ప్రధాన మంత్రి కార్యాలయం

2022 ఆగస్టు నెల 28 వతేదీ నాటి ‘ మన్కీబాత్ ’ (‘ మనసులోమాట ’) కార్యక్రమం92 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 28 AUG 2022 11:37AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ఈ ఆగస్టు నెల లో మీ ఉత్తరాలు, సందేశాలు, కార్డు లు నా కార్యాలయాన్ని త్రివర్ణ భరితం గా చేసివేశాయి. త్రివర్ణ పతాకం లేనటువంటి లేదా త్రివర్ణ పతాకం, స్వేచ్ఛ లను గురించిన విషయాలు చోటు చేసుకోనటువంటి ఏ లేఖ ను నేను బహుశా చూడలేదు. పిల్లలు, యువ స్నేహితులు అమృత్ మహోత్సవ్ సందర్భం లో అందమైన చిత్రాల ను, కళాకృతుల ను పంపారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ మాసం లో మన దేశం లో, ప్రతి నగరం లో, ప్రతి గ్రామం లో అమృత్ మహోత్సవ్ యొక్క అమృత ధార ప్రవహిస్తున్నది. అమృత్ మహోత్సవ్ తో పాటు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ ప్రత్యేక సందర్భం లో దేశ సామూహిక శక్తి ని మనం చూశాం. ఒక చైతన్యం తాలూకు అనుభూతి కలిగింది. ఇంత పెద్ద దేశం, ఇన్ని వైవిధ్యాలు. అయితే ఎప్పుడైతే మువ్వన్నెల జెండా ను ఎగురవేసే వేళ సమీపించిందో, అప్పుడు అందరు, ఒకే భావన తో వ్యవహరించినట్టు గా అనిపించింది. మూడు రంగుల ధ్వజం యొక్క గౌరవాన్ని కాపాడడం లో ప్రథమ రక్షకులు గా ప్రజలు స్వయం గా ముందుకు వచ్చారు. స్వచ్చత అభియాన్ లో, టీకామందు ప్రచార ఉద్యమం లో దేశం యొక్క ఉత్సాహాన్ని గమనించాను. అమృత్ మహోత్సవ్ లో మళ్లీ అదే దేశభక్తి తాలూకు భావన వ్యక్తం అవుతున్నది. మన సైనికులు బాగా ఎత్తుల లో ఉన్నటువంటి పర్వతాల శిఖరాల మీద, దేశ సరిహద్దుల లో, మరి సముద్రం మధ్య లో తిరంగా ను ఎగురవేశారు. తిరంగా అభియాన్ కోసం ప్రజలు వేరు వేరు వినూత్నమైన ఆలోచనల ను చేశారు. ఎలా అంటే, ఉదాహరణ కు తీసుకొంటే, ఒక పజిల్ కళాకారుని గా ఉన్న యువ సహచరుడు కృశ్ నీల్ అనిల్ గారు రెకార్డు సమయం లో మొజాయిక్ కళ తో అందమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. కర్ణాటక లోని కోలార్ లో, ప్రజలు 630 అడుగుల పొడవు మరియు 205 అడుగు ల వెడల్పు తో కూడిన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని అపురూప మైనటువంటి దృశ్యాన్ని ప్రదర్శించారు. అసమ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు దిఘాలిపుఖురి యుద్ధ స్మారకం లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం కోసం వారి చేతుల తో 20 అడుగు ల జెండా ను సిద్ధం చేశారు. అదే విధంగా ఇందౌర్ లో ప్రజలు మానవ హారం గా ఏర్పడడం ద్వారా భారతదేశం యొక్క చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. చండీగఢ్ లో, యువత విశాలమైనటువంటి మానవ త్రివర్ణ పతాకం గా నిలబడ్డారు. ఈ రెండు ప్రయత్నాల ను కూడాను గినెస్ రెకార్డు లో సైతం నమోదు చేయడం జరిగింది. వీటన్నిటి మధ్య, హిమాచల్ ప్రదేశ్ లోని గంగోట్ పంచాయతీ నుండి ఒక గొప్ప ప్రేరణదాయకమైనటువంటి ఉదాహరణ కూడా కనిపించింది. అక్కడ పంచాయతీ లో జరిగిన స్వాతంత్య్ర దిన కార్యక్రమం లో ప్రవాసీ శ్రమికుల పిల్లల ను ముఖ్య అతిథులు గా భాగస్వాముల ను చేయడమైంది.

సహచరులారా, అమృత్ మహోత్సవ్ లోని ఈ రంగు లు ఒక్క భారతదేశం లోనే కాదు, గాని, ప్రపంచం లోని ఇతర దేశాల లో కూడాను కనిపించాయి. బోత్స్ వానా లో అక్కడ నివసిస్తున్న స్థానిక గాయకులు భారతదేశాని కి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన ఘట్టాన్ని వేడుక గా జరుపుకోవడం కోసం 75 దేశభక్తి గీతాల ను ఆలాపించారు. ఇందులో మరింత విశేషం ఏమిటి అంటే, అది ఈ 75 పాట లు హిందీ, పంజాబీ, గుజరాతీ, బంగ్లా, అసమియా, తమిళం, తెలుగు, కన్నడం ఇంకా సంస్కృతం వంటి భాషల లో పాడారు. ఇదే రీతి న, నమీబియాలో భారతదేశం-నమీబియా యొక్క సాంస్కృతిక-సాంప్రదాయిక సంబంధాలపై ప్రత్యేక స్టాంపు ను విడుదల చేయడం జరిగింది.

