పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ప్ర‌యాణీకుల‌కు మెరుగైన సేవ‌లందించేందుకు ట్యుటికోరిన్ విమానాశ్ర‌య అభివృద్ధి

Posted On: 09 SEP 2022 12:06PM by PIB Hyderabad

పెరుగుతున్న ప్ర‌యాణీకుల ర‌ద్దీని, మెరుగైన సేవ‌లు, అనుసంధాన డిమాండ్‌ను తీర్చేందుకు త‌మిళ‌నాడులో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ట్యుటికోర్న్ విమానాశ్ర‌యాన్ని అభివృద్ధి ప‌ర‌చడం జ‌రుగుతోంది. ఎ-321 ర‌క‌పు విమానాల కార్య‌క‌లాపాల కోసం ర‌న్‌వే పొడిగింపు, నూత‌న ఆప్రాన్ నిర్మాణం, కొత్త టెర్మిన‌ల్ భ‌వ‌నం, టెక్నిక‌ల్ బ్లాక్ క‌మ్ కంట్రోల్ ట‌వ‌ర్ & నూత‌న అగ్నిమాప‌క కేంద్రం ప‌లు నిర్మాణాలు రూ. 381 కోట్ల వ్య‌యంతో కొన‌సాగుతున్నాయి. 
దాదాపు 13500 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నూత‌న ట‌ర్మిన‌ల్ భ‌వ‌నం ర‌ద్దీ వేళ‌ల్లో సౌక‌ర్య‌వంతంగా దాదాపు 600 మంది ప్ర‌యాణీకుల రాక‌పోక‌ల‌కు వీలుక‌ల్పిస్తుంది.  ఈ భ‌వ‌నానికి కార్ పార్కింగ్ సౌక‌ర్యాలు, రెండు ఏరో బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్డు స‌హా అన్ని అధునాత‌న‌మైన సౌక‌ర్యాలు ప్ర‌యాణీకుల‌కు అందుబాటులో ఉంటాయి. 
ఈ ప్రాంతంలో ప్ర‌సిద్ధ‌మైన‌ చెట్టినాడ్ గృహాల ప్రేర‌ణ‌తో, నూత‌న టెర్మిన‌ల్ వాస్త‌వ రూపం ద‌క్షిణాది ప్ర‌త్యేక నిర్మాణ శైలిని సృష్టించి, టెర్మిన‌ల్ రూప‌క‌ల్ప‌న‌కు నూత‌న కోణాన్ని జోడిస్తుంది. స్థానిక సంస్కృతి, సంప్ర‌దాయ వాస్త‌శిల్పానికి సంబంధించిన బ‌ల‌మైన ప్ర‌స్తావ‌న‌లు భ‌వ‌నం నిర్మాణం ద్వారా వ్య‌క్తీకృత‌మ‌వుతాయి. భ‌వ‌నంలోని అంత‌ర్భాగం స‌మ‌కాలీన ప‌ద్ధ‌తిలో శైలి, అల్లిక‌ల ద్వారా న‌గ‌ర‌పు రంగులు, సంస్కృతిని ప్ర‌తిబింబిస్తాయి. కొత్త టెర్మిన‌ల్ ఫోర్ స్టార్ జిఆర్ఐహెచ్ఎ (GRIHA) ఇంద‌న సామ‌ర్ధ్య భ‌వ‌నంగా స్థిర‌త్వ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. 
ప్ర‌స్తుతం ఉనికిలో ఉన్న ర‌న్‌వేను విస్త‌రించి, పొడిగించి బ‌లోపేతం చేయ‌డం, ఎ-321 విమానాల రాక‌పోక‌ల‌కు విమానాశ్ర‌యాన్ని అనువుగా మ‌ల‌చ‌డం అన్న‌వి విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగం. నూత‌న ఎటిసి ట‌వ‌ర్ క‌మ్ టెక్నిక‌ల్ బ్లాక్‌, అగ్నిమాప‌క కేంద్రం, ఐసొలేష‌న్ బే, ఎ-321 విమానాల‌ను పార్క్ చేసేందుకు ఐదు విమానాల పార్కింగ్ బేలు కూడా ఈ ప్రాజెక్టులో భాగ‌మే. 
ద‌క్షిణ త‌మిళ‌నాడు ప్రాంతంలో మ‌దురై ఆవ‌ల ఉన్న ప్రాంతంలో ఉన్న విమానాశ్ర‌యం ట్యుటికోర్న్ ఒక్క‌టే. మెరుగైన సేవ‌ల‌ను ప్ర‌యాణీకుల‌కు అందించాల‌న్న స్థానిక స‌మాజ డిమాండ్‌ను నెర‌వేర్చ‌డ‌మే కాకుండా ట్యుటికార్న్‌, పొరుగు జిల్లాలైన తిరునెల్వేలి, తెన్‌కాశి, క‌న్యాకుమారిలో వాణిజ్యం & ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించేందుకు ఈ విమానాశ్ర‌య అభివృద్ధి తోడ్ప‌డుతుంది.  విమానాశ్ర‌య అభివృద్ధి, విస్త‌ర‌ణ‌కు ప్రాజెక్టు డిసెంబ‌ర్ 2023కి పూర్తి అవుతుంద‌ని అంచ‌నా. 

Widening & Strengthening of Runway

Extension of Runway – Work in progress

Terminal Building -Work in Progress

 

Perspective View- Facade

 

 

Check-In Area

 

 

Security Hold Area

 

 

 

 

****

 (Release ID: 1858162) Visitor Counter : 128