శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ తో తన వినూత్న వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణ ఆలోచనలు పంచుకున్న గుజరాత్ గవర్నర్


దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన సాంకేతిక ఆధారిత వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహించే అంశంపై గవర్నర్ తో చర్చించిన డాక్టర్ జితేంద్ర సింగ్

సాంకేతిక ఆధారిత వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ కార్యక్రమాలను సులువుగా చేపట్టి లాభాలు ఆర్జించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సహజ వ్యవసాయ విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆచార్య దేవవ్రత్

జమ్మూ కాశ్మీర్ లో విజయవంతం అయిన ఊదా విప్లవాన్ని ఒకే విధమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల కొండ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని గవర్నర్ కు వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 12 SEP 2022 4:49PM by PIB Hyderabad

పరిశోధన చేసి తాను స్వయంగా అభివృద్ధి చేసి రూపొందించిన ఆధునిక వ్యవసాయ ఆవిష్కరణలను కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూ శాస్త్ర, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్లు, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కు గుజరాత్ గవర్నర్ ఆచార్య  దేవవ్రత్  వివరించారు.  స్వతహాగా పరిశోధకుడు అయిన  ఆచార్య  దేవవ్రత్ ను రాజ్ భవన్ లో  డాక్టర్ జితేంద్ర సింగ్ కలిసి వ్యవసాయ అంశాలపై చర్చలు జరిపారు. 

వ్యవసాయ రంగానికి   ఆచార్య  దేవవ్రత్ అందించిన సేవలను డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు.  ఆచార్య  దేవవ్రత్  సాంకేతిక ఆధారిత అంకుర సంస్థగా పనిచేశారని అన్నారు. సేంద్రీయ వ్యవసాయ కార్యక్రమాలకు బిన్నంగా సాగే సహజ వ్యవసాయ విధానాలకు  ఆచార్య  దేవవ్రత్ రూపకల్పన చేశారని అన్నారు. సేంద్రియ వ్యవసాయం తో పోల్చి చూస్తే సహజ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సహజ వ్యవసాయ విధానాలను  ఆచార్య  దేవవ్రత్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు.    సహజ వ్యవసాయంలో   ఇన్స్టిట్యూట్‌లో గుజరాత్ విశ్వవిద్యాలయంచే పిహెచ్‌డి ప్రోగ్రామ్‌ను  గత వారం ఆచార్య  దేవవ్రత్   ప్రారంభించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్  తెలిపారు. సుస్థిర గ్రామీణ వ్యవస్థ,,పర్యావరణ యాజమాన్యం,, వ్యవసాయ రంగం లో వినూత్న వ్యవస్థాపకత, వ్యవసాయ సంబంధిత వ్యాపార అవకాశాలు,వాల్యూ చైన్ మేనేజ్‌మెంట్ వంటి వివిధ అంశాలు   పిహెచ్‌డి లో భాగంగా ఉంటాయని   ఆయన చెప్పారు.

  వ్యవసాయ కార్యక్రమాలను సులువుగా చేపట్టి లాభాలు ఆర్జించేందుకు అవకాశం కల్పించే సాంకేతిక ఆధారిత వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహించాలన్న డాక్టర్ జితేంద్ర సింగ్ సూచనతో  ఆచార్య  దేవవ్రత్ ఏకీభవించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్,కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ. వ్యవసాయ పరిశోధనలు సాగిస్తున్న సంస్థల సహకారం, అనుభవంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయవచ్చునని ఆచార్య  దేవవ్రత్ అన్నారు. 

కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశంలో సాంకేతిక ఆధారిత వ్యవసాయ అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ గుజరాత్ గవర్నర్ కు విచారించారు. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, కాలం చెల్లిన పరికరాల వినియోగం,మౌలిక సదుపాయాల కొరత, రైతులకు మార్కెట్ అవకాశాలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యల పరిష్కారానికి సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యవసాయ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన  దేశవ్యాప్తంగా 100 మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయ డ్రోన్‌లను ప్రధానమంత్రి ప్రారంభించారని పేర్కొన్నారు. బహుళజాతి సంస్థలు, ఐటీ సంస్థల ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న అనేక మంది నిపుణులు అంకుర సంస్థలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

తన జమ్మూ  ప్రయోగశాల ద్వారా   అధిక-విలువైన ముఖ్యమైన నూనెను కలిగి ఉండే లావెండర్ పంటను ప్రవేశపెట్టిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్  ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)   భారతదేశంలో 'ఊదా విప్లవానికి నాంది పలికిందని   డాక్టర్ జితేంద్ర సింగ్ ఆచార్య దేవవ్రత్‌కు తెలియజేశారు.దోడా, కిష్త్వార్, రాజౌరి, రాంబన్, పుల్వామా మొదలైన జిల్లాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని మంత్రి  తెలిపారు.  అతి తక్కువ కాలంలో  సువాసన/లావెండర్ సాగు వైపు  వ్యవసాయ స్టార్ట్-అప్‌లు మొగ్గు చూపుతున్నాయని అన్నారు.  ఒకేవిధమైన వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కొండ ప్రాంతాలలో . పైలట్ ప్రాజెక్ట్‌గా  అమలు జరుగుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

 వ్యవసాయ విలువ గొలుసు  ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు అగ్రిటెక్ స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలు, పరిష్కారాలను అందిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనివల్ల  ఇది భారతీయ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు వస్తాయని   రైతుల ఆదాయం  పెరుగుతుందని అన్నారు. 

 వ్యవసాయ రంగంలో ఆధునిక మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని  డాక్టర్ జితేంద్ర సింగ్  స్పష్టం చేశారు.   ఇజ్రాయెల్, చైనా మరియు అమెరికా  వంటి దేశాలు సాంకేతిక వినియోగంతో తమ దేశంలో అనేక వ్యవసాయ పద్ధతులను మార్చాయని అన్నారు. . స్టార్టప్‌లు ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్లు, సౌర శక్తితో పనిచేసే  కోల్డ్ స్టోరేజ్, ఫెన్సింగ్ మరియు వాటర్ పంపింగ్, వాతావరణ అంచనా, స్ప్రేయింగ్ మిషన్, సీడ్ డ్రిల్స్  వంటి పరిష్కారాలను అందిస్తున్నాయని అన్నారు. వీటివల్ల రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని  అన్నారు.

***



(Release ID: 1858835) Visitor Counter : 132