మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎమ్ఎమ్ఎస్ వై ) రెండవ వార్షికోత్సవం వేడుకలు
పిఎంఎమ్ఎస్ వై విజయాలపై బుక్ లెట్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా
2019-20 నుంచి 2021-22 వరకు 14.3 శాతం వృద్ధిని నమోదు చేసిన మత్స్య రంగం
2019-20లో అత్యధికంగా 141.64 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి 2021-22లో 161.87 లక్షల టన్నులకు చేరిక
రొయ్యల ఎగుమతులను మించి రూ.57,587 కోట్ల విలువైన 13.64 లక్షల టన్నుల మత్స్య సంపద ఎగుమతులు
22 రాష్ట్రాలు , 7 కేంద్రపాలిత ప్రాంతాలలో బీమా కవరేజీ కింద 31.47 లక్షల మంది రైతులకు పిఎమ్ ఎమ్ ఎస్ వై మద్దతు
మత్స్యకారులు, చేపల రైతులు, స్వయం సహాయక బృందాలు ఎస్ హెచ్ జి లు), జాయింట్ లయబిలిటీ గ్రూపులు, మహిళా గ్రూపులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కే సి సి) విస్తరణ
2024-25 చివరి నాటికి 68 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న పీఎంఎంఎస్ వై
Posted On:
10 SEP 2022 3:26PM by PIB Hyderabad
ప్ర ధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎమ్ ఎమ్ ఎస్ వై) ఈ రోజు విజయ వంతంగా రెండో వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ గొప్ప రోజు ను పురస్కరించుకుని పిఎమ్ ఎమ్ ఎస్ వై ఫ్లాగ్ షిప్ కార్యక్రమం విజయాలు , భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించడానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ రోజు న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎఫ్.ఎ.హెచ్.డి, ఐ అండ్ బి సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ తరుణ్ శ్రీధర్ ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. అయ్యప్పన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఎఫ్ ఎ హెచ్ డి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ కూడా హాజరయ్యారు.
సుమారు 300 మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులతో పాటు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ వేడుకకు హాజరై తమ అనుభవాలను,విజయ గాథలను పంచుకున్నారు. పిఎమ్ ఎమ్ ఎస్ వై గురించి, దాని విజయాల గురించి మత్స్య సంపద పేరు తో వెలువరించిన బుక్ లెట్ ను , డిఒఎఫ్ న్యూస్ లెటర్ 3వ ఎడిషన్ ను , ఎగుమతి డైవర్సిఫికేషన్ కు ఉద్దేశించిన టిలాపియా యాక్షన్ ప్లాన్ ను , స్కాంపి యాక్షన్ ప్లాన్ ను, 2022-2025 నేషనల్ సీడ్ ప్లాన్ ను ఈ కార్యక్రమం లో ఆవిష్కరించారు.
ఈ ఉత్సవాన్ని నిర్వహించినందుకు, పథకం విజయాలను,భవిష్యత్తు ప్రణాళికను తెలియచేయడానికి బుక్ లెట్ లను
ప్రచురించినందుకు కేంద్ర మంత్రి శ్రీ రూపాలా ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ను, పిఎంసి బృందాన్ని అభినందించారు.
డాక్టర్ ఎల్. మురుగన్ భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మత్స్య రంగం అభవృద్ధికి జరిగిన కృషి, భారతదేశంలో ఒక కీలకమైన రంగంగా మత్స్య రంగం సంప్రదాయ చరిత్ర గురించి వివరించారు.
శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ సాంకేతిక పరిజ్ఞానం, పబ్లిక్ స్టాకింగ్, నదీ, సముద్ర తీర ప్రాంతాలలో జలాశయాలను పునరుద్ధరించడం ద్వారా ద్వారా మన జలాశయాలు, సహజ వనరుల నిజమైన సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. పిఎమ్ ఎమ్ ఎస్ వై కేంద్ర బిందువుగా ఉన్న మత్స్య ,చేపల రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పిఎమ్ ఎమ్ ఎస్ వై పథకం కింద మత్స్య రంగంలో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
శ్రీ తరుణ్ శ్రీధర్ దేశంలో రొయ్యల విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి తన అనుభవాన్ని, మత్స్య రంగంలో వైవిధ్యతకు సంబంధించిన విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. ఉత్పాదకత పరంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానానికి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ప్రాముఖ్యత , చేపల పెంపకంలో శాస్త్రీయ పద్ధతుల ఉపయోగం గురించి డాక్టర్ ఎస్. అయ్యప్పన్ నొక్కి చెప్పారు. ఎన్ ఎఫ్ డి బి చీఫ్ ఎగ్జిక్యూటివ్, డాక్టర్ సి. సువర్ణ, పిఎమ్ ఎమ్ ఎస్ వై పథకానికి గల పటిష్ఠమైన నిర్మాణాత్మక అమలు వ్యవస్థ గురించి వివరించారు.
పీఎంఎంఎస్ వై గురించి :
‘ఆత్మనిర్భర్ భారత్' ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం రూ.20,050 కోట్ల పెట్టుబడులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై )ను ప్రవేశపెట్టింది.
గత రెండు సంవత్సరాలలో, కోవిడ్ -19 ఈ రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసినప్పటికీ, ఈ రంగం క్రమబద్ధమైన విధానాన్ని అవలంబించడం ద్వారా ఈ పథకం కింద తిరిగి పుంజుకోగలిగింది. గత రెండు సంవత్సరాల్లో (2019-20 నుంచి 2021-22 వరకు) మత్స్య పరిశ్రమ 14.3% వృద్ధిని నమోదు చేసింది. గతం లో ఎన్నడూ లేనంతగా 2019-20లో 141.64 లక్షల టన్నులకు చేరిన చేపల ఉత్పత్తి 2021-22లో 161.87 లక్షల టన్నుల (ప్రోవిజనల్) కు చేరుకుంది.
అదేవిధంగా ఎగుమతుల్లో, రొయ్యల ఎగుమతులను మించి అధికంగా రూ.57,587 కోట్ల (7.76 బిలియన్ డాలర్లు) విలువ చేసే 13.64 లక్షల టన్నుల మత్స్య ఎగుమతులను మనం సాధించాము. ప్రస్తుతం మనం 123 దేశాలకు ఎగుమతి చేస్తున్నాము.
ఇన్ లాండ్ ఫిషరీస్ అభివృద్ధి కోసం 20,622 బోనులను ఏర్పాటు చేయడం ద్వారా 20 ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులను చేపట్టారు. ఉత్పాదకతను పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానంలో డ్రైవింగ్ ను అవలంబించడం కోసం, 3117 ఆర్ఎఎస్ యూనిట్ లు , 2693 బయో-ఫ్లోక్ యూనిట్ లు ఫంక్షనల్ గా ట్రాన్స్ పోజ్ చేయబడ్డాయి. దాదాపు 1600 హెక్టార్ల విస్తీర్ణం లో సెలైన్ , ఆల్కలైన్ ఏరియా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
మెరైన్ ఫిషరీస్ అభివృద్ధి కోసం 276 డీప్ సీ ఫిషింగ్ వెసల్స్ ను ఆమోదించారు. వాటి కొనుగోలు ప్రక్రియ మొదలైంది. రైతులకు నాణ్యమైన ఫిష్ సీడ్ ను అందించడానికి పది మెరైన్ హేచరీలకు ఆమోదం లభించింది. దాదాపు సముద్రంలో ఏర్పాటు చేయబోయే 1556 కేజ్ లకు ఇప్పటికే అనుమతి మంజూరు అయింది.
ఇప్పటివరకు పిఎమ్ ఎమ్ ఎస్ వై కింద 22 రాష్ట్రాలు , 7 కేంద్రపాలిత ప్రాంతాల లో 31.47 లక్షల మంది రైతులకు బీమా మద్దతు ఇచ్చింది. ఇంకా అదనంగా 6.77 లక్షల మంది రైతులకు జీవనోపాధి , లీన్/బ్యాన్ కాలంలో పోషకాహార మద్దతు అందించింది.
అంతేకాకుండా, ఈ రంగం వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి, ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ను మత్స్యకారులు, చేపల రైతులు, స్వయం సహాయక బృందాలు (ఎస్ హెచ్ జి లు), జాయింట్ లయబిలిటీ గ్రూపులు, మహిళా గ్రూపులు మొదలైన వారికి విస్తరించింది. 2022 జనవరి నాటికి మొత్తం 6,35,783 దరఖాస్తులు రాగా, రూ.1,04,179 లక్షలు మంజూరయ్యాయి.
