రక్షణ మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల ద్వారా రక్షణ దిగుమతులను తగ్గించడానికి మరియు రక్షణలో ‘ఆత్మనిర్భర్తత ను సాధించడానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన 780 లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్‌లు/భాగాల మూడవ సానుకూల స్వదేశీీకరణ జాబితాను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు.
Posted On:
28 AUG 2022 10:14AM by PIB Hyderabad
'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' కింద రక్షణ తయారీలో స్వావలంబన కోసం మరియు కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల (DPSUs) దిగుమతులను తగ్గించడం కోసం, రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మూడవ సానుకూల దేశీయీకరణ జాబితా (PIL)కి ఆమోదం తెలిపారు. లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు (LRUలు)/సబ్-సిస్టమ్‌లు/కాంపోనెంట్‌లు నిర్ణీత గడవు దాటిన తర్వాత దేశీయ పరిశ్రమ నుండి మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ అంశాల వివరాలు శ్రిజన్ పోర్టల్ (www.srijandefence.gov.in)లో అందుబాటులో ఉన్నాయి. అవి జాబితాలో సూచించిన నిర్ణీత గడవు దాటిన తర్వాత భారతీయ పరిశ్రమ నుండి మాత్రమే కొనుగోలు చేస్తారు.
డిసెంబరు 2021 మరియు మార్చి 2022లో ప్రచురించబడిన లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్‌లు/అసెంబ్లీలు/సబ్-అసెంబ్లీలు/భాగాల యొక్క రెండు సానుకూల దేశీయీకరణ జాబితా (PIL)లకు కొనసాగింపుగా ఈ జాబితా ఉంది. ఈ జాబితాలలో ఇప్పటికే దేశీయంగా ఉన్న 2,500 అంశాలు మరియు 458 (351+107) అంశాలు ఉన్నాయి. నిర్ణీత గడవు తర్వాత రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ స్వదేశీ చేయబడుతుంది. 458లో, 167 అంశాలు (1వ పిఐఎల్ -163, 2వ పిఐఎల్ -4) ఇప్పటివరకు స్వదేశీీకరించబడ్డాయి.
'మేక్' కేటగిరీ కింద వివిధ మార్గాల ద్వారా ఈ వస్తువుల తయారీ దేశీయీకరణ జరుగుతుంది. ‘మేక్’ కేటగిరీ తో భారతీయ పరిశ్రమలో ఎక్కువ మందికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా స్వావలంబన సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పరిశ్రమ ద్వారా పరికరాలు, సిస్టమ్‌లు, ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లు లేదా వాటి అప్‌గ్రేడ్‌ల రూపకల్పన మరియు అభివృద్ధితో కూడిన ప్రాజెక్ట్‌లను ఈ వర్గం కింద చేపట్టవచ్చు.
ఈ లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్‌లు/భాగాల యొక్క దేశీయ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది మరియు కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అదనంగా, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ యొక్క డిజైన్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి మరియు ఈ సాంకేతికతలలో భారతదేశాన్ని డిజైన్ లీడర్‌గా ఎదగడానికి సహాయపడుతుంది.
కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ (EoI)/ప్రతిపాదనల కోసం అభ్యర్థన (RFP)ని విడుదల చేస్తాయి. పరిశ్రమ పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంది. పరిశ్రమకు సమాచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన శ్రీజన్ డ్యాష్‌బోర్డ్ (https://srijandefence.gov.in/DashboardForPublic)లో EoI/RFPల వివరాలు అందుబాటు లో ఉన్నాయి.
****
(Release ID: 1855066)
Visitor Counter : 202