హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు-2023 నామినేషన్లకు 2022 సెప్టెంబర్ 15 వరకు గడువు

Posted On: 02 SEP 2022 6:22PM by PIB Hyderabad


 

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం-2023 సందర్భంగా ప్రకటించబడే పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/ సిఫారసు దరఖాస్తులు మే 1, 2022 న ప్రారంభించబడ్డాయి. పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. జాతీయ స్థాయిలో అందించే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/ సిఫారసు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో  రాష్ట్రీయ పురస్కార్  పోర్టల్ (https://awards.gov.in ) ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ  అవార్డులు మ‌న దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు. 1954 లో ప్రారంభించబడిన ఈ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి. ఈ అవార్డు 'వర్క్ ఆఫ్ డిస్టింక్షన్' ను గుర్తించటానికి ప్ర‌తీక‌గా నిలుస్తున్నాయి. వివిధ క‌ళ‌లు, సాహిత్యం మ‌రియు విద్య‌, క్రీడ‌లు, వైద్యం, సామాజిక సేవ‌, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్ర‌జాసంబంధాలు, సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ, మొదలైన రంగాలలోను.. విభాగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు/ సేవలకు గాను ఈ పుర‌స్క‌రాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప పీఎస్‌యులలో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు.

పద్మ అవార్డులను “పీపుల్స్ పద్మ” గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల దేశ పౌరులందరూ స్వీయ నామినేషన్‌ల‌తో సహా నామినేషన్లు / సిఫార్సులు చేయాలని అభ్యర్థించ‌డ‌మైంది.

 

నామినేషన్ లు/సిఫార్సులు పైన పేర్కొన్న పోర్టల్ పై లభ్యం అయ్యే నిర్ధిష్ఠ ఫార్మాట్‌ల‌లో పేర్కొనబడ్డ అన్ని సంబంధిత వివరాలు కలిగి ఉండాలి, సిఫార్సు చేయబడిన ఆమె/అతని సంబంధిత రంగం/వృత్తి లో వారి వారి విశిష్టమైన , అసాధారణ ప్రతిభ/ విజయాలు/సర్వీసులకు  సంబంధించిన వివరాలను స్పష్టంగా  కథన రూపంలో గరిష్టంగా 800 పదాల‌లో తెలియజేయాలి.

అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలు.. భారత‌ రత్న మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్రతిభా వంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయవచ్చని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు మ‌రియు ఎస్టీలు, దివ్యాంగులు , సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని ఇందుకు సిఫార‌సు చేయ‌వ‌చ్చు.

ప‌ద్మ అవార్డుల‌కు సంబంధించిన మరిన్ని వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (www.mha.gov.in), వెబ్ సైట్ లో 'అవార్డులు, పతకాలు' శీర్షిక కింద, పద్మ అవార్డుల పోర్టల్‌లో (https://padmaawards.gov.in )లభిస్తాయి. ఈ అవార్డులకు సంబంధించిన నియమ నిబంధనలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్ తో వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.


(Release ID: 1856511) Visitor Counter : 330