రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే టిక్కెట్‌ల అక్రమ వ్యాపారం పై చర్యలు తీసుకున్న రైల్వే ఆర్‌పిఎఫ్
పశ్చిమ రైల్వేకు చెందిన ఆర్‌పిఎఫ్ బృందం రైల్వే టిక్కెట్‌ల అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారిపై తీవ్రంగా విరుచుకుపడింది
ఆరుగుర్ని అరెస్ట్ చేశారు రూ.43 లక్షలు విలువైన భవిష్యత్తు టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు
Posted On:
29 AUG 2022 3:49PM by PIB Hyderabad
130 కోట్లకు మించిన జనాభాకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో ప్రయాణీకుల రవాణాలో సీట్లు మరియు బెర్త్‌లకు చాలా ఎక్కువ గిరాకీ ఉంది. భారతీయ రైల్వేలు సామర్థ్యం పెంచినప్పటికీ గిరాకీ సరఫరా అంతరం సంవత్సరాలుగా పెరుగుతునే వుంది. ఈ గిరాకీ సరఫరా అంతరం తో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనేక మంది మోసగాళ్లు దోపిడీకి తెరతీశారు, వారు రిజర్వ్ చేసిన సీట్లను కైవసం చేసుకోవడానికి మరియు వాటిని అధిక ధరపై పేదలకు విక్రయించడానికి వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ధృవీకరించబడిన రైల్వే రిజర్వేషన్‌లను కైవసం చేసుకోవడానికి చట్టవిరుద్ధమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంతో సామాన్యులకు ధృవీకరించబడిన రిజర్వేషన్ టిక్కెట్లు దొరకటం కష్టమయ్యింది. అక్రమ వ్యాపారం (రైల్వే టిక్కెట్ల సేకరణ & సరఫరా వ్యాపారాన్ని అనధికారికంగా నిర్వహించడం)లో పాల్గొన్న వ్యక్తులపై ఆర్ పి ఎఫ్ (RPF) "ఆపరేషన్ ఉపలబ్ద్" కోడ్ పేరుతో ఉద్యమ బాణీ లో తీవ్రమైన మరియు నిరంతర కొనసాగే చర్యలను చేపట్టింది.
మానవ మేధ, ఆర్‌పిఎఫ్ బృందం అందించిన ఖచ్చితమైన డిజిటల్ సమచారం ఆధారంగా ఇటీవల రైల్వే టిక్కెట్‌లను పెద్దమొత్తంలో కైవసం చేయడానికి కోవిడ్ -19 (COVID-19) అనే అక్రమ సాఫ్ట్‌వేర్ ని ఉపయోగిస్తున్న రాజ్‌కోట్‌కు చెందిన మన్నన్ వాఘేలా (ట్రావెల్ ఏజెంట్)ని పట్టుకోవడంలో ఆర్ పి ఎఫ్ (RPF) బృందం విజయం సాధించింది. వాఘేలా అందించిన సమాచారం ఆధారంగా 17.07.2022న ముంబై నుండి కన్హయ్య గిరి ( కోవిడ్-X, ఎ ఎన్ ఎం ఎస్ బాక్ (ANMSBACK), బ్లాక్ టైగర్ మొదలైన అక్రమ సాఫ్ట్‌వేర్ అగ్రశ్రేణి అమ్మకందారు) ని కూడా 20.07.2022 న అరెస్టు చేశారు. విచారణ సమయంలో, గిరి అన్ని విషయాలు బయటపెట్టాడు. అరెస్టయిన గిరి వాపికి చెందిన ఇతర సహచరులు మరియు అడ్మిన్/డెవలపర్ అభిషేక్ శర్మ పేర్లను వెల్లడించాడు. ఈ అక్రమ సాఫ్ట్‌వేర్‌లన్నింటికీ అడ్మిన్‌గా వ్యవహరించినట్లు అభిషేక్ శర్మ అంగీకరించాడు.
అరెస్టయిన నిందితులు అందించిన సమాచారం ఆధారంగా, మరో ముగ్గురు నిందితులైన అమన్ కుమార్ శర్మ, వీరేంద్ర గుప్తా మరియు అభిషేక్ తివారీలను వరుసగా ముంబై, వల్సాద్ (గుజరాత్), సుల్తాన్‌పూర్ (యుపి) లలో అరెస్టు చేశారు. ఈ కేసు తో సంబంధం ఉన్న మరికొంత మంది అనుమానితుల కోసం ఆర్పీఎఫ్ గాలిస్తోంది.
ఈ నిందితులు ఐ ఆర్ సి టి సి (IRCTC) యొక్క నకిలీ వర్చువల్ నంబర్‌లు మరియు నకిలీ వినియోగదారు ఐ డి లను అందించే చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధి మరియు విక్రయాలలో పాల్గొన్నారు , వీటి తో పాటు సోషల్ మీడియా అంటే టెలిగ్రామ్, వాట్సాప్ మొదలైన వాటిని ఉపయోగించారు. ప్రతి ఐ పి (IP)చిరునామాకు పరిమిత సంఖ్యలో టిక్కెట్లను పొందేందుకు వినియోగదారులపై విధించిన పరిమితిని అధిగమించడానికి ఈ నిందితులు నకిలీ ఐ పి (IP) చిరునామాలను రూపొందించే సాఫ్ట్‌వేర్‌లను వాడుతున్నారు. వారు ఐ ఆర్ సి టి సి (IRCTC) లో నకిలీ వినియోగదారు ఐ డి (ID)లను సృష్టించడానికి ఓ టీ పీ (OTP) ధృవీకరణ కోసం ఉపయోగించే డిస్పోజబుల్ మొబైల్ నంబర్‌లు మరియు డిస్పోజబుల్ ఇమెయిల్‌లను కూడా విక్రయించారు.
ప్రయాణం ప్రారంభం కాని రూ. 43,42,750/- విలువైన 1688 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు మరియు జప్తు చేశారు. ఈ కేసులో నిందితులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గతంలో 28.14 కోట్ల విలువైన టిక్కెట్లను కొనుగోలు చేసి విక్రయించి భారీ కమీషన్ పొందారు. ఈ అక్రమ వ్యవహారం తో ఎన్నో అక్రమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చగల నల్లధనం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమవుతోంది.
నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా రైల్వే రిజర్వేషన్ లోని లొసుగులను పూడ్చడానికి మరియు అటువంటి అక్రమచర్యలు నిలువరించేందుకు ఒక బృందం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుంది.
***
(Release ID: 1855354)
Visitor Counter : 178