వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (IPEF) మొట్టమొదటి వ్యక్తిగత మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబర్ 5-10 వరకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ నగరాలను సందర్శించనున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ గోయల్ ప్రముఖ వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులతో సంభాషించడానికి, భారతీయ స్టార్టప్‌లకు మరిన్ని భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి అమెరికా స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో నిమగ్నమవ్వడానికి అమెరికా పర్యటన.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రతినిధి కార్యాలయాలను ప్రారంభించనున్న శ్రీ గోయల్
ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడంలో, ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడటానికి అమెరికా సందర్శిన
Posted On:
02 SEP 2022 3:34PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, భారతదేశం-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సదస్సుకు హాజరయ్యేందుకు 2022 సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ (IPEF) మంత్రివర్గ సమావేశం జరుగుతున్న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ నగరాలను సందర్శించనున్నారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన పర్యటన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, అమెరికా అధికారులు, పరిశ్రమల ప్రముఖులతో కూడా సంభాషించనున్నారు.
భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రజాస్వామ్య విలువలు, సమస్యల శ్రేణిపై ఆసక్తుల కలయిక, శక్తివంతమైన వ్యక్తుల మధ్య సంప్రదింపుల ద్వారా నడిచే మానవ ప్రయత్నంలోని దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేసే సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. విస్తరిస్తున్న ద్వైపాక్షిక భాగస్వామ్యంలో నాయకత్వ స్థాయిలో పరస్పర ఆలోచనల మార్పిడిలు అంతర్భాగంగా ఉన్నాయి. ఈ సందర్శనల నుంచి వెలువడుతున్న ఫలితాలు రెండు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా ఉన్నాయి.
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (IPEF)ని అమెరికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇతర భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా మే 23, 2022న టోక్యోలో ప్రారంభించాయి. భారతదేశం సైతం IPEFలో చేరింది, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో, భాగస్వామ్య దేశాలకు చెందిన ఇతర నాయకులతో కలిసి హాజరయ్యారు. మునుపు, మే 23న ప్రారంభించిన వెంటనే మంత్రిత్వ సమావేశాలు, ఆ తర్వాత జూలై 26-27, 2022 వరకు ఆన్ లైన్ లో నిర్వహించేవారు.
ఈ ప్రాంతంలో వృద్ధి, శాంతి, శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి IPEF ప్రయత్నిస్తుంది. వాణిజ్యానికి సంబంధించిన నాలుగు స్తంభాల చుట్టూ ఈ సంస్థ కార్యాచరణ నిర్మాణం జరిగింది (ఆధారం I); సరఫరా గొలుసులు (ఆధారం II); క్లీన్ ఎకానమీ (ఆధారం III);, ఫెయిర్ ఎకానమీ (ఆధారం IV). ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం, స్థితిస్థాపకత, సుస్థిరత, సమ్మిళిత, ఆర్థిక వృద్ధి, న్యాయబద్ధత, పోటీతత్వాన్ని పెంపొందించడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది.
భారతదేశం ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత వ్యాపారానికి కట్టుబడి ఉంది, ఈ ప్రాంతం వృద్ధి, శ్రేయస్సు కోసం భాగస్వాముల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తుంది. భాగస్వామ్య దేశాలకు వారి సంబంధిత ప్రాధాన్యతల ఆధారంగా అనుబంధించడానికి సౌలభ్యాన్ని అనుమతిస్తుంది.
IPEF మంత్రివర్గ సమావేశ సందర్భంగా US వాణిజ్య కార్యదర్శి, USTR, ఇతర IPEF భాగస్వామ్య దేశాల మంత్రులతో మంత్రి ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు.
ఈ పర్యటనలో, భారతదేశ వాణిజ్య మంత్రి, యుఎస్ వ్యాపార సంఘాల మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను ప్రోత్సహించడానికి బహుళజాతి కంపెనీలు, భారతీయ ప్రవాసులు, వెంచర్ క్యాపిటలిస్ట్ లు, విద్యావేత్తలతో సహా స్టార్టప్ కమ్యూనిటీల ముఖ్య కార్యనిర్వహనాదికారులతో సంభాషిస్తారు. గతి-శక్తి, స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ మెంట్ కారిడార్లు, వ్యాపార సౌలభ్యం కోసం చేపట్టిన చర్యలు, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో అత్యంత ఇష్టపడే పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశ ఆకర్షణను ప్రపంచానికి తెలియచెప్పడంపై ఈ పర్యటన దృష్టి సారిస్తుంది.
శ్రీ గోయల్ సన్నిహిత పారిశ్రామిక సహకారాల అవసరం, సంభావ్యత పై చర్చలు జరుపుతారు, భాగస్వామ్యాలను మరింత విస్తరింప జేస్తారు, ప్రాధాన్యతా రంగాల్లో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను ఏర్పాటు చేస్తారు. స్టార్టప్ ఎకోసిస్టమ్, భారతీయ డయాస్పోరాతో క్యూరేటెడ్ ఇంటరాక్షన్లు వారి వృద్ధి, విస్తరణకు సాధికారత, మార్గదర్శకత్వంలో సహాయపడతాయి. అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రతినిధి కార్యాలయాలను కూడా మంత్రి ప్రారంభిస్తారు
ఎలక్ట్రానిక్స్ (సెమీకండక్టర్తో సహా) - భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా విస్తరించాలని చూస్తున్న అమెరికా కంపెనీలతో కేంద్రీకృత చర్చలు చేపట్టడానికి బే ఏరియాలో, ప్రత్యేకంగా సిలికాన్ వ్యాలీ లోని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెక్నాలజీ, ఫిన్టెక్ మొదలైన సాంకేతికత, వ్యవస్థాపకత, అకడమిక్ కమ్యూనిటీలతో శ్రీ గోయల్ సంభాషిస్తారని భావిస్తున్నారు.
భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో గొప్ప భాగస్వామ్యాన్ని అన్వేషించడానికి, భారతదేశ దేశీయ మార్కెట్లకు ప్రపంచ మూలధనాన్ని సమీకరించడానికి, భారతీయ పారిశ్రామికవేత్తలకు అనుభవజ్ఞులైన ప్రపంచ వ్యాపారవేత్తల మార్గదర్శకాలు ప్రోత్సహించడానికి శాన్ ఫ్రాన్సిస్కోలో శక్తివంతమైన స్టార్టప్ సంఘంతో మంత్రి పాల్గొననున్నారు.
***
(Release ID: 1856861)
Visitor Counter : 124