నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్కిల్ ఆఫ్ ప్రోటోటైప్ మోడలింగ్ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్-2022 లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న - శ్రీ లిఖిత్ వై.పి.

Posted On: 12 SEP 2022 12:20PM by PIB Hyderabad

ప్రపంచ నైపుణ్యాల పోటీ 2022 (డబ్ల్యూ.ఎస్.సి-2022)లో ప్రోటోటైప్ మోడలింగ్ నైపుణ్యంలో శ్రీ లిఖిత్ వై.పి. కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.  టయోటా సాంకేతిక శిక్షణా సంస్థ నుండి లిఖిత్ మెకాట్రానిక్స్‌లో డిప్లొమా పూర్తి చేసి, 2022 జనవరి నుండి ఈ పోటీ కోసం శిక్షణ పొందుతున్నారు.  ప్రోటోటైప్ మోడలింగ్ స్కిల్‌ లో భారత జాతీయ నైపుణ్య పోటీ "ఇండియా స్కిల్స్-2021"ని కూడా ఆయన గెలుచుకున్నారు.   వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ ప్లాట్‌ ఫారమ్‌ లో ప్రోటోటైప్ మోడలింగ్ స్కిల్‌ లో చీఫ్ ఎక్స్‌పర్ట్ అయిన టయోటా ఇండియా ఎక్స్‌పర్ట్ మిస్టర్ భాస్కర్ సింగ్ వద్ద ఆయన శిక్షణ పొందారు.

వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ అనేది, వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్  కు చెందిన సభ్య దేశాల మధ్య నైపుణ్యం కలిగిన యువతకు నిర్వహించే ఒక అంతర్జాతీయ పోటీ.  ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ ప్రపంచ నైపుణ్యాల పోటీ షాంఘైలో జరగాల్సి ఉంది.   అయితే, అక్కడ కోవిడ్ వ్యాప్తి కారణంగా, ఈ పోటీలను 15 దేశాల్లో, 2 నెలల కాల వ్యవధిలో నిర్వహించే విధంగా మార్చడం జరిగింది.   ప్రోటోటైప్ మోడలింగ్ నైపుణ్య పోటీ మొదటి దశ లో డబ్ల్యూ.ఎస్.సి.-2022 ప్రారంభమయ్యింది.  డబ్ల్యూ.ఎస్.సి.- మొదటి దశ  2022 సెప్టెంబర్, 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని బెర్న్‌ లో జరిగింది.  

స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.డి.ఈ) ఆధ్వర్యంలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) కు చెందిన వరల్డ్ స్కిల్స్ ఇండియా అనే సంస్థ, భారతదేశంలో నైపుణ్య పోటీల నిర్వహణ అమలుతో పాటు,  అంతర్జాతీయ నైపుణ్య పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే యువతకు అవసరమైన శిక్షణ నిస్తుంది. 

 

*****



(Release ID: 1858705) Visitor Counter : 128