కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని చైనా షెల్ కంపెనీలపై ఎంసీఏ ఉక్కుపాదం


సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ స్కామ్ సూత్రధారి & చీఫ్ ప్లాటర్‌ను అరెస్టు చేసింది

Posted On: 11 SEP 2022 7:49AM by PIB Hyderabad

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఈ నెల ఎనిమిది  జిలియన్ హాంకాంగ్ లిమిటెడ్  పూర్తి అనుబంధ సంస్థ అయిన జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గుర్గావ్‌లోని ఫింటీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై దాడులు చేసింది. సెర్చ్ ఆపరేషన్లు ముగిసిన తరువాత బెంగళూరులోని ఫింటీ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు గతంలో లిస్టెడ్ కంపెనీ అయిన హైదరాబాద్కు చెందిన హుసిస్ కన్సల్టింగ్ లిమిటెడ్ పైనా దాడులు జరిపింది.  సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్డోర్ట్సేను అరెస్ట్ చేసింది.   డోర్ట్సే బోర్డ్ ఆఫ్ జిలియన్ ఇండియా లిమిటెడ్‌ బోర్డులో సభ్యుడు.  భారతదేశంలో చైనీస్ లింక్‌లతో పెద్ద సంఖ్యలో షెల్ కంపెనీలను విలీనం చేయడం,  వారి బోర్డులలో డమ్మీ డైరెక్టర్లను అందించడం వంటి మొత్తం రాకెట్‌కు సూత్రధారి ఇతడేనని ఆఫీసర్లు గుర్తించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు దాఖలు చేసిన రికార్డుల ప్రకారం డోర్ట్సే తనను తాను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నివాసిగా చెప్పుకున్నాడు.  రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్  విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాల ప్రకారం.. అనేక షెల్ కంపెనీలలో డమ్మీలుగా వ్యవహరించడానికి జిలియన్ ఇండియా లిమిటెడ్ ద్వారా డమ్మీ డైరెక్టర్లను ఇతడు పంపిస్తున్నాడు. కంపెనీ సీల్స్  డమ్మీ డైరెక్టర్ల డిజిటల్ సంతకాలతో నిండిన పెట్టెలు సైట్ నుండి రికవరీ చేశామని ఎస్ఎఫ్ఐఓ తెలిపింది. భారతీయ ఉద్యోగులు చైనీస్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చైనా సహచరులతో టచ్‌లో ఉన్నారు. జిలియన్ ఇండియా లిమిటెడ్ తరపున కూడా హసీస్ లిమిటెడ్ కూడా పనిచేస్తున్నట్టు తేలింది.. జిలియన్ హాంకాంగ్ లిమిటెడ్‌తో హుసిస్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రాథమిక పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో ఈ షెల్ కంపెనీలు తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఇది దేశ ఆర్థిక భద్రతకు ముప్పనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధీనంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ పనిచేస్తుంది. జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తోపాటు  32 ఇతర కంపెనీలపై దర్యాప్తును 9 సెప్టెంబర్, 2022న సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి అప్పగించింది. డార్ట్సే తోపాటు ఇద్దరు చైనా జాతీయులు జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియాలో  డైరెక్టర్లు.  డోర్ట్సే ఢిల్లీ నుండి బీహార్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతానికి పారిపోయాడు.  రోడ్డు మార్గం ద్వారా భారతదేశం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియడంతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారుఅధికారులబృందం నిందితుడు ఉన్న మారుమూల ప్రదేశానికి వెళ్లి  అరెస్టు చేసింది. తర్వాత అతన్ని జురిస్డిక్షనల్ కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ రిమాండ్ కోసం న్యాయమూర్తి నుంచి ఆదేశాలు పొందింది. 

***



(Release ID: 1858568) Visitor Counter : 179