వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెంట్రల్ పూల్ కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23 ఖరీఫ్ పంట కాలంలో 518 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ జరుగుతుందని అంచనా


రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23 లో ఖరీఫ్ పంట సేకరణకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించేందుకు ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆహార కార్యదర్శులు మరియు ఎఫ్‌సీఐ అధికారులు

Posted On: 30 AUG 2022 8:25PM by PIB Hyderabad

రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23 లో  ఖరీఫ్ పంట  సేకరణకు సంబంధించిన ఏర్పాట్లపై  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి శ్రీ సుధాన్షు పాండే ఈ రోజు ఢిల్లీలో రాష్ట్ర ఆహార కార్యదర్శులు మరియు ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరిపారు. 

సమావేశానికి ఆంధ్రప్రదేశ్, అస్సాం,బీహార్,ఛత్తీస్ ఘర్, గుజరాత్,హర్యానా,హిమాచల్ప్రదేశ్,జమ్మూకాశ్మీర్,ఝార్ఖండ్,కర్ణాటక,రాజస్థాన్,కేరళ,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఒడిశా,పంజాబ్,తమిళనాడు,తెలంగాణ,త్రిపుర,ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి ( ఆహారం) లేదా వారి ప్రతినిధులు హాజరయ్యారు. ఎఫ్‌సీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఎఫ్‌సీఐ  ఉన్నతాధికారులు, ఆహారం,ప్రజా పంపిణీ, భారత తూనికలు విభాగం, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23 లో  ఖరీఫ్ పంట కాలంలో దేశంలో 518 ఎల్ఎంటీ బియ్యం సేకరణ జరిగే అవకాశం ఉందని సమావేశం అంచనా వేసింది. 2021-22 ఖరీఫ్ పంట కాలంలో 509.83 ఎల్ఎంటీల బియ్యం సేకరణ జరిగింది. 

పంట సేకరణలో యంత్రాలను ఉపయోగించడం,తక్కువ వడ్డీకి రుణాలు సమకూర్చడం, సేకరణ కార్యక్రమం ఖర్చు తగ్గించడం, వినూత్న సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం, నాణ్యతా ప్రమాణాలు, చిరుధాన్యాలను ప్రోత్సహించడం,గోనె సంచుల అవసరాలు, ఆహార సబ్సిడీ అంశాలను ఆన్ లైన్ లో పరిష్కరించడం, తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. వినూత్న విధానాలకు ప్రోత్సాహకాలు అందించాలని సమావేశం నిర్ణయించింది. చిరుధాన్యాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ పాండే సూచించారు. 2023 సంవత్సరాన్ని   అంతర్జాతీయ చిరుధాన్యాల  సంవత్సరంగా పాటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా చిరు ధాన్యాల సేకరణ పెరగాలని అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు కారణంగా గోధుమ, వరి దిగుబడి తగ్గుతున్నదని అన్నారు. 2022-23 ఖరీఫ్ పంట కాలంలో రాష్ట్రాలు  13.70 ఎల్ఎంటీల  ”సూపర్ ఫుడ్” చిరు  ధాన్యాలు సేకరించాలని సూచించారు. ప్రస్తుత సేకరణ కాలంలో ఇంతవరకు 6.30 ఎల్ఎంటీల  చిరు  ధాన్యాల సేకరణ జరిగింది. 

ప్యాకేజింగ్ మెటీరియల్ కొరతను ఆహారం, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు.  ప్యాకేజింగ్ సామగ్రిని సమకూర్చడం సమస్యగా మారిందని అన్నారు.  కేవలం 50% అవసరాలను  మాత్రమే జూట్ మిల్లులు తీరుస్తున్నాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి  స్మార్ట్ గోనె సంచుల తయారీ లాంటి ఉత్పత్తులను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించామని తెలిపారు. స్మార్ట్ గోనె సంచుల సామర్ధ్యం, నాణ్యత పరీక్షలు విజయవంతం అయ్యాయని తెలిపారు. 

***


(Release ID: 1855830) Visitor Counter : 164