సహచరులారా, నేను మరో సంతోషకరమైనటువంటి విషయాన్ని తెలియజేయాలని అనుకొంటున్నాను. కొద్ది రోజుల కిందటే, భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాని కి హాజరు అయ్యే అవకాశం నాకు లభించింది. అక్కడ వారు దూరదర్శన్ ధారావాహిక స్వరాజ్ప్రదర్శన ను ఏర్పాటు చేశారు. ఆ ప్రీమియర్ కు వెళ్లే అవకాశం నాకు దక్కింది. స్వాతంత్య్ర ఉద్యమం లో పాలుపంచుకొన్న గుర్తింపునకు నోచుకోనటువంటి నాయకుల, నాయిక ల ప్రయాసల ను గురించి దేశం లోని యువ తరాని కి పరిచయం చేయడానికి చేపట్టినటువంటి ఒక శ్రేష్ఠమైన కార్యక్రమం ఇది. దూరదర్శన్ లో, ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల కు, దీనిని ప్రసారం చేయడం జరుగుతుంది. ఇది 75 వారాల పాటు సాగనుంది. నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే మీరు వీలు చేసుకొని దీనిని స్వయం గా చూడండి, మీ పిల్లల కు కూడా తప్పక చూపించండి అనే. పాఠశాల లు, కాలేజీల వారు ఈ కార్యక్రమాన్ని రెకార్డ్ చేసి; సోమవారం పాఠశాల లు, కళాశాల లు తెరచినప్పుడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ చూపించవలసింది గా నేను కోరుతున్నాను. తద్వారా స్వాతంత్ర్య సముపార్జన కోసం శ్రమించిన ఈ గొప్ప వీరుల పట్ల మన దేశంలో అవగాహన కలుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తదుపరి సంవత్సరం - అంటే 2023 ఆగస్టు వరకు జరుగుతుంది. దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసం మనం చేస్తున్న రచనల ను, కార్యక్రమాల ను మరింత ముందుకు తీసుకుపోవలసి ఉంది.

ప్రియమైన నా దేశ ప్రజలారా, నేటికీ మన పూర్వికుల జ్ఞానం, మన పూర్వికుల దూరదృష్టి, మన పూర్వికుల అంతర్దర్శనం ఎంతో ప్రభావశీలత ను కలిగి ఉన్నాయి. ఈ విషయాలపై లోతుగా తరచి చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.

ఓమాన్-మాపో మానుషీ: అమృక్తమ్ ధాత్ తోకాయ తనయాయ శం యోః

యూయం హిష్ఠా భిషజో మాతృతమా విశ్వస్య స్థాతు: జగతో జనిత్రీ:

అని వేల సంవత్సరాల నాటి మన ఋగ్వేదం లో చెప్పారు.

ఈ మాటల కు ఓ జలమా! నీవు మానవాళి కి పరమ మిత్రుడి వి. నీవు జీవనప్రదాత గా ఉన్నావు. నీ నుండే అన్నం ఉత్పన్నం అవుతుంది. మరి నీతోనే మా సంతానాని కి మేలు కలుగుతుంది. నీవే మాకు రక్షణ ను అందిస్తున్నావు. ఇంకా అన్ని చెడుల ను దూరం గా ఉంచుతావు కూడాను. నీవు, అన్నిటి కంటే ఉత్తమ ఔషధం గా ఉన్నావు. ఇంకా నీవే ఈ బ్రహ్మాండాన్ని పెంచి పోషిస్తున్నావు.అని భావం.

ఆలోచించండి, మన సంస్కృతి లో వేల సంవత్సరాల క్రితమే నీరు మరియు నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వివరించడమైంది. నేటి సందర్భం లో ఈ జ్ఞానాన్ని చూసినప్పుడు మనం పులకించిపోతాం. దేశం ఈ జ్ఞానాన్ని తన శక్తి గా స్వీకరించినప్పుడు దేశ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది నాలుగు నెలల కిందట మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో నేను అమృత్ సరోవరాల ను గురించి మాట్లాడాను. ఆ తరువాత వివిధ జిల్లాల లో స్థానిక పరిపాలన జత గూడింది. స్వయం సేవా సంస్థ లు తోడయ్యాయి. స్థానిక ప్రజలు భాగస్వాములు అయ్యారు. చూస్తూ ఉండగానే అమృత్ సరోవరాల నిర్మాణం ప్రజా ఉద్యమం గా మారింది. దేశం కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి ఒక భావన ఉన్నప్పుడు, తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు, రాబోయే తరాల పట్ల ఆలోచన ఉన్నప్పుడు సామర్థ్యం కూడా జతవుతుంది. సంకల్పం ఉదాత్తం అవుతుంది. తెలంగాణ లోని వరంగల్ నుండి క గొప్ప ప్రయత్నం గురించి తెలుసుకున్నాను. అక్కడ కొత్త గ్రామ పంచాయితీ ఏర్పడింది. ఆ పంచాయతీ పేరు మంగ్త్యా-వాల్యా తాండా’. ఈ గ్రామం అటవీ ప్రాంతాని కి సమీపం లో ఉంది. వర్ష కాలం లో చాలా నీరు నిలవ ఉండే ప్రాంతం సమీపం లో ఈ పంచాయతీ ఉంది. గ్రామస్థుల చొరవ తో ఇప్పుడు ఈ స్థలాన్ని అమృత్ సరోవర్ అభియాన్ లో భాగం గా అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి వర్షకాలం లో కురిసిన వర్షాల కారణం గా ఈ చెరువు నీటి తో నిండిపోయింది.

