ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
31 AUG 2022 4:33PM by PIB Hyderabad
కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న రెండు ప్రముఖ స్థిరాస్తి రంగంలోని గ్రూపు సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ 18.08.2022న సోదాలు నిర్వహించి పలు ఆస్తులను జప్తు చేసింది. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో వివిధ ఆధార పత్రాలు, డిజిటల్ డేటాతో సహా పెద్ద సంఖ్యలో నేరారోపణ సాక్ష్యాలు కనుగొన్నారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు లావాదేవీలు, ఆన్-మనీ రసీదులకు సంబంధించిన ఆధారాలు కూడా ఈ సోదాలు ఐటీ శాక అధికారులకు లభించాయి. సోదాలలో లభించిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డేటా ప్రకారం షెల్ కంపెనీల ద్వారా లెక్క చూపని డబ్బును అక్రమ మార్గంలో మళ్లించినట్టుగా ఆధారాలను సూచిస్తున్నాయి. ఇంకా, ఐటీ సోదాల సమయంలో దొరికిన కొన్ని ఆధారాలు భూసేకరణలో కూడా లెక్కలో చూపని నిధులను ఉపయోగించినట్టు తెలుపుతున్నాయి. బూటకపు పెట్టుబడులను విక్రయించడం ద్వారా షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియం మరియు అసురక్షిత రుణాల రూపంలో లెక్కలోకి రాని నిధులను ఇన్ఫ్యూషన్ చేయడానికి షెల్ కంపెనీలను ఉపయోగించినట్టుగా ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ముఖ్య వ్యక్తులూ అంగీకరించారు. సోదాలలో ఇప్పటివరకు మొత్తం లెక్కలో చూపని రూ. 250 కోట్ల ఆదాయాన్ని సోదాలు నిర్వహించిన సమయంలో 16 బ్యాంక్ లాకర్లు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.
******
(Release ID: 1855879)
Visitor Counter : 124