కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విపత్తు నిర్వహణ & సంసిద్ధత కోసం సీఏపీ ఆధారిత ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టమ్‌పై వర్క్‌షాప్ నిర్వహించనున్న ఎన్ డీఎంఏ & -డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం
Posted On:
30 AUG 2022 3:32PM by PIB Hyderabad
విపత్తు నిర్వహణ కోసం సీడాట్(సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్), మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం (ఎన్ డీఎంఏ) నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఆల్ ఇండియా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్‌పై ప్రధానాంశంగా నిర్వహించే ఈ కార్యక్రమం 31 ఆగస్టు 2022న జరుగుతుంది. ఈ వర్క్‌షాప్ భారతదేశంలోని సంబంధిత విభాగాలు వివిధ విపత్తు నిర్వహణ ఏజెన్సీలకు వారి అంతర్లీన సమస్యలు, సవాళ్లను చర్చించడానికి ఒక వేదికను అందించడం జరుగుతుంది. నిపుణులు సాంకేతిక నిపుణుల బృందం చర్చల ద్వారా సమర్థవంతమైన పద్ధతిలో వీటిని పరిష్కరించడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి అజయ్ కుమార్ భల్లా, ఐఏఎస్, హోం సెక్రటరీ, హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా కే. రాజారామన్, ఐఏఎస్, చైర్మన్, డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సెక్రటరీ (టెలికాం), భారతదేశం గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఎన్ డీఎంఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం, ఇండియన్ రైల్వేస్, ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ), సెంట్రల్ వాటర్ కమీషన్ (సీడబ్ల్యూసీ), ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్ ), డిఫెన్స్ జియోఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీజీఆర్ఈ) సహా వివిధ ప్రభుత్వ శాఖల నుండి వివిధ ప్రముఖ ప్రముఖులు, వక్తలు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలు ( డీఎంఏ) అధికారులు ఈ వర్క్‌షాప్‌కు హాజరవుతారు. విపత్తు నిర్వహణ సంసిద్ధతకు సంబంధించిన వివిధ సమకాలీన అంశాలపై, ఇతివృత్తాలపై చర్చిస్తారు.
ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టమ్- గురించి
ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టమ్- అనేది ఐటీయూ కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ముందస్తు హెచ్చరిక ప్లాట్‌ఫారమ్. సమర్థవంతమైన విపత్తు నిర్వహణ కోసం సీడాట్ దీనిని అభివృద్ధి చేసింది. వరదలు, తుఫానులు కోవిడ్ మహమ్మారి వంటి అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉన్న అన్ని మీడియాలో ప్రజలకు హెచ్చరికలు, సలహాలు ఇతర ఉపయోగకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు ఈ ప్లాట్‌ఫారమ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఎస్ఎంఎస్ ద్వారా స్థానిక భాషలలో ప్రజలకు లక్ష్య హెచ్చరికల వ్యాప్తి కోసం ఒక కన్వర్జ్డ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. విపత్తు రిస్క్ తగ్గింపు కోసం ప్రధానమంత్రి 10 పాయింట్ల ఎజెండాను అమలు చేయడంలో వన్ స్టాప్ పరిష్కారం. పోర్టల్ మొబైల్ అప్లికేషన్, సెల్ బ్రాడ్‌కాస్ట్, రేడియో, టీవీ, సైరన్, సోషల్ మీడియా, వెబ్‌తో సహా అందుబాటులో ఉన్న అన్ని కమ్యూనికేషన్ మీడియాల్లో త్వరలో సందేశాలను పంపిస్తారు. ఈ వ్యవస్థ ఇప్పటికే 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తోంది. తుఫానులు (అసాని, యాస్, నివార్, అంఫాన్), వరదలు (అస్సాం, గుజరాత్), మెరుపులు (బీహార్) మొదలైన వివిధ విపత్తుల సమయంలో సిస్టమ్ ద్వారా ఇప్పటికే 75 కోట్లకు పైగా ఎస్ఎంఎస్లు వెళ్లాయి. అమర్‌నాథ్ యాత్రలో యాత్రికుల కోసం కూడా ఈ వ్యవస్థను
(Release ID: 1855829)
Visitor Counter : 271