మధ్య ప్రదేశ్ లోని మాండ్ లా లో ఉన్న మోచా గ్రామ పంచాయతీ లో నిర్మించిన అమృత్ సరోవర్ ను గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమృత్ సరోవర్ కాన్హా జాతీయ ఉద్యానానికి సమీపం లో రూపొందింది. దీని వల్ల ఈ ప్రాంతం అందం మరింత గా పెరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్ పుర్ లో కొత్త గా నిర్మించిన శహీద్ భగత్ సింహ్ అమృత్ సరోవర్ సైతం ప్రజల ను ఆకర్షిస్తున్నది. అక్కడి నివారి గ్రామ పంచాయతీ లో నిర్మించిన ఈ సరస్సు 4 ఎకరాల లో విస్తరించి ఉంది. సరస్సు ఒడ్డు న ఉన్న తోట లు దాని అందాన్ని పెంచుతున్నాయి. సరస్సు సమీపంలోని 35 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. కర్నాటక లోనూ అమృత్ సరోవర్ ఉద్యమం జోరు గా సాగుతోంది. ఇక్కడ బాగల్ కోట్ జిల్లా లోని బిల్కెరూర్గ్రామం లో ప్రజలు చాలా అందమైన అమృత సరోవరాన్ని నిర్మించారు. వాస్తవానికి ఈ ప్రాంతం లో కొండ నుండి నీరు రావడం తో ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొనే వారు. రైతుల కు కష్టం, వారి పంటల కు నష్టం కలిగేవి. అమృత్ సరోవరాన్ని నిర్మించడం కోసం గ్రామీణులు నీటి ని అంతటి ని మళ్లించి ఒక చోటు కు తీసుకు వచ్చారు. దీనితో ఆ ప్రాంతం లో వరద సమస్య కూడా తీరిపోయింది. అమృత్ సరోవర్ అభియాన్ నేటి మన అనేక సమస్యల ను పరిష్కరించడం తో పాటు రాబోయే తరాల కు కూడా అంతే అవసరం గా ఉంది. ఈ ప్రచారంలోచాలా చోట్లపాత నీటి వనరులను కూడా పునరుద్ధరించారు. జంతువుల దాహం తీర్చడంతో పాటు వ్యవసాయానికి కూడాఅమృత సరోవర్ను వినియోగిస్తున్నారు.ఈ చెరువుల వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. అదే సమయంలో వాటి చుట్టూ పచ్చదనం కూడా పెరుగుతోంది. ఇదొక్కటే కాదు-అమృత్ సరోవర్లో చేపల పెంపకం కోసం చాలా చోట్ల ప్రజలు సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. అమృత్ సరోవర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని; ఈ నీటి నిల్వ, నీటి సంరక్షణ ప్రయత్నాలకు పూర్తి శక్తిని అందించి, వాటిని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మలని అందరినీ -ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను.

