ప్రధాన మంత్రి కార్యాలయం
సిఖ్కు ప్రతినిధి వర్గం తోఈ రోజు న తన నివాసం లో సమావేశమైన ప్రధాన మంత్రి
గురుద్వారా శ్రీ బాలాసాహిబ్ జీ యొక్క ప్రసాదాన్ని మరియు ఆశీర్వాదాల ను అందజేసిన ప్రతినిధి వర్గం;
ప్రధానమంత్రి పుట్టిన రోజు న గురుద్వారా శ్రీ బాలా సాహిబ్ జీ ‘అఖండ్ పాఠ్’ ను నిర్వహించింది
ప్రధానమంత్రి కి పగ్ డీ ని అలంకరించి, శిరోపా ను అందించి సత్కరించిన ప్రతినిధి వర్గం
సిఖ్కు సముదాయం యొక్క గౌరవంమరియు సంక్షేమం కోసం పథ నిర్దేశక కార్యక్రమాల ను చేపట్టినందుకు గాను ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రతినిధి వర్గం
Posted On:
19 SEP 2022 3:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తన నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో ఓ సిఖ్కు ప్రతినిధి వర్గం తో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి జన్మదినం సందర్భం లో దిల్లీ లోని గురుద్వారా శ్రీ బాలా సాహిబ్ జీ ఒక ‘అఖండ్ పాఠ్’ ను నిర్వహించింది. సెప్టెంబర్ 15వ తేదీ నాడు మొదలైన ‘అఖండ్ పాఠ్’ ప్రధాన మంత్రి పుట్టిన రోజైనటువంటి సెప్టెంబర్ 17వ తేదీ న పూర్తి అయింది. సిఖ్కు ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి ని కలుసుకొని, గురుద్వారా నుండి ప్రసాదాన్ని ఇవ్వడం తో పాటు ఆశీర్వాదాల ను కూడా అందజేసింది.
సమావేశం సాగిన క్రమం లో, సిఖ్కు ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి కి ఒక పగ్ డీ ని అలంకరించడంతో పాటుగా ఒక శిరోపా ను కూడా ప్రదానం చేసి మరీ సత్కరించింది. ప్రధాన మంత్రి కి దీర్ఘ జీవనం కోసం మరియు చక్కని స్వస్థత కోసం ఒక అర్ దాస్ (ప్రార్థన) ను కూడా జరపడమైంది. సిఖ్కు సముదాయం యొక్క గౌరవం కోసం, సంక్షేమం కోసం పథ నిర్దేశక కార్యక్రమాల ను చేపట్టినందుకు గాను ప్రధాన మంత్రి కి ప్రతినిధి వర్గం ధన్యవాదాల ను కూడా తెలిపింది. డిసెంబర్ 26వ తేదీ ని ‘‘వీర్ బాల్ దివస్’’ గా ప్రకటించడం, కర్ తార్ పుర్ సాహిబ్ కారిడోర్ ను పున:ప్రారంభించడం, గురుద్వారా లు నడిపే లంగర్ లకు జిఎస్ టి ని తొలగించడం, గురు గ్రంథ్ సాహిబ్ యొక్క ప్రతులు భారతదేశం నుండి అఫ్ గానిస్తాన్ కు చేరేటట్టు చూడడం వంటి ప్రధాన మంత్రి చేపట్టిన అనేక ప్రయాసల ను గురించి వారు ఈ సందర్భం లో ప్రస్తావించారు.
సిఖ్కు ప్రతినిధి వర్గం లో అఖిల భారత కేంద్రీయ గురు సింహ్ సభ యొక్క అధ్యక్షుడు శ్రీ తార్ వీందర్ సింహ్ మార్వా, అఖిల భారత కేంద్రీయ గురు సింహ్ సభ యొక్క వర్కింగ్ ప్రెసిడెంటు శ్రీ వీర్ సింహ్, కేంద్రీయ గురు సింహ్ సభ యొక్క దిల్లీ అధిపతి శ్రీ నవీన్ సింహ్ భండారి, గురుద్వారా సింహ్ సభ యొక్క ప్రెసిడెంటు శ్రీ హర్ బన్స్ సింహ్ మరియు గురుద్వారా సింహ్ సభ యొక్క హెడ్ గ్రంథి శ్రీ రాజీందర్ సింహ్ లు ఉన్నారు.
***
(Release ID: 1860623)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam