సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

న్యూఢిల్లీ ఐజీ ఎన్ సీఏ గ్యాలరీలో ఎల్ సాల్వడార్‌కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు రోడాల్ఫో వేగా ఒవిడో పెయింటింగ్స్ తో ఆర్ట్ ఎగ్జిబిషన్ సాంస్కృతిక మార్పిడి దేశాల మధ్య మంచి సంబంధాలు బలపరుస్తుంది : శ్రీమతి. మీనాక్షీ లేఖి

Posted On: 10 SEP 2022 9:06AM by PIB Hyderabad
ఎల్ సాల్వడార్‌కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు రోడాల్ఫో వేగా ఒవిడో  పెయింటింగ్స్ తో న్యూఢిల్లీ ఐజీ ఎన్ సీఏ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటయింది. వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖి ప్రముఖ కళాకారుడు రోడాల్ఫో వేగా ఒవిడో సమక్షంలో ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మరియు రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్  రాయబార కార్యాలయం ప్రదర్శన ఏర్పాటు చేశాయి. 

శ్రీమతి మీనాక్షీ లేఖి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించడానికి సాంస్కృతిక మార్పిడి తోడ్పడుతుందని అన్నారు. కళలను ఆస్వాదించి ప్రశంసించడం ద్వారా ఒకరి జీవన విధానాన్ని మరొకరు అర్ధం చేసుకుని  జీవన విధానంతో సుపరిచితం కావడానికి సాంస్కృతిక మార్పిడి సహాయపడుతుందని శ్రీమతి  మీనాక్షీ లేఖి పేర్కొన్నారు. కళా ప్రదర్శన ఏర్పాటు చేసిన  రోడాల్ఫో వేగా ఓవిడోను మంత్రి అభినందించారు. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న సమయంలో  రోడాల్ఫో వేగా ఓవిడో  ఇక్కడకు వచ్చారని మంత్రి అన్నారు. 

ఒక పెయింటర్ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ మరియు సాంస్కృతిక నిర్వాహకునిగా  రోడాల్ఫో వేగా గుర్తింపు పొందారు. ఫ్రాన్స్ మరియు లాటిన్ అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం  చేసేందుకు  రోడాల్ఫో వేగా   చేసిన కృషిని గుర్తించిన  ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనకు  అవార్డు ఇచ్చి గౌరవించింది. 

 

రోడాల్ఫో పెయింటింగ్‌లు  విలక్షణమైన కథల ఆధారంగా రూపు దిద్దుకుంటాయి. జాగ్రత్తగా సేకరించిన తీగఇసుక మరియు ఆకు వంటి  పదార్థాలు అతని జ్ఞాపకాలను గుర్తు చేస్తూ   ఉత్తమ చిత్రాలుగా రూపుదిద్దుకుంటాయి. యాక్రిలిక్ మరియు నియాన్ పెయింటెడ్ కాన్వాస్‌లు  సార్వత్రిక లేదా పౌరాణిక అంశాలను సులువుగా అర్థం అయ్యే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాయి.  రేఖా గణిత నమూనాలురంగులు మరియు అల్లికల సమ్మేళనంతో    రోడాల్ఫో వేగా  చిత్రాలు మాట్లాడే విధంగా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే వాటిలో  వాస్తుశిల్పందేవాలయంకిరణాలుసూర్యుడుచంద్రుడు లాంటి గూడార్ధం  కూడిన  పొరలు కనిపిస్తాయి. సూర్యుడు లేదా చంద్రుని కదలికతో గృహాన్ని ప్రధానంగా ఆకాశాన్ని వర్ణిస్తూ చిత్రాలు కనిపిస్తాయి. 

 

స్వయంగా గీసిన చిత్రాలు, ప్రత్యేకంగా సేకరించిన చిత్రాలతో  రోడాల్ఫో వేగా ఒవిడో   ప్రపంచవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.  అర్ట్ ఎగ్జిబిషన్ లో   మెట్జ్‌లోని పాంపిడౌ మ్యూజియంటెహ్రాన్ ఆర్టిస్టిక్ హౌస్స్పానిష్ రక్షణ మంత్రిత్వ శాఖహవానాలోని గోమెజ్ ప్యాలెస్క్యూబా మొదలైనవి ఉన్నాయి.

***



(Release ID: 1858313) Visitor Counter : 138