ప్రియమైన నా దేశవాసులారా, అసమ్ లోని బొంగై గాఁవ్ లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టు ను నిర్వహించడం జరుగుతోంది. అదే ప్రాజెక్ట్ సంపూర్ణ. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే పోషకాహార లోపాని కి వ్యతిరేకం గా పోరాడటం చేయడం. ఈ పోరాటం చేసే పద్ధతి కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇందులో భాగం గా ఆంగన్ వాడీ కేంద్రం లోని ఆరోగ్యవంతమైన బిడ్డ యొక్క తల్లి ప్రతి వారం పోషకాహార లోపం ఉన్న పిల్ల ల తల్లి ని కలుసుకొని పౌష్టిక ఆహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని గురించి చర్చిస్తుంది. అంటే ఒక తల్లి మరొక తల్లి కి స్నేహితురాలు అవుతుంది. ఆమె కు సహాయం చేస్తుంది. ఆమె కు నేర్పిస్తుంది. ఈ ప్రాజెక్టు సహాయం తో ఆ ప్రాంతం లో ఒక సంవత్సరం లో 90 శాతాని కి పైగా పిల్లల పోషకాహార లోపం దూరం అయింది. మీరు ఊహించగలరా, పోషకాహార లోపాన్ని తొలగించడానికి పాటల ను, సంగీతాన్ని, భజనల ను కూడా ఉపయోగించవచ్చు అనే సంగతి ని ? మధ్య ప్రదేశ్ లోని దతియా జిల్లా లో సాగుతున్న ‘‘మేరా బచ్చా అభియాన్’’ లో వీటిని విజయవంతంగా ఉపయోగించారు. దీనిలో భాగం గా జిల్లా లో భజనల ను, కీర్తనల ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పోషణ్ గురుఅని పిలిచే శిక్షకుల కు పిలిపించడమైంది. ఒక మట్ కా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో మహిళ లు పిడికెడు బియ్యాన్ని ఆంగన్ వాడీ కేంద్రాని కి తీసుకు వస్తారు. మరి ఆ బియ్యం తో శనివారాల లో బాల్ భోజ్ను నిర్వహణ జరుగుతుంది. దీంతో ఆంగన్ వాడీ కేంద్రాల లో చిన్నారుల హాజరు పెరగడంతో పాటు పోషకాహార లోపం కూడా తగ్గుముఖం పట్టింది. పోషకాహార లోపం పై అవగాహన ను పెంచేందుకు ఝార్ ఖండ్ లో ఒక అద్వితీయమైన ప్రచార ఉద్యమం కూడా జరుగుతున్నది. ఝార్ ఖండ్ లోని గిరిడీహ్ లో పాము- నిచ్చెన అనే ఆట ను రూపొందించడం జరిగింది. ఆడే ప్రతి ఒక్క ఆట లోనూ పిల్లలు మంచి అలవాటుల ను గురించి, చెడు అలవాటుల ను గురించి నేర్చుకొంటూ ఉంటారు.

సహచరులారా, పోషకాహార లోపాని కి సంబంధించిన అనేక వినూత్న ప్రయోగాల ను గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే వచ్చే నెల లో మనమంతా ఈ ప్రచార ఉద్యమం తో జతపడాలి. సెప్టెంబర్ నెల పండుగల తో పాటు పోషకాహారానికి సంబంధించిన అతి పెద్ద ప్రచారాని కి కూడా అంకితం అయింది. మనం ప్రతి ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషణ మాసాన్ని జరుపుకొంటాం.

పోషకాహార లోపాని కి వ్యతిరేకం గా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మక, వివిధత్వం నిండిన ప్రయాసల ను చేపట్టడం జరుగుతున్నది. సాంకేతికత ను మెరుగైన రీతి న వినియోగించడం తో పాటు ప్రజల భాగస్వామ్యం అనేది పోషకాహార ప్రచార ఉద్యమం లో ముఖ్యమైన భాగం గా మారింది. దేశం లోని లక్షల కొద్దీ ఆంగన్ వాడీ కార్యకర్తల కు మొబైల్ డివైస్ లను అందించడం మొదలుకొని ఆంగన్ వాడీ సేవల వ్యాప్తి ని పర్యవేక్షించడం కోసం పోషణ్ ట్రాకర్ ను కూడా ప్రారంభించడమైంది.

అన్ని ఆకాంక్షభరిత జిల్లా లు మరియు ఈశాన్య రాష్ట్రాల లో 14 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిల ను కూడాను, పోషణ్ అభియాన్ పరిధి లోకి తీసుకు రావడమైంది. పోషకాహార లోపం సమస్య కు పరిష్కారం ఈ దశల కే పరిమితం కాదు - ఈ పోరాటం లో అనేక ఇతర కార్యక్రమాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు జల్ జీవన్ మిశన్ ను తీసుకోండి. భారతదేశాన్ని పోషకాహార లోపం రహితం గా మార్చడం లో ఈ మిశన్ కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది. పోషకాహార లోపం సంబంధి సవాళ్ల ను ఎదుర్కోవడం లో సామాజిక అవగాహన తో ముడిపడ్డ ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర ను పోషిస్తాయి. నేను మిమ్మల్ని అందరిని కోరేది ఏమిటి అంటే అది మీరు రాబోయే పోషణ మాసం లో పోషకాహార లోపాన్ని తొలగించే ప్రయాసల లో భాగం పంచుకోవాలి అనేదే.

