వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2047 నాటికి భారతదేశం ప్రపంచ వృద్ధికి మార్గం చూపే శక్తి కేంద్రంగా మారుతుంది: శ్రీ పీయూష్ గోయల్


ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) ముగింపు- సారూప్య దేశాలతో స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యానికి ముఖ్యమైన మైలురాయి: శ్రీ గోయల్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మనకు బలమైన, నిర్ణయాత్మకమైన,
ప్రజా కేంద్రీకృత ప్రభుత్వం ఉంది: శ్రీ గోయల్

వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న భారతదేశపు యువ జనాభా, నైపుణ్యాల సమీకరణతో వృద్ధి చెందడానికి భారీ అవకాశాలను అందిస్తాయి: శ్రీ గోయల్

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే సంకల్పాన్ని నెరవేర్చేందుకు సమిష్టి కృషి చేయాలని
భాగస్వాములందరికీ పిలుపునిచ్చిన శ్రీ గోయల్

Posted On: 11 SEP 2022 11:51AM by PIB Hyderabad

మరో 25 ఏళ్ల కు అంటే 2047 నాటికి ప్రపంచ వృద్ధిని నడిపించే శక్తిగా భారతదేశం అవతరించే మార్గంలో ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని వ్యాపార సంఘంతో  శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ  ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) స్వేచ్ఛా, సరసమైన వాణిజ్యానికి ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు, వారు పాలన ఆధారిత అంతర్జాతీయ క్రమం, పారదర్శక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటారని, ఇండో-పసిఫిక్‌లో రాజకీయంగా స్థిరమైన, బహిరంగ ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి కలిసి వస్తున్నాయని ఆయన అన్నారు.
భారతదేశంలో జరుగుతున్న పరివర్తన కృషి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో దేశాన్ని 5వ స్థానానికి తీసుకువెళ్లిందని శ్రీ గోయల్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలలో జరిగిన మూల స్థాయిలో మార్పులు, నిర్మాణాత్మక పరివర్తన ప్రభావాన్ని విశ్లేషిస్తూ, శ్రీ గోయల్ 2047లో భారతదేశం 35-45 ట్రిలియన్ల అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశాల లీగ్‌లోకి వెళుతుందని సీఐఐ అంచనా వేసిందని అన్నారు. 

 

భారతదేశం నేడు అవకాశాల భూమి అని  యుఎస్‌లోని వ్యాపార వర్గాలకు సంభావ్య మార్కెట్ అని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం కూడా క్లీన్ ఎనర్జీకి వేగంగా పరివర్తన చెందుతోందని, 2030 నాటికి 500 జిడబ్ల్యూ గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని కోరుకుంటున్నామని శ్రీ గోయల్ పేర్కొన్నారు.

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశానికి రాజకీయ సుస్థిరతను తీసుకొచ్చారని, ఆయన నాయకత్వంలో సుసంపన్నమైన భారతదేశ ప్రయోజనాల కోసం నిర్ణయాత్మకమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న, ప్రజా సంక్షేమాన్ని, సామాజిక సంక్షేమాన్ని సమతూకం చేసే ప్రభుత్వం మనకు ఉందని మంత్రి అన్నారు. అణగారిన వర్గాలు, గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల ప్రాథమిక అవసరాలైన ఆహార భద్రత- ఆవాసం, మరుగుదొడ్ల సదుపాయాన్ని తీర్చగలిగిందని అన్నారు.

“అన్ని ప్రజాస్వామ్యాలకు తల్లి లాంటి వాళ్ళంగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. శక్తివంతమైన న్యాయవ్యవస్థ, న్యాయ పాలన, బలమైన మీడియా, పారదర్శక ప్రభుత్వ వ్యవస్థలను కలిగి ఉన్నందుకు మేము గర్విస్తున్నాము” అని శ్రీ గోయల్ అన్నారు.

భారతదేశం నేడు ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా అవతరించిందని పేర్కొన్న శ్రీ గోయల్, ఐటీ, టెక్స్‌టైల్స్, హాస్పిటాలిటీ, రత్నాలు, ఆభరణాలు,  వంటి రంగాల్లో ఉన్న నైపుణ్యాలు, టాలెంట్ పూల్‌ను బట్టి భారతదేశం ఇప్పుడు విలువైన వస్తువులు, సేవల నాణ్యమైన తయారీదారుగా ఉద్భవించిందని అన్నారు. వీటిలో ప్రతి ఒక్కటి భారతదేశంతో నిమగ్నమవ్వాలని చూస్తున్న పెట్టుబడిదారులకు అవకాశం కల్పిస్తుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందున, రాబోయే 25 సంవత్సరాలలో మనం భారతదేశాన్ని ఎక్కడ చూస్తున్నామో ఆలోచించడం చాలా ముఖ్యమని చెప్పారు. 


ప్రధానమంత్రి మోదీ ఇటీవల ప్రతి దేశస్థునికి కర్తవ్య భావాన్ని తీసుకురావడాన్ని గుర్తుచేస్తూ, భారతీయులు, ప్రవాస భారతీయులు, సమిష్టిగా పని చేయడం, సామూహిక కృషిని నెరవేర్చడానికి తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. 2047 నాటికి సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది మా సంకల్పం అని శ్రీ గోయల్ వెల్లడించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తే, కోట్లాది మంది భారతీయ కళాకారులకు మంచి రేపటి కోసం మద్దతు లభిస్తుందని, ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరూ ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడిఓపి) స్ఫూర్తితో ఉత్పత్తులను ఉపయోగించాలని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

****



(Release ID: 1858649) Visitor Counter : 132