్, సి ఇ ఓ, ప్రసార భారతి, ప్రెసిడెంట్ ఏ ఐ బి డీ కు ప్రదానం చేశారు.
భారతదేశం లోని వివిధ విదేశీ మిషన్ ల అధినేత లు, ఏఐబీడీ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రసార భారతి, భారత ప్రభుత్వ సమాచార , ప్రసార బ్మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏఐబీడీ గురించి
1977లో యునెస్కో ఆధ్వర్యంలో ఆసియా-పసిఫిక్ ఇన్ స్టిట్యూట్ ఫర్ బ్రాడ్ కాస్టింగ్ డెవలప్ మెంట్ (ఏఐబీడీ) ఏర్పాటయింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధి రంగంలో ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా ,పసిఫిక్ (యుఎన్-ఎస్కేప్) దేశాలకు సేవలందించే ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ అంతర్-ప్రభుత్వ సంస్థ. దీనికి మలేషియా ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుంది . దీని సెక్రటేరియట్ కౌలాలంపూర్ లో ఉంది.
ఏఐబీడీ ప్రస్తుతం 26 పూర్తి సభ్యులను (దేశాలు) కలిగి ఉంది, 43 సంస్థలు, 50 అఫిలియేట్ సభ్యులు (సంస్థలు) మొత్తం 93 సభ్యత్వంతో 46 దేశాలు ,ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.ఆసియా, పసిఫిక్, ఐరోపా, ఆఫ్రికా, అరబ్ స్టేట్స్, ఉత్తర అమెరికాలలో 50 మందికి పైగా భాగస్వాములకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఏ ఐ బి డి జనరల్ కాన్ఫరెన్స్ (జి సి) ,దాని అసోసియేటెడ్ మీటింగ్ లను ఇన్ స్టిట్యూట్ వార్షిక అధికారిక సమావేశంగా పరిగణిస్తారు. జనరల్ కాన్ఫరెన్స్ సభ్య దేశాలు, అనుబంధ సంస్థలు, భాగస్వాములు, పరిశీలకులు ప్రముఖ బ్రాడ్కాస్టర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. సభ్య దేశాలు, అఫిలియేట్ లు ,భాగస్వాములు గత సంవత్సరం నుంచి ఏ ఐ బి డి అమలు చేసిన కార్యకలాపాలు, ప్రాజెక్టుల సంఖ్యను సమీక్షించడానికి ,భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సభ్య దేశాల అభివృద్ధి అవసరాల గురించి కూడా చర్చిస్తారు.
సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ ఎఐబిడి పూర్తి సభ్యత్వాన్ని కలిగి ఉంది. ప్రసార భారతి, భారతదేశ ప్రజా సేవా బ్రాడ్ కాస్టర్ కావడం వలన ఎ.ఐ.బి.డి వివిధ సేవలను ఉపయోగించుకుంటుంది.
భారతదేశం 1978, 1985, 2003 లో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల (జిసి) కు ఆతిథ్యం ఇచ్చింది. 47 వ వార్షిక సమావేశం / 20 వ ఎఐబిడి జనరల్ కాన్ఫరెన్స్ ,అసోసియేటెడ్ మీటింగ్స్ 2022 కు 19-21 సెప్టెంబర్, 2022 వరకు న్యూఢిల్లీలో నిర్వహించడం ద్వారా భారతదేశం మరోసారి ఆతిథ్యం ఇస్తోంది.
****
(Release ID: 1860988)
Visitor Counter : 181