ప్రియమైన నా దేశప్రజలారా, చెన్నై కి చెందిన శ్రీదేవి వరదరాజన్ గారు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. కొత్త సంవత్సరం రావడానికి 5 నెలల కంటే తక్కువ సమయం ఉంది. రాబోయే నూతన సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా జరుపుకొంటాం అని మనందరికీ తెలుసుఅని ఆమె మైగవ్ ( MyGov ) లో రాశారు. దేశ చిరుధాన్యాల భౌగోళిక చిత్ర పటాన్ని కూడా ఆమె నాకు పంపారు. మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క రాబోయే ఎపిసోడ్ లో మీరు దీని ని గురించి చర్చించగలరా అంటూ కూడా ఆమె అడిగారు. నా దేశ ప్రజల లో ఈ తరహా స్ఫూర్తి ని చూడడం నాకు చాలా సంతోషం గా ఉంది. ఐక్య రాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. భారతదేశం చేసిన ఈ ప్రతిపాదన కు 70 కి పైగా దేశాల సమర్థన లభించింది అని తెలిస్తే మీరు కూడా చాలా సంతోషిస్తారు. నేడు ప్రపంచవ్యాప్తం గా ఈ చిరుధాన్యాల పైన మోజు పెరుగుతూ ఉంది. సహచరులారా, నేను చిరు ధాన్యాల ను గురించి మాట్లాడేటప్పుడు నా ప్రయత్నాల లో ఒక ప్రయత్నాన్ని గురించి మీకు ఈ రోజు న వెల్లడి చేయాలనుకొంటున్నాను. కొంత కాలం గా విదేశీ అతిథులు , వివిధ దేశాల అధినేత లు భారతదేశాని కి వచ్చారంటే అప్పుడు వారి భోజనానికి భారతదేశం లోని చిరుధాన్యాల తో వంటల ను తయారు చేయించాలి అనేది నా ప్రయత్నం గా ఉంటుంది. మరి ఆ మహానుభావుల కు ఆ వంటకాలు చాలా నచ్చాయి అని అనుభవం లోకి వచ్చింది. మన చిరుధాన్యాల ను గురించి బోలెడంత సమాచారాన్ని సేకరించాలని కూడా వారు యత్నిస్తుంటారు. చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు ప్రాచీన కాలం నుండి మన వ్యవసాయం లో, సంస్కృతి లో మరియు నాగరికత లో భాగం గా అయిపోయాయి. మన వేదాల లో చిరుధాన్యాల ప్రస్తావన ఉంది. అదే విధం గా పురాణాల లో, తోల్కాప్పియమ్ లో కూడా వీటి ప్రస్తావన ఉంది. దేశం లోని ఏ ప్రాంతాని కి వెళ్లినా అక్కడి ప్రజల ఆహారం లో వివిధ రకాల చిరుధాన్యాలు ఉంటాయి. మన సంస్కృతి లాగే చిరుధాన్యాలు కూడా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, కొర్రలు, ఒరిగలు, అరికెలు, సామలు, ఉలవలు - ఇవన్నీ చిరుధాన్యాలే. ప్రపంచం లోనే అత్యధికం గా చిరుధాన్యాల ను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత కూడా భారతీయులమైన మన భుజాల పైన ఉంది. మనమందరం కలసి దీనిని ఒక ప్రజా ఉద్యమం గా మార్చాలి. దేశ ప్రజల లో చిరుధాన్యాల పై అవగాహన పెంచాలి. మరి సహచరులారా, మీకు బాగా తెలుసు.. చిరుధాన్యాలు రైతుల కు- ముఖ్యంగా చిన్న రైతుల కు కూడా ప్రయోజనకరం. వాస్తవానికి పంట చాలా తక్కువ సమయం లో సిద్ధం గా ఉంటుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. ముఖ్యం గా మన చిన్న రైతుల కు చిరుధాన్యాలు మేలు చేస్తాయి. చిరుధాన్యాల గడ్డి ని కూడా ఉత్తమ మేత గా పరిగణిస్తారు. ఈ రోజుల్లో యువతరం ఆరోగ్యకరమైన జీవనం, ఆహారం పై చాలా దృష్టి పెడుతుంది. ఈ విధం గా చూసినా చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చాలా మంది దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చిరుధాన్యాలలో ఒకటి కాదు- అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఊబకాయాన్ని తగ్గించడం తో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధి వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి. ఉదర వ్యాధులు, కాలేయ వ్యాధుల నుండి రక్షించడం లో కూడా ఇవి సాయపడతాయి. కొంతకాలం క్రితమే మనం పోషకాహార లోపాన్ని గురించి మాట్లాడుకొన్నాం. పోషకాహార లోపం తో పోరాడడం లో చిరుధాన్యాలు కూడా చాలా ప్రయోజనకరం గా ఉంటాయి. ఎందుకంటే అవి శక్తి తో పాటు ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ప్రస్తుతం దేశం లో చిరుధాన్యాల ను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనల పై, ఆవిష్కరణల పై దృష్టి సారించడం తో పాటు ఉత్పత్తి ని పెంచేందుకు రైతు ఉత్పత్తి సంఘాల ను ప్రోత్సహిస్తున్నారు. నా రైతు సోదరులు, రైతు సోదరీమణులు చిరుధాన్యాల ను- అంటే ముతక ధాన్యాల ను తమవి గా భావించి, లాభాలు పొందాలని నా మనవి. చిరుధాన్యాల పై పనిచేస్తున్న అనేక స్టార్ట్ - అప్స్ ప్రస్తుతం పుట్టుకు వస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. కొందరు మిలిట్ కుకీల ను తయారు చేస్తూ ఉంటే, మరికొంత మంది మిలిట్ పాన్ కేక్స్ ను, దోశల ను కూడా తయారు చేస్తున్నారు. మిలిట్ ఎనర్జీ బార్స్ , మిలిట్ బ్రేక్ ఫస్ట్ లను తయారు చేస్తున్న వారు ఇంకొందరు ఉన్నారు. ఈ రంగంలో పని చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు. ఈ పండుగ ల కాలం లో మనం చాలా వంటల లో చిరుధాన్యాల ను కూడా ఉపయోగిస్తాం. మీరు మీ ఇళ్లలో తయారు చేసిన అటువంటి వంటకాల చిత్రాల ను తప్పక సామాజిక మాధ్యమాల లో వెల్లడించండి. మిలిట్స్ ను గురించి ప్రజల లో అవగాహన పెంచడం లో ఇది తోడ్పడుతుంది.

