సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయక పరికరాల, ఇతర పరికరాల పంపిణీ కోసం 13 సెప్టెంబర్ 2022న సామాజిక అధికారిత శిబిరం
Posted On:
12 SEP 2022 5:46PM by PIB Hyderabad
సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ కింద పథకాలైన ఎడిఐపి పథకం కింద దివ్యాంగులకు, ఆర్‌వివై పథకం కింద వయోవృద్ధులకు సహాయక పరికరాలు, ఇతర పరికరాలను అందించేందుకు ఎఎల్ఐఎంసిఒ, ప్రకాశం జిల్లా యంత్రాంగంతో కలిసి వికాలంగ వ్యక్తుల సాధికారత శాఖ (డిఇపిడబ్ల్యుడి) 13.09.2022న మధ్యాహ్నం 12.00 గంటలకు ఒంగోలు (ఎ.పి.) కలెక్టరట్ సముదాయంలోని శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందన భవన్‌లో సామాజిక అధికారత శిబిర్‌ను నిర్వహిస్తున్నారు.
ఎఎల్ఐఎంసిఒ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన అంచనా శిబిరాలలో ముందస్తుగా గుర్తించి, మూల్యాంకనం చేసిన 182మంది సినియర్ పౌరులు, 1401 ఎడిఐపి దివ్యాంగులకు రూ. 1 కోటి 17 లక్షల 67 వేల రూపాయిల విలువైన మొత్తం 2563 సహాయక పరికరాలను, ఇతర పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ ఎ. నారాయణ స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో పంపిణీ శిబిరాన్ని ప్రారంభించనున్నారు.
జిల్లా పాలనా యంత్రాంగం, ఎఎల్ఐఎంసిఒ ప్రకాష్‌మంద్ కు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
***
(Release ID: 1858829)
Visitor Counter : 146