రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఆర్‌టిఒను సంద‌ర్శించాల్సిన అవ‌స‌రాన్ని తొల‌గిస్తూ 58 పౌర కేంద్రీకృత సేవ‌ల‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందించేందుకు నోటిఫికేష‌న్ జారీ - స్వ‌చ్ఛందంగా ఆధార్ ప్ర‌మాణీక‌ర‌ణ‌తో సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు

Posted On: 17 SEP 2022 9:23AM by PIB Hyderabad

మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాల‌కు సంబంధించిన సేవ‌ల‌ను పొందేందుకు రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్‌) అనేక పౌర  కేంద్రీకృత సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌డుతోంది.  
డ్రైవింగ్ లైసెన్స్‌, కండ‌క్ట‌ర్ లైసెన్స్‌, వాహ‌న రిజిస్ట్రేష‌న్‌, ప‌ర్మిట్, యాజ‌మాన్య బ‌ద‌లాయింపు త‌దిత‌రాల‌తో స‌హా మొత్తం 58 పౌర కంద్రీకృత సేవ‌ల‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో పొందే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తూ ఎంఒఆర్‌టిహెచ్ 16 సెప్టెంబ‌ర్ 2022న ఎస్‌.ఒ. 4353(ఇ)ని జారీ చేసింది. దీనితో ఆర్‌టిఒ కార్యాల‌యానికి వెళ్ళ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు.  ఈ సేవ‌ల‌ను స్వ‌చ్ఛందంగా ఆధార్ ధృవీక‌ర‌ణ ద్వారా పొంద‌వ‌చ్చు. 
అటువంటి సేవ‌ల‌ను ఏ ర‌క‌మైన ప్ర‌త్య‌క్ష చ‌ర్య‌, వ్య‌క్తిగ‌త హాజ‌రు లేకుండా అందించ‌డం అన్న‌ది పౌరుల కీల‌క స‌మ‌యాన్ని ఆదా చేయ‌డ‌మ కాక అనువ‌ర్త‌న బారాన్ని కూడా స‌ర‌ళీక‌రించేందుకు తోడ్ప‌డుతుంది. ఫ‌లితంగా, ఆర్‌టిఒ కార్యాల‌యంలో ర‌ద్దీని చెప్పుకోద‌గిన రీతిలో త‌గ్గించ‌డంతో, వారి ప‌నితీరులో మ‌రింత సామ‌ర్ధ్యం పెరిగందుకు దారి తీస్తుంది. 

గెజెట్ నోటిఫిక‌ష‌న్ కోసం దిగువ లింక్‌పై క్లిక్ చేయండి

Click here to see Gazette Notification

***



(Release ID: 1860251) Visitor Counter : 111