ప్రియమైన నా దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం, అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లా లో జోర్ సింగ్ గ్రామం నుండి ఒక వార్త ను నేను చూశాను. ఆ వార్త ఆ గ్రామీణులు సంవత్సరాల తరబడి వేచి ఉన్న మార్పునకు సంబంధించింది. నిజానికి ఈ నెల లో జోర్ సింగ్ పల్లె లో స్వాతంత్య్ర దినం నుంచే 4జి ఇంటర్ నెట్ సేవ లు మొదలయ్యాయి. అంతకు ముందు పల్లెల లో కరెంటు వచ్చినప్పుడు ప్రజలు సంతోషించే వారు. ఇప్పుడు నవ భారతదేశం లో 4జి వస్తే అదే ఆనందాన్ని పొందుతున్నాం. అరుణాచల్, ఈశాన్యం లోని మారుమూల ప్రాంతాల లో 4జి రూపం లో ఒక కొత్త సూర్యోదయం అయింది. ఇంటర్ నెట్ కనెక్టివిటి కొత్త ఉదయాన్ని తెచ్చింది. ఒకప్పుడు పెద్ద నగరాల లో మాత్రమే ఉన్న సౌకర్యాల ను డిజిటల్ ఇండియా గ్రామ గ్రామాని కి తీసుకు వచ్చింది. దీని వల్ల దేశం లో కొత్త డిజిటల్ ఆంత్రప్రెన్యోర్స్ ఆవిర్భవిస్తున్నారు. రాజస్థాన్ లోని అజ్మేర్ జిల్లా కు చెందిన సేఠా సింగ్ రావత్ గారు దర్జీ ఆన్ లైన్అనే ఇ-స్టోర్ను నిర్వహిస్తున్నారు. దర్జీ ఆన్ లైన్అంటే ఏమిటి అని మీరు ఆలోచిస్తారు. నిజాని కి- సేఠా సింగ్ రావత్ గారు కోవిడ్ కు ముందు టైలరింగ్ పని ని చేసే వారు. కోవిడ్ వచ్చినప్పుడు రావత్ గారు ఆ సవాలు ను కష్టం గా కాక ఒక అవకాశం గా తీసుకున్నారు. ఆయన కామన్ సర్వీస్ సెంటర్అంటే సిఎస్ సి ఇ-స్టోర్ లో చేరారు. ఆన్ లైన్ లో పని చేయడం మొదలుపెట్టారు. వినియోగదారులు పెద్ద సంఖ్య లో మాస్కు ల కోసం ఆర్డర్ లను ఇవ్వడాన్ని ఆయన గమనించారు. ఆయన కొంతమంది మహిళల ను పని కి కుదుర్చుకొని మాస్కుల ను తయారు చేయడం ఆరంభించారు. దీని తరువాత ఆయన దర్జీ ఆన్ లైన్పేరు తో తన ఆన్ లైన్ స్టోర్ ను ప్రారంభించారు. అందులో అనేక రకాలైన బట్టల ను సిద్ధం చేసి విక్రయించడం మొదలుపెట్టారు. ఇవాళ డిజిటల్ ఇండియా యొక్క బలం తో సేఠా సింగ్ గారి పని ఎంత గా పెరిగిపోయింది అంటే ఇప్పుడు ఆయన కు దేశం నలుమూలల నుండి ఆర్డర్ లు వస్తున్నాయి. ఎంతో మంది మహిళల కు ఆయన తన దగ్గర ఉపాధి ని కల్పించారు. డిజిటల్ ఇండియా ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో నివసిస్తున్న ఓం ప్రకాశ్ సింహ్ గారిని కూడా డిజిటల్ ఆంత్రప్రెన్యోర్ గా మార్చివేసింది. ఆయన తన గ్రామం లో వెయ్యి కి పైగా బ్రాడ్ బ్యాండ్ కనెక్శన్ లను ఏర్పాటు చేశారు. ఓం ప్రకాశ్ గారు తన కామన్ సర్వీస్ సెంటర్ చుట్టుపక్కల ఉచిత వైఫై జోన్ ను కూడా ఏర్పాటు చేశారు. దానితో అవసరమైన వారికి చాలా సహాయం లభిస్తోంది. ఓం ప్రకాశ్ గారి పని ఇప్పుడు ఎంతగా పెరిగిపోయింది అంటే ఆయన 20 కి పైగా మందిని తన దగ్గర పని లో పెట్టుకొన్నారు. ఆయా గ్రామాల లోని పాఠశాల లు, ఆసుపత్రులు, తహసీల్ ఆఫీసు లు, ఆంగన్ వాడీ కేంద్రాల వరకు బ్రాడ్ బ్యాండ్ కనెక్శన్ ను అందిస్తున్నారు, మరి దీనితో ఉపాధి ని కూడా పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ వలెనే గవ్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ అంటే జిఇఎమ్ పోర్టల్ లో కూడా ఇటువంటి ఎన్నో విజయ గాథ లు కనిపిస్తున్నాయి.

