రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జమ్ము & కాశ్మీర్‌లోని కాట్రాలో ఇంటర్ మోడల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసేందుకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఎన్‌హెచ్ఎల్ఎంఎల్, కాట్రా డెవలప్‌మెంట్ అథారిటీ
Posted On:
30 AUG 2022 3:05PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీ జనరల్ వికె సింగ్, జమ్ము & కాశ్మీర్ ఎల్.జి. శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర, రాష్ట్ర అధికారుల సమక్షంలో ఎన్‌హెచ్ఎల్ఎంఎల్ (నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్), కాట్రా డెవలప్‌మెంట్ అథారిటీ సంస్థలు అవగాహనా ఒప్పందంపై (ఎంఒయు) సంతకాలు చేశాయి.
.ఈ చొరవలో భాగంగా, మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే యాత్రికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు కాట్రా వద్ద ఇంటర్ మోడల్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణీకులు మౌలిక సదుపాయాల అభివృద్ధిని మెరుగుపరిచేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం దేశంలో పలు ప్రాంతాలలో ఇంటర్ మోడల్ స్టేషన్‌లను అభివృద్ధి చేస్తోంది.
***
(Release ID: 1855828)
Visitor Counter : 123