చేపల పెంపక మౌలిక సదుపాయాలను
బలోపేతం చేయడానికి, చేపల ఉత్ప త్తిని పెంపొందించడానికి గాను ఇప్పటి వరకు మొత్తం 19 ఫిషింగ్ హార్బ ర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ప్రతిపాదనలకు రూ.912.03 కోట్ల మేర ఆమోదం తెలిపింది. పీఎంఎంఎస్ వై ద్వారా 2024-25 చివరి నాటికి 68 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
ఇంతకు ముందు, సముద్ర చేపల ఉత్పత్తి భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తి లో అధిక వాటా కలిగి ఉంది. అయితే ,2019 సంవత్సరంలో సైన్స్-ఆధారిత పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించడం వల్ల, చేపల ఉత్పత్తిలో 74% ఇన్ లాండ్ చేపల పెంపకం ద్వారా , మిగిలిన 26% సముద్ర చేపల పెంపకం ద్వారా రావడానికి దోహదపడింది.
ఈ పథకంలో, ఆక్వాకల్చర్ ప్రమోషన్ ను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని సెలైన్, ఆల్కలైన్ ప్రాంతాలలో చేపడతారు. రొయ్యల ఆరోగ్య నిర్వహణ ,వ్యాధుల నియంత్రణ పై దృష్టి పెట్టడం మరో ప్రాధాన్యతా అంశం. ఇంటిగ్రేటెడ్ లేబరేటరీ నెట్ వర్క్ ద్వారా యాంటీ-బయోటిక్, అవశేషాల సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టారు.
నేపథ్యం:
గ్రామీణ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శరవేగంగా పెంపొందించడం ద్వారా గ్రామీణాభివృద్ధి దిశ గా ఆత్మ నిర్భర్ భారత్ కు ఒక సాధనంగా పిఎమ్ ఎమ్ ఎస్ వై ని ప్ర ధాన మంత్రి భావించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధిని పెంపొందించడంలో పిఎమ్ ఎమ్ ఎస్ వై ఒక కీలక అంశంగా ఉంటుంది. పిఎమ్ ఎమ్ ఎస్ వై ప్రధాన నినాదం- మత్స్య రంగంలో 'రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ ఫార్మ్'
పిఎమ్ ఎమ్ ఎస్ వై పథకంలో సంస్కరణలు, చొరవలను కోర్ అండ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, భారతీయ చేపల పెంపకం ఆధునీకరణ, ముఖ్యంగా కొత్త ఫిషింగ్ హార్బర్లు/ ల్యాండింగ్ కేంద్రాలకు ఊతం, సంప్రదాయ మత్స్యకారుల ఆధునీకరణ యాంత్రీకరణ కు ఉద్దేశంచారు. క్రాఫ్ట్స్-ట్రాలర్స్-డీప్ సీ గోయింగ్ ఓడలు, హార్వెస్ట్ అనంతర నష్టాన్ని తగ్గించడానికి హార్వెస్ట్ అనంతర సౌకర్యాల ఏర్పాటు, కోల్డ్ చైన్స్ సౌకర్యాలు, పరిశుభ్రమైన చేపల మార్కెట్లు, ఐస్ బాక్సులతో ద్విచక్రవాహనాలు, మత్స్యకారులకు బీమా రక్షణ, ఆర్థిక సాయం, కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయం కల్పించ డానికి కూడా సంస్కరణలు, చొరవ లను ఉద్దేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా వినియోగాన్ని పెంచడానికి పిఎమ్ ఎమ్ ఎస్ వై ఒక మార్గాన్ని నిర్దేశించింది.
నిరంతర ఎదుగుదల ,మార్పుకు మూడు ముఖ్యమైన స్తంభాలు అయిన వ్యక్తులు, ప్రక్రియ ,సాంకేతిక పరిజ్ఞానం పరంగా బహుముఖ అవసరాలను తీర్చడానికి ఈ పథకంలో జోక్యాలు తగినంతగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ మూడు స్తంభాలు మొత్తం గొలుసు అంతటా వివిధ అంశాలను కలిగి ఉంటాయి: స్థిరమైన ఉత్పత్తి విధానాలు; తగినంత ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల కల్పన; ఎండ్ కన్స్యూమర్ కొరకు టార్గెట్ మార్కెటింగ్; సమ్మిళిత విధానాలు , అనుసరించ దగిన పలు నియంత్రణ వ్యవస్థలు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, చేపల పెంపకాన్ని సద్వినియోగం చేసుకోవడం, సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సరైన ప్రేరణను ఇవ్వడానికి, మత్స్య మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎమ్ఎస్ఎస్ వై ) ప్రాధాన్యతా పథకం కింద వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు వివిధ రాష్ట్రాల నుండి ప్రతిపాదనలను మంజూరు చేసింది.
***
(Release ID: 1858328)
Visitor Counter : 243