సహచరులారా, నాకు గ్రామాల నుండి ఇటువంటి సందేశాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇంటర్ నెట్ కారణం గా వచ్చిన మార్పుల ను ఆ సందేశాలు నాకు తెలియజేస్తుంటాయి. ఇంటర్ నెట్ మన యువ సహచరుల చదువు మరి నేర్చుకొనే పద్ధతుల నే మార్చివేసింది. ఉదాహరణ కు, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గుడియా సింహ్ ఎప్పుడైతే ఉన్నావ్ లోని అమోఇయా గ్రామం లో ఉన్న తన అత్తమామ ల ఇంటి కి వచ్చిందో, అప్పుడు ఆమె తన చదువు ను గురించి ఆందోళన చెందారు. అయితే భారత్ నెట్ ఆమె యొక్క ఈ చింత ను తీర్చేసింది. గుడియా ఇంటర్ నెట్ ద్వారా తన చదువు ను కొనసాగించి, గ్రాడ్యుయేశన్ ను కూడా పూర్తి చేశారు. గ్రామగ్రామానా ఇలాంటి ఎన్నో జీవనాలు డిజిటల్ ఇండియా అభియాన్ నుండి కొత్త శక్తి ని అందుకొంటున్నాయి. మీరు గ్రామాల లోని డిజిటల్ నవ పారిశ్రామికుల ను గురించి వీలైనంత ఎక్కువ గా రాసి నాకు పంపించండి. మరి వారి సాఫల్య గాథల ను సామాజిక మాధ్యమాలలో తప్పక వెల్లడి చేయండి.

ప్రియమైన నా దేశప్రజలారా, కొంతకాలం కిందట హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోత రమేశ్ గారి దగ్గరి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. రమేశ్ గారు తన లేఖ లో పర్వతాల గొప్పతనాన్ని గురించి ప్రస్తావించారు. పర్వతాల మీద నివాసాలు చాలా దూరం ఉండవచ్చు. కానీ ప్రజల హృదయాలు ఒకదానికి మరొకటి చాలా దగ్గర గా ఉన్నాయిఅని ఆయన రాశారు. నిజమే, పర్వతాలపై నివసించే ప్రజల జీవితాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. పర్వత ప్రాంతాల లో ఉండే వారి జీవనశైలి, సంస్కృతి ల నుండి మనకు లభించే మొదటి పాఠం ఏమిటి అంటే మనం పరిస్థితుల ఒత్తిడి కి లోను కాకపోతే వాటిని సులభంగా అధిగమించవచ్చును. రెండోది- స్థానిక వనరుల తో మనం ఎలా స్వయం సమృద్ధి చెందగలమో కూడా తెలుసుకోవచ్చును అనేవే. నేను ప్రస్తావించిన మొదటి పాఠం, దాని అందమైన చిత్రం ఈ రోజుల్లో స్పీతీ ప్రాంతం లో కనిపిస్తుంది. స్పీతీ ఒక గిరిజన ప్రాంతం. అక్కడ ఈ రోజుల లో బఠానీల ను సేకరించే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంత పొలాల లో ఇది శ్రమ తో కూడుకొన్న పని. అయితే అక్కడ మాత్రం గ్రామం లోని మహిళ లు ఉమ్మడి గా ఒకరికి మరొకరు సహకరించుకొంటూ అందరి పొలాల లో నుండి బఠానీ లు కోస్తారు. ఈ పని తో పాటు మహిళలు స్థానిక పాట ఛప్ రా మాఝీ ఛప్ రా' ను కూడా పాడుతారు. అక్కడ పరస్పర సహకారం కూడా జానపద సంప్రదాయం లో భాగమే. స్థానిక వనరుల వినియోగాని కి కూడా ఉత్తమ ఉదాహరణ స్పీతీ లో ఉంది. స్పీతీ లో ఆవుల ను పెంచే రైతులు వాటి పేడ ను ఎండబెట్టి బస్తాల లో నింపుతారు. చలికాలం వచ్చినప్పుడు ఆ బస్తాల ను ఆవు ఉండే ప్రదేశం లో వేస్తారు. ఆ ప్రదేశాన్ని ఇక్కడ ఖూడ్ అని పిలుస్తారు. హిమపాతం మధ్య ఈ బస్తాలు చలి నుండి ఆవుల కు రక్షణ ను కల్పిస్తాయి. శీత కాలం తరువాత ఈ ఆవు పేడ ను పొలాల లో ఎరువు గా ఉపయోగిస్తారు. అంటే పశులవుల వ్యర్థాల నుండే వాటికి రక్షణ ను కల్పిస్తారు. వాటి నుండే పొలాలకు ఎరువు కూడా లభిస్తుంది. సాగు కు అయ్యే ఖర్చూ తక్కువ, పొలం లో దిగుబడి కూడా ఎక్కువ. అందుకే ఈ రోజుల లో, ప్రాకృతిక వ్యవసాయాని కి కూడాను ఒక ప్రేరణ గా మారుతోంది.

సహచరులారా, ఇటువంటి మెచ్చుకోదగిన అనేక ప్రయత్నాలు మన మరొక పర్వత రాష్ట్రం అయినటువంటి ఉత్తరాఖండ్ లో కూడాను గమనించవచ్చును. ఉత్తరాఖండ్ లో అనేక రకాల ఔషధాలు, వృక్షజాలం ఉన్నాయి. అవి మన ఆరోగ్యాని కి చాలా మేలు ను కలుగజేస్తాయి. వాటిలో ఒక పండే- బేడూ. దీనినే హిమాలయన్ ఫిగ్ అని కూడా అంటారు. ఈ పండు లో ఖనిజాలు, విటమిన్ లు పుష్కలమైన మోతాదుల లో లభిస్తాయి. ప్రజలు దీనిని పండు రూపం లో ఎలాగూ స్వీకరిస్తారనుకోండి, అలాగే అనేక వ్యాధుల చికిత్స లోనూ దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ పండు లోని ఈ గుణాల ను దృష్టి లో పెట్టుకొని ఇప్పుడు బేడూ యొక్క రసం, దీనితో తయారు చేసిన జామ్, చట్నీ, ఊరగాయ, ఇంకా దీనిని ఎండబెట్టి తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లను బజారు లోకి తీసుకురావడం జరిగింది. పిథౌరాగఢ్ పాలన యంత్రాంగం యొక్క చొరవ, స్థానికుల సహకారం తో బేడూ ను వేరు వేరు రూపాల లో బజారు లోకి తీసుకు రావడం లో సఫలత ప్రాప్తించింది. బేడూ ను పర్వత ప్రాంత అంజీర్ గా బ్రాండ్ చేసి ఆన్ లైన్ మార్కెటు లో సైతం ప్రవేశపెట్టడమైంది. దీనితో రైతుల కు ఆదాయం తాలూకు కొత్త వనరు అయితే దొరికిందనుకోండి, దాంతో పాటు గా బేడూ యొక్క ఔషధీయ గుణాల లాభం దూరదూరాల కు చేరుకోవడం మొదలయింది.

 

ప్రియమైన నా దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఈ రోజు న మొదట్లో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర్య దినం అనే గొప్ప పండుగ తో పాటు రానున్న రోజుల లో మరి ఎన్నో పండుగ లు రానున్నాయి. కొద్ది రోజుల తరువాత గణేశుడి ని పూజించే పండుగ గణేశ్ చతుర్థి వస్తున్నది. గణేశ్ చతుర్థి అంటే గణపతి బప్పా యొక్క ఆశీర్వాదాల పండుగ. గణేశ్ చతుర్థి కి ముందే ఓణమ్ పర్వదినం కూడా ఆరంభం అవుతుంది. ముఖ్యం గా కేరళ లో శాంతి, సమృద్ధి ల భావనల తో ఓణమ్ ను జరుపుకొంటారు. ఆగస్టు 30న హర్ తాళికా తీజ్ కూడా వస్తున్నది. సెప్టెంబర్ 1వ తేదీ న ఒడిశా లో నువాఖాయి పండుగ ను కూడా జరుపుకొంటారు. నువాఖాయి అంటే కొత్త ఆహారం. అంటే ఇది కూడా అనేక ఇతర పండుగ ల మాదిరి గా మన వ్యవసాయ సంప్రదాయాని కి సంబంధించిన పండుగ. వీటి మధ్య జైన సమాజం వారి సంవత్సరాది పండుగ కూడా ఉంటుంది. మన ఈ పండుగ లు అన్నీ మన సాంస్కృతిక సమృద్ధి కి, చైతన్యాని కి మారు పేరు లు గా ఉన్నాయి. నేను, మీ అందరి కి, ఈ పండుగ లు మరియు విశేష సందర్భాల కు గాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగల తో పాటు రేపు, అంటే ఆగస్టు 29వ తేదీ న మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి నాడు, జాతీయ క్రీడా దినం ను కూడా జరుపుకొంటాం. మన యువ క్రీడాకారిణులు, క్రీడాకారులు ప్రపంచ వేదికల పై మన త్రివర్ణ పతాకం యొక్క కీర్తి ని పెంపొందింపచేస్తూ ఉండాలి, ఇదే ధ్యాన్ చంద్ గారి కి ఇచ్చేటటువంటి శ్రద్ధాంజలి కాగలదు. దేశం కోసం మనం అంతా కలసి ఇలాగే పని చేస్తూ ఉందాం; దేశం యొక్క గౌరవాన్ని పెంచుతూ ఉందాం. ఈ అభిలాష తో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వచ్చే నెల లో మరో సారి మీతో మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం జరుగుతుంది.

చాలా చాలా కృతజ్ఞతలు.

 

***



(Release ID: 1854984) Visitor Counter : 256